Integrated Pest Management in Sugarcane – చెఱకు రకముల అంతర రాష్ట్ర రవాణా పై నియంత్రణ: శాస్త్ర వేత్తలను సంప్రదించకుండా పొరుగు రాష్ట్రాల నుండి క్రొత్తరకాలు (కోసి671, కోసి 92061, కోసి 85036) తెచ్చి కొన్ని ప్రాంతాలలో సాగు చేయడం వల్ల ఎఱ్ఱుకుళ్ళు తెగులు. మన రాష్ట్రాంలో వ్యాప్తి చెందుతుంది. కాబట్టి శాస్త్ర వేత్తలు సిఫారసు లేకుండా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి క్రొత్త రకాలు తీసుకొని వచ్చే పద్ధతిపై నిర్ధిష్టమైన చర్యలు విధించాలి.
సాగు పద్ధతులు: లోతు దుక్కి చేయడం వలన ఎఱ్ఱకుళ్ళు కాటుక తెగులు, వడలు తెగుళ్ళ శిలీంద్రాలతో కూడిన చెఱకు చెత్త బయటకు తీసివేయుటకు వీలవుతుంది. బి) తెగులు సోకని, ఆరోగ్య వంతమైన తోటలనుండి విత్తనం వాడాలి. సి) పొలంలోను, గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. తోటలు పడిపోకుండా జడ చుట్టు పద్దతిలో నిలకట్టాలి.తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగులబెట్టాలి..సరియైన సాగు నీరు మరియు మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేయాలి.
తెగులు సోకిన తోటలను త్వరగా నరకాలి. తోట నరికిన తర్వాత మిగిలిన చెత్తను కాల్చివేయాలి. కార్చి మొళ్ళను భూ మట్టానికి నరుకుట వల్ల కాటుక తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.మొక్క తోటలో తెగులు ఉధృతంగా ఉంటే కార్మి చేయడం మానివేయాలి. తక్కువగా ఉంటే ఒక్క కార్మికే పరిమితం చేయాలి. పంట మార్పిడి విధానం అవలంభించాలి. ఉదా: చెఱకు వరి చెఱుకు.
Also Read: Insect Pests Management in Castor Crop: ఆముదం పంటను ఆశించు కీటకాలు – యాజమాన్యం
ఎరువుల యాజమాన్యం: పచ్చి రొట్ట ఎరువులను, సేంద్రీయ ఎరువులను వాడటం వల్ల భూమిలో తెగుళ్ళను కలుగజేసే సూక్ష్మ జీవులను అరికట్టే శిలీంద్రాలు, బాక్టీరియ అభివృద్ధి చెందుతాయి. బి) హెక్టారుకి 120 కిలోల పొటాష్ ఎరువు వేయడం వల్ల వడలు తెగులును తగ్గించవచ్చు. సి) సిఫారసు చేసిన మేరకు మాత్రమే నత్రజని ఎరువులు వాడాలి.
వేడి నీటి శుద్ధి: విత్తనపు ముచ్చెలను వేడినీటిలో 52 సి వద్ద కార్బండిజం 0.1 శాతం మందు కలిపి 30 నిమిషాలు శుద్ది చేయాలి. గాలిలో మిళితమైన వేడి ఆవిరిలో ముచ్చెలను 50°సి వద్ద 1 గంట శుద్ధి చేసినపుడు గడ్డ దుబ్బు తెగులు 51’సి వద్ద 2 గంటలు శుద్ధి చేసినపుడు కాటుక తెగులు అరికట్టబడతాయి.
తెగులు నిరోధక రకాలు:
ఎర్రకులు తెగులు – కో7706, కోఎ7602, కోటి 8201, కో8021, కోఅర్8001, కో8013, 58402, 85261, 83030, 870298, 872397, 83315.
సహజ పరిస్థితులలో తట్టుకొనే రకాలు – కో6907, 17219, 863146
కాటుక తెగులు – కో7706, కో8011, 81ఎ99, కో7805..
వడలి తెగులు – కో7219, కో7706.
గడ్డి దుబ్బు తెగులు – కో6907.
శిలీంద్ర నాశన మందులు వాడకం: కాటుక తెగులు నివారణకు విత్తనాన్ని నాటే ముందు ప్రొపికొనజోల్ 0.05 శాతం మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి. కార్మి చేసిన వెంటనే ఒకసారి 30 రోజులకు మరొకసారి ప్రాఫికొనజోల్ (1ఎమ్.ఎల్/ లీటర్) లేదా హెక్సాకొనజోల్ (2ఎమ్.ఎల్ /లీటర్) దుబ్బులపై పిచికారి చేయాలి.
జీవనియంత్రణ: ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్డియానం లను భూములోను, విత్తన శుద్ధిగాను చేసి ఎర్రకుళ్ళు తెగులును కొంతవరకు నివారించవచ్చు.
Also Read: Soil Erosion: నేల కోత వల్ల జరిగే నష్టాలు.!