Weed Management in Oilseed Crop: వేరుశెనగ
వేరుశెనగ నూనె గింజలలో ముఖ్యమైన పంట. సాధారణంగా ఖరీఫ్ లో వర్షాధారంగాను, రబీ, వేసవిలో అరుతడి పంట గాను సాగు చేస్తారు. సాధారణంగా కలుపు వలన పైర్లలో వచ్చే నష్టాలకు అదనంగా, వేరుశెనగలో ఊడలు భూమిలోకి దిగేందుకు కలుపు అడ్డు వస్తుంది. వేరుశెనగలో వచ్చే గలీజేరు వంటి కలుపు మొక్కలు వైరస్ తెగుళ్ళకు, వేరు పురుగులకు ఆశ్రయమిచ్చి పంటకు నష్టం కలిగిస్తాయి.
వేరుశెనగలో కలుపు వలన పంట నష్టం 18-72 % కలుపు తీయవలిసిన కీలక సమయం 30 నుండి 45 రోజులు. వేరుశెనగలో వచ్చే ముఖ్యమైనా కలుపు మొక్కలు. విత్తిన వెంటనే విత్తిన వెంటనే లేదా 1,2 రోజులకు ఎకరాకు 1 లీ. పెండిమిథలీన్ 30% ద్రావకం లేదా బ్ల్యూటాక్లోరిన్ 50% ద్రావకం 1 లీ. లేదా అల్లాక్లోర్ 50% ద్రావకం 1.5 లీ. లలో ఏదో ఒకదానిని 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
విత్తిన 20-25 రోజులున్నపుడు గొర్రు, గుంటకాలతో అంతర కృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోస్తే కలుపు నిర్ములన జరగడమే కాక ఊడలు భూమిలో దిగి బాగా ఉరతాయి. అంతర కృషి కుదరనపుడు విత్తిన 20-25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 250 మీ. లీ. ప్రోపాక్వెజాపాప్ 10% ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి మొక్కలు, వేడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 200 మీ. లీ. ఇమజితాపీర్ 10% ద్రావకం 200 లీ. నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి.
నువ్వులు
విత్తిన వెంటనే లేదా 1,2 రోజులకు పెండిమీదాలీన్ 30% ద్రావకం ఎకరాకు 800 మీ. లీ. లేదా అల్లాక్లోర్ 50% ద్రావకం 1.0 లీ. చొప్పున 200 లీ.నీటికి పిచికారీ చేయాలి.గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నపుడు ఎకరాకు 300 మీ. లీ. క్వెజలాపాప్ ఇధైల్ 50% ద్రావకం కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Oilseed Cultivation: రానున్న రోజులలో నూనె పంటల సాగులో జరగబోయే మార్పులు.!
ప్రొద్దు తిరుగుడు
విత్తిన 30,40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20-25 రోజులలోపు గొర్రు లేదా గుంటకతోఅంతర కృషి చేయాలి. గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నపుడు ఎకరాకు 300 మీ లీ. క్వెజలాపాప్ ఇధైల్ 5%ద్రావకం కలిపి పిచికారీ చేయాలి.
కుసుమ
విత్తిన వెంటనే అల్లాక్లోర్ 50% ద్రావకం ఎకరాకు ఒక లీటర్ చొప్పున పెండిమిథలీన్ 30% ద్రావకం విత్తిన వెంటనే గాని లేదా మరుసటి రోజున గాని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆముదం
విత్తిన 40-60 రోజులలో కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే లేదా రెండు రోజులలో అల్లాక్లోర్ 50% ద్రావకం 1.5 లీ.209 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందులు వాడినచో 40 రోజులప్పుడు ఒకసారి, వాడనపుడు 20 రోజులకు , గుంటక లేదా గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నివారించవచ్చు.\
అవిశెలు
విత్తిన 15 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు విడిగా కలుపు తీయాలి. బంగారు తీగ అనే సంపూర్ణకాండ పరన్నాజీవి నేలరోజులలో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఇది నేలలో పండిన విత్తనం ద్వారా, వాలిశెలు విత్తనాలలో బంగారు తీగ విత్తనాలు కలియడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వాలిశెలు విత్తనాలను జల్లెడతో జల్లించి బంగారు తీగ విత్తన్నన్ని వేరు చేసుకోవాలి.
ఎకరాకు కావలిసిన 5 కిలోల విత్తనాన్ని 20 లీటర్ల నీటికి 3 కిలోల ఉప్పు కలిపిన ద్రావణం లో వేసి బాగా కలియబెటినట్టులైతే బంగారు తీగ విత్తనాలు అడుగుకు పోయి వాలిశెలు పైకి తేలతాయి.విత్తిన వెంటనే ఎకరాకు 1 లీ. పెండిమిథలీన్ 30% ద్రావకం 200 లీ. నీటిలో పిచికారీ చేసినట్లయితే నేలలో ఉండే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే బంగారు తీగను సమర్ధవంతంగా నివారించవచ్చు. పొలంలో బంగారు తీగ పూత దశకు రాకముందే పికి వేసి గుంటలో పూడ్చడం లేదా తగులబెట్టడం వలన కూడా దీని ఉధృతి తగ్గించవచ్చు.
ఆవాలు
విత్తన వెంటనే లేదా 1-2 రోజుల ఎకరాకు 600 మీ. లీ. పెండిమిథలీన్ 30% ద్రావకం 200లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రు తో అంతర కృషి చేయాలి. గడ్డి జాతి మొక్కల నిర్ములనకు ఎకరాకు 300 మీ. లీ. క్వెజలాపాప్ ఇధైల్ 5% ద్రావకం 200 లీ. నీటికి పిచికారీ చేయాలి.
Also Read: Direct Seeding Methods: వరి పంటలో నేరుగా విత్తే పద్ధతులు.!