Bendi Cultivation: లేత బెండకాయలను వివిధ పంటల తయారీ లో ఉపయోగిస్తారు.వేపుడుగాను, ఉడకపెట్టిన సలాడ్ గాను సూప్ గాను తీసుకుంటారు. బెండలో విటమిన్ ఎ, బి, సి లు ఉన్నాయి.ఈ కాయలలో అయోడిన్ ఎక్కువగా ఉన్నందున గాయిటర్ వ్యాధి నివారణ కోసం వాడతారు.బెండ వేర్లు కాండం వచ్చిన రసం ను శుభ్రపరచడానికి బెల్లం, చెక్కెర పరిశ్రమలలో వాడతారు.
వాతావరణం: ఇది ఉష్టమండలపు పంట. చల్లని వాతావరణం లో పంట పెరుగుదలకి ప్రతికూలం.ఈ వర్షా కాలం మరియు వేసవిలో పంటను పండించడానికి అనుకూలం.
నేలలు: సారవంతం అయినా ఇసుక నేలలు మురుగు నీరు పోయే సౌకర్యం గల తేలిక పాటి నల్ల రెగడి నేలలు సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైనా ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది.
విత్తనం విత్తే పద్దతి: నేలలో 4-5 సార్లు బాగా దున్నాలి. వర్షా కాలం పంటను 60సేం. మీ ఎడం తో బోదెలు వేసి వాటికి 20-30 సేం. మీ. దూరంలో నాటుకోవాలి.వేసవి పంటను మాడులు తయారు చేసుకొని వరుసల మధ్యన 45 సేం. మీ. మొక్కల మధ్యన 15-20 సేం. మీ. ఉండేలా విత్తుకోవాలి.
Also Read: Bendi Cultivation: బెండి విత్తే సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
విత్తే దూరం: 60×20-30సేం. మీ.ఖరీఫ్
45×15-20సేం. మీ. రబీ
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియ దున్నలి.20 కేజీ ల భాస్వరం,20 కేజీ ల పోటాషియం నిచ్చే ఎరువులు కూడా ఆఖరి దుక్కిలో వేయాలి.45 కేజీల నత్రజని ఇచ్చే ఎరువులను సమభాగాలుగా 1/3 వంతును విత్తిన 30-45 రోజుల్లో వేయాలి.
అంతర కృషి
కలుపు మొక్కలు పెరగనివ్వకుండా ఎప్పటికి అప్పుడు తీసి వేయాలి.వర్షా కాలంలో మట్టిని వదులు చేసి బోదెలు సారి చేయాలి.పంట పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా పిచికారీ చేయడం ద్వారా 20-25% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడి ని పొందవచ్చు.
నీటి యాజమాన్యం
వేసవిలో ప్రతి 5-6 రోజుల ఒకసారి నీటి తడులను ఇవ్వాలి.వర్షా కాలం లో నేలలోని తేమను బట్టి నీటి తడులు ఇవ్వాలి.
కోత
నాటిన 45-50 రోజులకు మొదటి కోత వస్తుంది. కాత కాసిన 4-6 రోజులకు కాయ కొస్తే నాణ్యత బాగుంటుంది.ప్రతి రెండు మూడు రోజులకోసారి కాయలు కొయ్యాలి.లేదంటే కాయలు ముదిరి పనికి రాకుండా పోతాయి.
దిగుబడి
ఖరీఫ్ లో అయితే 3-4 ట / ఎ
రబీ లో అయితే 2-2.5 ట /ఎ దిగుబడి లభిస్తుంది.
విత్తనోత్పత్తి
బెండ విత్తనోత్పత్తి కోసం రకాల మధ్య దూరం 40 మీటర్ల. వరకు ఉండడం అవసరం. బెండకాయలు బాగా పండిన తర్వాత విత్తనాన్ని వేరు చేయాలి.ఒక హెక్టారుకు సుమారు 10-20 క్వి 1-2 టన్నులు విత్తన దిగుబడి వస్తుంది.
Also Read: Bendi Cultivation: బెండకాయ సాగుకు అనువైన వాతావరణం మరియు నేలలు