పశుపోషణ

Avian Encephalomyelitis in Poultry: కోళ్ళలో ఎవియన్ ఎన్సెఫలోమైలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

1
Avian Encephalomyelitis in Poultry
Avian Encephalomyelitis

Avian Encephalomyelitis in Poultry: ఎవియన్ ఎన్సెఫలోమెలైటిస్ వ్యాధి చిన్న వయస్సు కోళ్ళలో వచ్చు ఒక వైరల్ వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా నాడీమండల ఇబ్బందులైన తల, మెడ కండరాలలో వణుకు, కాళ్ళ బలహీనత, నడవలేకపోవుట వంటి లక్షణాలతో, గ్రుడ్లు పెట్టే కోళ్ళ ఉత్పత్తిలో తగ్గుదల ప్రధానంగా ఉంటుంది.

ఈ వ్యాధి పికర్నా విరిడే కుటుంబానికి చెందిన పికర్నా వైరస్ వలన కలుగుతుంటుంది. ఇది ఒక RNA వైరస్, ఈ వైరస్ 20-30 nm పరిమాణం కలిగి ఉంటుంది.ఈ వ్యాధి సహజంగా కోళ్ళు, టర్కీ, జపనీస్ క్వయిల్స్, పావురాలలో కలుగుతుంటుంది. బాతులు, గినీ కోళ్ళలో అప్పుడప్పుడు ఈ వైరస్ వలన వ్యాధి కలుగుతుంటుంది. 1-2 వారాల వయస్సు గల కోడి పిల్లలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పెద్ద కోళ్ళలో ఈ వ్యాధి సబ్ క్లీనికల్గా ఉంటుంది.

ఈ వ్యాధి అన్ని కాలాల్లో కోళ్ళకు వ్యాపిస్తున్నప్పటికి, చలికాలంలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తల్లి కోడికి కనుక ఈ వ్యాధి ఉన్నచో గ్రుడ్ల ద్వారా ఈ వైరస్ తరువాత తరం కోడి పిల్లలకు సోకుతుంది. దీనినే వర్టికల్ ట్రాన్సిమిషన్ అని అంటారు. ఇటువంటి కోళ్ళలో గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. వైరస్ కలుషితమైన లిట్టర్ ద్వారా కూడా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపిస్తుంటుంది.

Avian Encephalomyelitis in Poultry

Avian Encephalomyelitis in Poultry

Also Read: Calcareous Soils: సున్నం అధికంగా ఉన్న నేలల్లో యాజమాన్యం ఎలా చేపట్టాలి.!

వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- వ్యాధి కారక వైరస్ శరీరంలో ప్రవేశించిన రోజు నుండి 7 రోజుల వరకు ఇంక్యుబేషన్ పిరియడ్లో ఉండి తదుపరి వ్యాధి లక్షణాలు బయటికి కనబడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా 2 వారాల వయస్సు గల అన్ని కోడి పిల్లలకు వచ్చు. ఈ వ్యాధిలో మోర్టాలిటీ సగటున 10 నుండి 50 శాతం వరకు ఉండును. వైరస్ శరీరంలోకి ప్రవేశించి క్లోమo, కాలేయం, గుండీ, ప్లీహం, మూత్ర పిండాలలో పెరిగి, చివరకు కేంద్రియ నాడీ వ్యవస్థ (Central Nervous system) మీద ప్రభావం చూపి, మెదడు యొక్క కణాలను విచ్చిన్నం చేయుట ద్వారా వ్యాధి లక్షణాలను కనబరుస్తుంది.

వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధిలో ఎక్కువగా కేంద్రీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. 5 వారాల వయస్సు గల కోళ్ళు డల్ గా, నీరసంగా ఉంటాయి. కండరాల వణుకు, సరిగ్గా నిలబడలేకపోవుట, నడవలేకపోవుట, కాళ్ళ పక్షవాతం వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.

వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధిలో ఎక్కువగా కేంద్రీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉండును. 5 వారాల వయస్సు గల కోళ్ళు డల్ గా, నీరసంగా ఉంటాయి. కండరాల వణుకు, సరిగ్గా నిలబడలేకపోవుట, నడవలేకపోవుట, కాళ్ళ పక్షవాతం వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. తల మరియు మెడ కండరాలలో ట్రిమర్స్ను గమనించవచ్చు. కార్నియల్ ఓపాసిటి ఉంటుంది. చివరి దశలో కోళ్ళు ఆహారం తీసుకోలేక, బాగా నీరసపడి చనిపోతుంటాయి. పెద్ద కోళ్ళు సహజంగా ఎటువంటి లక్షణాలను బయటకు చూపించవు. కొన్ని కోళ్ళలో మాత్రం డయేరియా, గ్రుడ్ల ఉత్పాదనలో తగ్గుదలను గమనిచంచవచ్చు.గిజ్జర్డ్ మరియు ప్రొవెంట్రిక్యులస్ ఎరియాలో తెల్లటి చారలు కనిపిస్తుంటాయి. కంటిలో ఈ ఒక్క లీజన్స్ తప్ప ఇతర మార్పులు ఏవి గమనించలేము.

వ్యాధి నిర్ధారణ:- వ్యాధి చరిత్ర, వ్యాధి బారిన పడు కోళ్ళ వయస్సు, టిపికల్ వ్యాధి లక్షణాలు కొంత వరకు ఈ వ్యాధిని నిర్ధారించేటందుకు ఉపయోగపడుతాయి. ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించుకొనుటకు హిస్టోఫాథాలాజికల్ పరీక్ష, వైరస్ను ఎంబ్రియోనేటెడ్ ఎగ్ కల్చర్ చేయుట, వైరస్ న్యూట్రలైజేషన్ పరీక్ష, ఫ్లోరోసెంట్ ఆంటీ బాడి పరీక్ష లేదా ఎలిసా

పరీక్షల ద్వారా నిర్ధారించుకొనవచ్చు. ఈ వ్యాధిని దానికేట్ వ్యాధి, విటమిన్ ఇ లోపం, మారెక్స్ వ్యాధి వంటి వ్యాధులతో సరిపోల్చుకొనవలసి ఉంటుంది.

చికిత్స:- వ్యాధి సోకిన కోడి పిల్లలకు సరియైన చికిత్స అంటూ ఏమీలేదు. వ్యాధి రాకుండా నివారణ చేసుకొనుట ఒకటే మార్గం.

నివారణ:- ఔట్ బ్రేక్ గనుక వచ్చినట్లయితే, వ్యాధి వచ్చిన కోళ్ళను ఫ్లాక్ నుండి వేరు చేయాలి లేదా కల్లింగ్ చేయాలి. గ్రుడ్లను పొదిగించే ఎప్పుడు సరియైన పరిశుభ్రతను పాటించాలి. షెడ్ నందు ఉపయోగించు పరికరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధికి విదేశాలలో టీకాను కనుగొనుటకు ప్రయత్నం చేస్తున్నారు. మనదేశంలో ఈ వ్యాధికి టీకా లేదు.

Also Read: Bio Fertilizers Importance in Agriculture: వ్యవసాయంలో జీవన ఎరువుల వాటి ప్రాముఖ్యత.!

Leave Your Comments

Calcareous Soils: సున్నం అధికంగా ఉన్న నేలల్లో యాజమాన్యం ఎలా చేపట్టాలి.!

Previous article

Blue Tongue Disease in Sheep: గొర్రెలలో నీలి నాలుక వ్యాధికి ఇలా చికిత్స చెయ్యండి.!

Next article

You may also like