Paddy Gall Midge: తల్లి పురుగు సాధారణ దోమ కంటే కొంచెము పెద్ద దోమవలె ఉండి ముందు జత రెక్కలు పొడవుగా ఉంటుంది. వెనుక జత రెక్కలుండవు. తల్లి పురుగు ఉదర భాగం ఎరుపు రంగులో ఉంటుంది.ఆడ పురుగు లేత ఎరుపు రంగులోను, మగ పురుగు ముదురు గోధుమ రంగులోను ఉండును.గొంగళి పురుగు (మేగట్స్) ఎరుపు రంగులో ఉండి, కాళ్ళు ఉండవు, తల మరియు ముఖ భాగంవైపు శరీరం మొనదేలి ఉంటుంది.
లక్షణాలు: గ్రుడ్డు నుండి బయటికి వచ్చిన వెంటనే పిల్ల గొంగళి పురుగులు కాండం లోనికి చొచ్చుకొని పోయి అంకుంఠం వద్ద వృద్ధి చెందుతాయి.ఈ గొంగళి పురుగు సోకిన అంకురం ఆకుగా అభివృద్ధి చెందక ఉల్లి కాండం మాదిరి పొడవుగా గొట్టం మాదిరి మార్పు చెంది బయటకు వస్తుంది. ఈ గొట్టం చివర చిన్న ఆకు ఉంటుంది. దీనినే “సిల్వర్ షూట్” అని అంటారు.
Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు
ఈ పురుగు పైరు లేత దశలో ఆశించినట్లయితే పురుగు సోకిన దుబ్బుల నుండి ఎక్కువ పిలకలు వస్తాయి. ఈ పిలకల నుండి కంకులు ఏర్పడవు.ఈ పురుగు నారుమడి నుండి పిలక దశ వరకు పంటను ఆశించి నష్టపరుస్తాయి. పిలక దశ దాటిన తరువాత ఈ పురుగు పైరును ఆశించదు.ఈ పురుగు తాకిడి ఆలస్యంగా నాటిన వరిపైరులో ఎక్కువగా ఉంటుంది.
నివారణ చర్యలు: ఈ పురుగు తట్టుకునే రకాలైన పోతన, దివ్య, కావ్య, ఎర్రమల్లెలు, కేశవ, ఓరుగల్లు, భద్రకాళి, శివ, సురేఖ, రుద్రమ, ఫాల్గుణ, సురక్ష, స్వర్ణముఖి, సుమతి, శ్రీకాకుళం సన్నాలు, జగిత్యాలు సన్నాలు, పొలాస, వరాలు మరియు ఇందూర్ సాంభ మొదలగునవి సాగు చేయాలి.నారుమడిలో నారు తీయుటకు వారం రోజుల ముందుగా పోరేట్ 10జి సెంటుకి 50 గ్రా.లు (లేదా) కార్పోప్యురాన్ 3జి 160 గ్రా.లు వేయాలి.నాటిన 10-15 రోజులకు ఎకరానికి పోరేట్ 10జి 5 కిలోలు (లేదా) కార్బోప్యురాన్ 3జి 10 కిలోలు వేసుకోవాలి (లేదా) క్లోరిఫైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Sericulture: చంద్రికలను ఎలా వాడాలి ?