Natural Enemies for Pest Control: సస్య రక్షణకు సహజ శత్రువులను వినియోగించటం అనాది నుండి ఉన్నదే. చైనాలో పండ్ల చెట్లను గొంగళి పురుగుల బారినుండి కాపాడటానికి ఒక రకమైన చీమలను పెంచేవారు. 1762 లోనే మారిషస్లో మిడతలదండును అదుపులో ఉంచటానికి వాటిని తినే పిట్టలను దిగుమతి చేసుకొన్నారు. 1873 లో ఫ్రాన్స్-లో ద్రాక్షలో ఒక పురుగు (ఫిలోక్సరా) ను అదుపులో ఉంచటానికి అమెరికా నుండి వేరొక పురుగును తెచ్చుకున్నారు. కాలిఫోర్నియాలో ప్రత్తి ష్టాలును పురుగును నివారించడానికి 1888లో ఆస్ట్రేలియా నుండి అక్షింతల పురుగు (రోడోలియ కార్డినాలిస్)ను తెచ్చుకున్నారు.
పరాన్న జీవులు:
ఇవి పురుగులు లోపలగాని వాటిపైన గాని చేరి జీవరసాన్ని పీల్చి చంపేస్తాయి. పురుగుల వివిధ జీవిత దశల్లో అంటే గ్రుడ్డుదశ, గొంగళి పురుగు దశ, కోశస్థ దశ, రెక్కల పురుగు దశల్లో వేరు వేరు సహజ శత్రువులు ఆశించి అదుపులో ఉంచుతాయి.
ప్రత్తి కాయ తొలచు పురుగుల గ్రుడ్డుమీద ట్రైకోగ్రామా అనే పరాన్నబక్కు అభివృద్ధి చెందుతుంది. పురుగుల జాతికి చెందిన ట్రైకోగ్రామా పారసైటాయిడ్లు. కాయ తొలచు పురుగుల వంటి చీడ పురుగుల గ్రుడ్లని వెతికి వాటిలో తమ గ్రుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుండి వెలువడిన పారసైటాయిడ్ అపరిపక్వ ( లార్వా ) దశలో చీడ పురుగులు గుడ్లలోని రసాన్ని తింటాయి. మూడు నాలుగు రోజుల్లో ఈ గ్రుడ్లు నలుపు రంగుకి మారుతాయి. నలుపు రంగుకి మారిన నాలుగు ఐదు రోజుల తరువాత వాటి నుండి చీడపురుగుల లార్వాలకు బదులుగా పారసైటాయిడ్ల పరిపక్వ దశలు వెలువడతాయి ఒక పారసైటాయిడ్ వంద చీడ పురుగుల గ్రుడ్లలో తన గ్రుడ్లను పెట్టి వాటిని పూర్తిగా నాశనం చేయ గలదు.
Also Read: Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!
ఉపయోగించే విధానం:
కాయ తొలచు పురుగులు లింగాకర్షక ఎరలలో కనబడటం ప్రారంభమయిన వెంటనే పార సైటాయిడ్లను విడుదల చేయాలి. ఈ విధముగా చేయటం ద్వారా ట్రైకోగ్రామా పురుగులు కాయ తొలుచు పురుగుల గుడ్లను లార్వా దశలు వెలువడక ముందే నాశనం చేస్తాయి. ఈ పారసైటాయిడ్లు ట్రైకోకార్డులు రూపంలో లభిస్తాయి. ఒక్కొక్క కార్డులో ఇరవై వేల ట్రైకోగ్రామా పురుగులు ఉంటాయి. ఎకరానికి అయిదు ట్రైకో కార్డులను అనగా ఒక లక్ష పారసైటాయిడ్లను 10-15 రోజుల అంతరంతో రెండు, మూడు దఫాలుగా ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి మరి కొన్ని సార్లు పారసైటాయిడ్ ను విడుదల చేయాలి.
ట్రైకోగ్రామా పురుగులు కాయ తొలుచు పురుగుల గ్రుడ్లను వెతికి వాటితో తమ జాతిని పెంపొం దించుకొంటాయి. ఈ విధంగా ఈ పాఠ సైటాయిడ్లు చీడ పురుగులు జన్మించక ముందే నాశనం చేసి తద్వారా లార్వా దశలు పంటకు నష్టాన్ని కలుగ జేయటాన్ని నివారిస్తాయి. ఈ విశిష్ట గుణాలతో పాటు వీటి ఉపయోగం తక్కువ ఖర్చుతో కూడిన పని కావటం వలన దీనిని అన్ని విధాలుగా లాభదాయకమయిన రక్షణ చర్యగా పరిగణించ వచ్చు.
అ) గ్రుడ్డు దశలో ఆశించే పరాన్న జీవులూ ట్రైకోగ్రామా, టెలెనోమన్, టెట్రాస్ట్రికస్ జాతురకు చెందినవి.
ఆ) గొంగళి పురుగు దశలో ఆశించే పరాన్న జీవులూ అపాంటిలిస్, బ్రాకస్, కిలోనస్, యూక్లిటోరియా.
బదనికలు:
పురుగుల్ని తినేవి కప్ప, బల్లి తొండలు కొన్ని రకాలు పిట్టలూ పురుగుల్ని తింటాయని మనకు తెలుసు అలాగే కొన్ని రకాల పురుగులు కూడా హానిచేసే పురుగుల్ని తిని రైతుకు మేలు చేస్తాయి. వీటిలో చెప్పుకోదగినవి సాలీడు, అక్షింతల పురుగు, ప్రేయింగ్ మాంటిస్ మొదలైనవి.
Also Read: Pesticides storage: పురుగు మందుల నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!