Agri Innovation Fest 2022: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 4 రోజుల పాటు నిర్వహించే అగ్రి ఇన్నోవేషన్ పెస్ట్ మంగళవారం ప్రారంభమైంది.
రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లోని అగ్రిహబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేటర్స్ ఎగ్జిబిషన్ లో నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల ప్రారంభించారు. గ్రామీణ ఆవిష్కరణలకు సంబంధించి 26 స్టాళ్లను ఇందులో ఏర్పాటు చేశారు.
స్టాళ్ళ లో ఏర్పాటు చేసిన వివిధ ఆవిష్కరణలు ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో జరిగే ఆవిష్కరణలు రైతులు సులభంగా వినియోగించేలా ఉండాలని సూచించారు. సాంకేతిక ఆవిష్కరణలకు అగ్రిహబ్ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. అగ్రిహబ్ – వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రైతులకు అనువైన నవకల్పనలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రవీణ్ రావు, పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, అగ్రిహబ్ ప్రతినిధులు కల్పనా శాస్త్రి, విజయ్, అనిల్ కుమార్ ఏపూర్ లు పాల్గొన్నారు.
Also Read: Plastic Uses in Agri and Horticulture: వ్యవసాయ మరియు ఉద్యాన రంగాల్లో ప్లాస్టిక్స్ ఉపయోగాలు.!
Also Read: Agri Awards 2022: అగ్రి ఇన్ ఫుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువు – మంత్రి నిరంజన్ రెడ్డి