Pineapple Health Benefits: పైనాపిల్ ను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనం ఆహారంగా తీసుకునే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ తీపి, పులుపు రుచులను కలిగి ఉంటుంది.పైనాపిల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటు కాల్షియం, ఐరన్, సోడియం వంటి మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. దీంట్లో కూడా శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి.
అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. పైనాపిల్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే రుచిగా ఉంది కదా అని పైనాపిల్ ను ఎక్కువగా తినకూడదు. గర్భిణీలు పైనాపిల్ ను తినకపోవడమే మంచిది. దీనిని ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
Also Read: Pineapple Farming: రైతులు పైనాపిల్ సాగు వైపు మొగ్గు చూపాలి
పైనాపిల్ గుజ్జును ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పైనాపిల్ మనకు ఉపయోగపడుతుంది. కండరాల వాపులతో బాధపడే వారు పైనాపిల్ ను తినడం వల్ల వాపుల నుండి ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో పైనాపిల్ మనకు ఎంతగానో సహాయపడుతుంది. తరచూ పైనాపిల్ ను తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి..దీంట్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు, జ్వరాలతో బాధపడే వారు అలాగే పచ్చ కామెర్ల బారిన పడిన వారు పైనాపిల్ ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పైనాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Also Read: Pineapple Farming: పైనాపిల్ సాగులో సరైన మార్గం మరియు జాగ్రత్తలు