తెలంగాణవార్తలు

Wanaparthy Tirumalayya Gutta: వనపర్తికి తలమానికం తిరుమలయ్య గుట్ట.!

1
Wanaparthy Tirumalayya Gutta
Wanaparthy Tirumalayya Gutta

Wanaparthy Tirumalayya Gutta: వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.44.52 లక్షల విలువైన చెక్కులను అందజేసి అనంతరం శ్రావణ శనివారం సంధర్భంగా వనపర్తి తిరుమలయ్య గుట్టను సందర్శించి తిరుమలేశుని సందర్శించుకుని, అంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించిన  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్ది గారు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే అటవీప్రాంతం పక్కన ఉన్న అరుదైన పట్టణం తిరుమలయ్య గుట్ట. ఒకటి రెండు పట్టణాలకు మినహా రాష్ట్రంలోని మరే పట్టణానికి ఇలాంటి పర్యావరణ హితమైన వాతావరణం లేదు. అరుదైన వనమూలికలకు తిరుమలయ్య గుట్ట అటవీప్రాంతం ప్రసిద్ది. ఈ ప్రాంతంలో మరింత పెద్ద ఎత్తున మొక్కలను పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని నిరంజన్ రెడ్డి గారు తెలియచేసారు.

Also Read: Ideal Tillage: మంచి విత్తన మడి కి నేలను ఎలా దున్నాలి.!

Minister Nirajan Reddy Garu

Minister Nirajan Reddy Garu

తిరుమలయ్య గుట్ట చుట్టూ సుందరీకరణ చేపట్టాలి అని అన్నారు. గుట్ట పైకి వెళ్లేందుకు రహదారి వెంట మెట్ల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వాహనాలకు ఇబ్బందిలేకుండా, పాదాచారులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు. వచ్చిన భక్తులకు గుట్ట మీదికి నీటిసౌకర్యం కల్పిస్తాం అని తెలియచేసారు. వాహనాల పార్కింగ్ కు శాశ్వత ఏర్పాట్లు చేపడతామని అన్నారు.

అన్ని రంగాలలో ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేపడతామని తెలియపరిచారు. అన్నివర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్ అమ్మవడి, ఆసరా ఫించన్లు ఒక్క తెలంగాణలోనే విజయవంతంగా అమలు చేస్తుండం తెలంగాణ ప్రభుత్వ ఘనత అని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్న ఘనత కేసీఆర్ ది అని నిరంజన్ రెడ్డి గారు ప్రశంసించారు.

Also Read: Stiff Sickness in Cattles: ఆవులలో మూడు రోజుల అస్వస్థత వ్యాధి ఎలా వస్తుంది.!

Leave Your Comments

Soil Moisture Uses: నేలలో నీటి ఆవశ్యకత.!

Previous article

Calf Management: దూడను తల్లి నుండి వేరు చెయ్యడం వలన కలిగే లాభాలు.!

Next article

You may also like