ఆరోగ్యం / జీవన విధానం

Vegetables Role in Human Nutrition: మానవ పోషకాహారంలో కూరగాయల ప్రాముఖ్యత.!

1
Vegetables
Vegetables

Vegetables Role in Human Nutrition: ప్రకృతిలో లభించే పోషక ఆహారాలలో కూరగాయలు మిక్కిలి అనువైనవి.మనం తీసుకొనే ఆహారంలో పోషక విలువ గల కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.మనకు కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు సమృద్ధి గా లభ్యమవుతాయి. మనం తీసుకొనే ఆహారంలో వీటిలో వీరి వీరిగా ఉపయోగించడం వలన రోగ నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది.

మానవుడు తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుటకుగాను ప్రతి నిత్యం 100 గ్రాముల దుంపలు,100 గ్రాముల ఆకు కూరలు 120 గ్రాముల ఇతర కూరగాయలు పండ్లు తినడo ఎంతో అవసరం.కానీ అంచనాల ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరు 125 గ్రాములు కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం లేదు. విటమిన్లు ఇవి మన శరీరాన్ని క్రమబద్దికారిచడంలో ముఖ్యమైనది ఇవి కూరగాయలలో కొద్దీ మోతదులో లభ్యమైనప్పటికీ ఆరోగ్య ప్రాముఖ్యత ఎంతో కలదు.

విటమిన్ – ఎ
వీటి లోపం వలన చిన్న పిల్లలో పెరుగుదల ఆగిపోవడం మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడును.శ్వాస క్రియకు అంతరాయం ఏర్పడడం సంభవిస్తుంది. ముఖ్యంగా రేచీకటి ఏర్పడుతుంది.ఆకు కూరలు, క్యారెట్,క్యాబేజి, టమాటోలో విటమిన్ ఎ ఉంటుంది.

విటమిన్ -బి
దీని లోపం వలన బరువు తగ్గడం, శరీర ఉష్ణోగ్రతా తగ్గిపోవడం మరియు జీర్ణాశయం లో ఇబ్బందులు ఏర్పడతాయి.ముఖ్యంగా బెరిబెరి అనే వ్యాధి వస్తుంది.ఇది కూరగాయల గింజలలో విరివిరిగాలభిస్తుంది. చిక్కుడు గింజ,బఠాణి గింజలు,లెగ్యూమ్ పంటల్లో లభిస్తాయి.

Also Read: Onion Juice Health Benefits: ఉల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.!

Vegetables Role in Human Nutrition

Vegetables Role in Human Nutrition

విటమిన్ – సి
(ఆస్కారబిక్ ఆమ్లం ) దీని లోపం వలన స్కర్వి రోగం వస్తుంది.మరియు గుండె కండరాలలో లోపం గాయం త్వరగా మానకపోవడం జరుగుతుంది . టమాటో లో విటమిన్ -సి విరివిరిగా లభిస్తుంది.మరియు పచ్చి మిర్చి,బంగాళాదుంప , క్యారెట్ లో కూడా లభిస్తుంది.

విటమిన్ -డి
(క్యాల్సి ఫెరల్) ఎముకల అభివృద్ధి కి దంతాల గట్టిదనానికి తోడ్పడతాయి. దీని లోపం వలన ఎముకలకు సంబదించిన రోగం వస్తుంది.దీనినే రికేట్సియా అంటారు.ఈ విటమిన్ డి ని రికేటిన్ విటమిన్ అని కూడా అంటారు.

విటమిన్ -ఈ
(టోకో ఫెరల్) దీనిని యాంటి స్టేరిలిటి విటమిన్ అని కూడా అంటారు.ఇది మన జనరేటివ్ మరియు స్టేరిలిటిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఇది ఆకు కూరలు మరియు వెజిటేబుల్స్ ఆయిల్స్ లో సమృద్ధి గా లభిస్తుంది.

విటమిన్ – కె
ఇది మనకు గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టుటకు అవసరం అయినది.ఇది కూరగాయలలో సమృద్ధిగా లభించును.

ప్రోటీన్లు
ఇది మన శరీర పెరుగుదలకు మరియు కణాలు ఏర్పరచుటకు ముఖ్యమైనది. చిక్కుడు, బఠాణి,విరివిగా లభిస్తుంది.

పిండి పదార్ధాలు
ఇవి శరీరానికి శక్తిని చేకూర్చటలో ముఖ్యమైనది. దుంపలు, చిలకడదుంపలు,ఆకు కూరలో ca,fe సమృద్ధిగా ఉంటాయి.

Also Read: Chukka Koora Health Benefits: చుక్క కూరను తినడం వల్ల కలిగే లాభాలు.!

Leave Your Comments

Onion Juice Health Benefits: ఉల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.!

Previous article

Weed Management Practices: కలుపు మొక్కల యాజమాన్య పద్ధతులు.!

Next article

You may also like