Sore Mouth in Goats: పాక్స్ వైరస్ వలన గొర్రెలు మరియు మేకలలో కలుగు ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు, మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ వ్యాధిని గుర్తించాడు. కొన్ని సందర్భాలాలో ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుంటుంది. చర్మపు గాయాల ద్వారా, పిల్లల నోటి నుండి గొర్రెల, మేకల పొదుగుకు వ్యాపిస్తుంటుంది. ముఖం, పెదవులపై గల చర్మపు హక్కులలో ఈ వైరస్ చాలా రోజుల వరకు ఉండి ఇతర పశువులకు వ్యాపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి అంటు వ్యాధిలా వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- ఈ వైరస్‌కు ఎపిథీలియోట్రోఫిక్ గుణం కలదు. సహజంగా లీషన్స్ ముక్కు రంధ్రాలు, పెదవులు, వెనుక కాళ్ళ తొడ భాగాలు, ఆక్సిల్లా, పొదుగు భాగాలలో ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాలలో జీర్ణాశయం, ఊపిరితిత్తులు మరియు గుండి భాగాలలో కూడా బొబ్బలు లాంటి లీషన్స్ ఏర్పడుతుంటాయి.
వ్యాధి లక్షణాలు:- గొర్రెలు మరియు మేకలు సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన నీరసంగా ఉంటాయి. 106-108 డిగ్రీల జ్వరం ఉంటుంది. నోటి నుండి జల్లు మరియు కంటి నుండి నీరు కారుతుంటుంది. ముక్కు రంధ్రాలలో మరియు పెదవులపై బొబ్బలు ఏర్పడి, గడ్డలుగా మారి, నీరు చేరి వేసికిల్స్ గా మారి, వాటిలో చీము చేరి, చివరకు పగలి పోయి అల్సర్లు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాలలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగి, వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది లేని యెడల 28 రోజులలో గడ్డలన్ని సమసిపోతాయి.
సహజంగా గొర్రెలు లేదా మేకలు ఈ వ్యాధి నుండి కోలుకుంటాయి. ఈ వ్యాధి మూలంగా గొర్రెలలో మరణాల శాతం చాలా తక్కువ.నోటి పై భాగాలలో గడ్డలు, వెసికిల్స్, అల్సర్లు ఏర్పడి యుండుటను గమనించవచ్చు.ఒక సారి ఈ వ్యాధి లక్షణాలను ఏదేని ఒక గొర్రె లేదా మేకలో చూసినట్లైతే, ఈ వ్యాధిని సులభంగానే గుర్తించవచ్చు. ప్రయోగశాలలో ఈ వ్యాధిని AGID,FAT, CFT వంటి పరీక్షల ద్వారా గుర్తిస్తారు. ఈ వ్యాధిని అమ్మోరు, గాలికుంటు వంటి వ్యాధులతో పోల్చుకొని చూసుకోవలసి ఉంటుంది.
Also Read: Goat Plague Disease: మేకలలో ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది.!
చికిత్స:- ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏదేని ఒక ఆంటి బయోటిక్ ఔషదములను, బొబ్బలను 5 శాతం కాఫర్ సల్ఫేట్ ద్రావణంతో కాని లేదా 7 శాతం అయోడిన్ ద్రావణంతో కాని లేదా 3 శాతం ఫినాల్ ద్రావణంతో కాని శుభ్రం చెయ్యవలసి ఉంటుంది. లిధియం అంటిమోని థయో సల్ఫేట్ వంటి ఔషదములను ఉపయోగించినట్లైతే చర్మం, ముక్కు లేదా ఇతర భాగాలలోని బొబ్బలు రాలిపోతాయి.
నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుటకు ఆంటి ఇన్ఫ్లమేటరీ ఆంటి ఆనాల్జెసిక్ ఔషదములను ఇవ్వవలెను.గొర్రెలు మరియు మేకలు బొబ్బల మూలంగా ఆహారం సరిగ్గా తీసుకోలేక, నీరసంగా ఉంటాయి. కావున వాటికి సులభంగా జీర్ణమయ్యే గంజి, జావా లాంటివి ఇవ్వాలి, గ్లూకోజ్ద్రావణములు, ఏలక్ట్రోలైట్ ద్రావణాలను నోటి ద్వారా కాని, సిరల ద్వారా కాని ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు లివర్ ఎక్స్ట్రా ట్రాక్ట్, విటమిన్ ఇంజక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలను మరియు మేకలను మంద నుండి వేరు వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.
Also Read: Listeriosis Disease in Goats: మేకలలో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం.!