Weed Impact on Crops – కలుపు మొక్కల నివారణ:
అవసరం లేని చోట పెరిగే మొక్కలను కలుపు మొక్కలు అంటారు. కలుపు- పంట మొక్కలకు శత్రువు గా భావించ వచ్చు.కలుపు మొక్కలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. కాని పంట కాలం లో కలుపు తీసివేసి పంటల దిగుబడి పెంచ వచ్చు. కలుపు మొక్కల పెరుగుదల రేటు పంట మొక్కల కంటే అధికం గా ఉండడం వల్ల పంట ఎదుగుదలను పూర్తిగా అణచి వేస్తాయి. అయితే కలుపు మొక్కలను పనికిరాని మొక్కలు గా భావించ రాదు. టికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక పంట మొక్కలు వేరొక ప్రధాన పంటలో వుంటే వాటిని కలుపు మొక్కలు గా భావించ వచ్చు. ఉదా: గోధుమ పంటలో మొక్కజొన్న మొక్కలను, వరిలో ఊద మొక్కలను కలుపు మొక్కలు గా భావించ వచ్చు. ఎడారి లో బ్రహ్మజెముడు కలుపు మొక్క కాదు. కాని ఇతర ప్రదేశాల్లో అది భయంకరమైన కలుపు మొక్క. “కలుపు మొక్కలన్నీ అవసరం లేని మొక్కలు కావు” ఉదా: గరిక గడ్డి (టెర్ముడా గడ్డి): చాలా పంట పొలాలలో ఇది కలుపు మొక్క. కాని చాలా గ్రామాలలో పచ్చి గడ్డి గా ఉపయోగిస్తారు.
క్వాక్ గడ్డి: కలుపు మొక్క కాని ఖాళీ ప్రదేశాలలో నేల కోత కు గురికాకుండా చేస్తుంది.
గుర్రపు డెక్క(వాటర్ హయాసింత్): అలంకరణ కొరకు అమెరికా నుండి ప్రవేశ పెట్టబడిoది. ప్రస్తుతం ఇది సమస్యాత్మక కలుపు మొక్క.
Also Read: Natural Enemies for Pest Control: పంటలపై పురుగులను నివారించే సహజ శత్రువుల గురించి మీకు తెలుసా.!
పంట పెరుగుదల, దిగుబడుల పై కలుపు మొక్కల ప్రభావం:
నీరు, పోషక పదార్ధాలు, కాంతి కొరకు పంట మొక్కల తో పోటీపడి పంట దిగుబడులు తగ్గిస్తాయి. పంట విత్తనం మొలకెత్తిన రెండు వారాల వరకూ కలుపు మొక్కలు తేమ కొరకు పోటీ పడి పంట మొక్కలకు విపరీత నష్టం కలిగిస్తాయి.వర్షాధార పరిస్థితులలో కలుపు మొక్కలు తేమ కొరకు ఎక్కువ పోటీ పడతాయి.పంట నాటిన వెంటనే తడులు పెట్టిన ఎక్కువ కలుపు పెరిగి పంటకు హాని కలుగుతుంది.కొన్ని కలుపు మొక్కలు వ్రేళ్ళ ద్వారా విష పదార్ధాలను నేలలోనికి వదిలి పంట పెరుగుదలను తగ్గిస్తాయి.కలుపు తీయుటకు కూలి ఖర్చు ఎక్కువ, పంట కోత కూడా కష్టమవుతుంది.వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గి, మంచి రేటు రాదు. (వరి +ఊట).కొన్ని కలుపు మొక్కలు మానవులు, పశువులపై విష ప్రభావం కల్గి స్థాయి.కీటక, శిలీంద్ర మరియు వైరస్ లకు ఆశ్రయ మిస్తాయి.భూమి విలువను తగ్గిస్తాయి.నీరు పారే కాల్వలలో పెరిగే కలుపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. మురుగు నీరు పోవడానికి ఆటంక పరుస్తాయి. నేలను కలుషిత పరుస్తాయి. కలుపు ఉన్న స్థలాలు ప్రజా వినియోగానికి ఉపయోగపడవు.
Also Read: Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!