Classification of Herbicides – a) మొక్కలపై విష ప్రభావం చూపే పద్ధతిని ఆధారం గా వర్గీకరణ:
i. కొన్ని రకాల మొక్కలపై మాత్రమే విష ప్రభావం చూపేవి (selective) ఉదా: మొక్కజొన్న పంటలో కలుపు నివారణ కు “అట్రజిన్” లేక “సీమజిస్”
ii. అన్ని రకాల కలుపు మరియు పంట మొక్కలపై విష ప్రభావం చూపేవి (non selective)
ఉదా: గ్రామాక్సోస్, గ్లైఫోసేట్
b) కలుపు మందులు ఉపయోగించే సమయాన్ని బట్టి వర్గీకరణ:
సోయా చిక్కుడు, ప్రత్తి) ఫూక్లోరాలిస్ వంటి కలుపు మందులను పిచికారి చేసి నేలను కలియ దున్ని ఒకటి రెండు రోజుల తర్వాత విత్తుకోవాలి. దీనివల్ల కలుపు గింజలు తాత్కాలికం గా మొలకెత్తవు. రాగి, వరి, చెరకు
1) విత్తనం విత్తడానికి ముందు:
ఉదా: వీటిని నేలపై పైరు / విత్తనం విత్తక ముందే (వేరుశెనగ, పప్పు ధాన్యాలు, వంటి పైర్ల ను నాటక ముందే మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక వంటి వాటిని నిర్మూలించే నిమిత్తం గ్లైఫోసేట్, పారాక్వాట్ వంటి ఘాటు రసాయనాలు వాడే వీలుంది. అవి వాడిన 20- 30 రోజుల తర్వాత మళ్ళీ భూమిని కలియదున్ని పైరు నాటుకోవాలి.
Also Read: Japanese Encephalitis in Pigs: పందుల లో జపనీస్-బి ఎన్ సెఫలైటిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!
2) విత్తనాలు వేసిన వెంటనే/ పైరు మొలవక ముందు: సాధారణం గా విత్తనం వేయగానే పైరు కంటే ముందుగానే కలుపు మొక్కలు మొలుస్తాయి. కొన్ని కలుపు మొక్కల రసాయనాలు మొలకెత్తు కలుపు మొక్కల మీద వాటి ప్రభావాన్ని బాగా చూపెట్టి మొలకెత్తే దశ లోనే వాటిని నిర్మూలిస్తాయి. ఉదా: మొక్క జొన్న పంటలో అట్రాజిన్, సీమాజిన్, అలాక్లోర్, జొన్న పంటలో అట్రాజిన్, అపరాలు (పప్పుజాతి పంటలు) – బుటాక్లోర్, పెండిమిథాలిన్, దింతియోకార్బ్ మరియు చెరుకు పంటకు అట్రాజిన్, అలాక్లోర్
3) పైరు మొలచిన తర్వాత ఉపయోగించు రసాయనాలు పైరుని నష్టపోకుండా కలుపు మొక్కలను మాత్రమే చంపగల రసాయనాలు ఉపయోగించ వచ్చు.
ఉదా: 2,4-D సోడియం సాల్ట్ (ఫెర్నాక్సోస్), బెంతియోకార్బ్ ను అపరాలు మొదలగు పంటలలో మాత్రమే తక్కువ మోతాదు లో వాడాలి. ఎట్టి పరిస్థితులలో నైనా మోతాదు మించినచో పైరు నష్టమవుతుంది.
4) పైరు నాటిన తర్వాత ఉపయోగించు రసాయనాలు: వరి నాటిన తర్వాత 3-5 రోజులలో గుళికల రూపం లో ఉన్న 2,4-D ఈథైల్ ఎస్టర్, బుటాక్లోర్, బెంథియో కార్బ్ గాని లేక ద్రావణ రూపం లో ఉన్న బుటా క్లోర్, బెంథియోకార్బ్, అనిలోఫాస్ అనే రసాయనాలను తగు మోతాదులో హెక్టరు కు 50 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం లోనె నుండి 5 సెం. మీ నీరు నిలగట్టి చల్లుకోవాలి.
c) వేసే పధ్ధతి ని బట్టి కలుపు రసాయనాల వర్గీకరణ:
నేలలో వేయునవి: సమర్ధ వంతమైన వినియోగానికి గుల్మ నాశినులను నేలపై జల్లి కలియ బెట్టాలి. ఉదా: వేరుశెనగ విత్తే ముందు బాసాలిస్ నేలపై పిచికారి చేసి కలియ బెట్టాలి.
పంట పై పిచికారి చేసేవి:
ఉదా: 2,4-D సోడియం సాల్ట్ (ఫెర్నాక్సోస్)
Also Read: Biogas: బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి.!