శనగలు రుచికరమైన ఆహారం.లెగ్యూమ్ జాతి కి చెందిన శనగల్లో నాటీ శనగలు,కాబూలీ శనగలు వంటివి లభిస్తాయి. కొన్ని తెల్లగా ఉంటే,మరికొన్ని డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా లాగించే మంచి పోషకాలు వున్న ఆహరం.అందుకే ఇటివలి కాలంలో దీన్ని దెశీ సూపర్ ఫుడ్ గా మన న్యూట్రినిస్టులు పిలుస్తున్నారు.మన అందరి ఇళ్ళలోఎప్పుడూ నిలువ వుండే శనగలు ఓ కప్పు తింటే బోలెడంత శక్తి కూడా వస్తుంది.శాకాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. కాసిన్ని శనగలు నాన బెట్టి,మొలకలు వచ్చాక వాటిని పచ్చివి తిన్నా,వేయించుకుని,ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరమే. శనగల చాట్ అయితే రుచికి,ఆరోగ్యానికి చాలా మంచిది.
“చోళా బటూరా” అంటే మనలో ఇష్టపడనివారు ఉండరు బహుశా.శనగలు,చెనా,చిక్ పీ అని మనం పిలుచుకునే ఈ విత్తనాల్లో వుండే పోషకాలు అన్నీ ఇన్ని కావు.సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా వున్నా శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది.పెద్ద వాళ్లకు ఒకరోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో మూడవ వంతు ప్రోటీన్ 28గ్రాముల శనగల్లో ఉంటుంది.పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతో వున్నా శనగలు చాలా మంచిది.అలా అని అతిగా తింటే మాత్రం కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు.శనగలు కొన్ని రోగాలకు ఇట్టే చెక్ పెట్టే వంటింటి వైద్యంలా పనికి వస్తాయి.
బ్లడ్ ప్రెజర్: బ్లడ్ ప్రెజర్ ను అదుపుచేసే శక్తి శనగపప్పుకు ఉంది.పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్ కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది.రోజూ 4,700 ఎంజీల పొటాషియం క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి రావటం ఖాయం.
గుండెకు మంచిది: మనందరికీ పెద్దగా తెలియని విషయం ఇదే.శనగలతో గుండె ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.గుండెకు అవసమైన న్యూట్రిషన్ ను సప్లై చేసే శక్తి శనగ కు ఉంది.సెలీనియం,మెగ్నీషియం,పొటాషియం,బి విటమిన్,ఫైబర్,ఐరన్ వంటివి పోషకాలు ఉన్నందున గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.అంతేకాదు LDL కొలెస్ట్రాల్ ను ఇది బాగా తగ్గిస్తుంది.
బ్లడ్ షుగర్: డయాబెటిక్స్ ఉన్న వారికి శనగలు అత్యుత్తమ ఆహారం.బ్లడ్ షుగర్ హెచ్చు తగ్గులను ఇది నియంత్రిస్తుంది. ఒక కప్పు చిక్ పీస్ లో 12.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.కనుక ఇది మధుమేహా వ్యాధిగ్రస్తులపై చక్కగా పనిచేస్తుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ వున్నా ఆహారం కూడా కావటం తో ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ,ఇన్సులిన్ ను నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది.దీంతో ఉన్నట్టుంది ఇన్సులిన్ నిల్వ శరీరం లో పెరగకుండా,క్రమంగా ఈ వ్యవస్ద పనిచేస్తూ,బ్లడ్ షుగర్ పై అదుపు సాధించేందుకు శనగలతో చేసిన ఆహారం సాయపడుతుంది.
రక్త హీనతకు చెక్: ఐరన్, క్యాల్షియం,సీ,ఏ,ఈ విటమిన్లు,ఫోలేట్,యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలతో నిండిన శనగలు మన శరీరంలో ఎముకలు ధృడ పడేలా పని చేస్తుంది. మన శరీరం ఐరన్ ను గ్రహించేలా చేసే ఈ గింజలు,ఆస్టియోపోరాసిస్,అనీమియా తో బాధపడేవారికి సూపర్ ఫుడ్.
చురుగ్గా జీర్ణవ్యవస్ద: ఇందులో సమృద్దిగా వున్నా ఫైబర్ తో మలబద్దకం,అజీర్తి వంటి సమస్యలు పోతాయి.శరీరంలో ని ట్యాక్సిన్ల ను బయటకు పంపటంలో చిక్ పీస్ అధ్బుతంగా పని చేస్తాయి.గత హెల్త్ మెరుగయ్యేలా ఇది తోడ్పడుతుంది.అందుకే మీ మెనూలో శనగలను మీకు నచ్చిన రూపంలో చేర్చుకోండి, ఆరోగ్యంగా జీవించండి.