Tomato Cultivation: ప్రపంచంలో అత్యధికంగా సాగు చేయు కూరగాయలలో టమాటో ముఖ్యం అయినది.సంరక్షణ ఆహారంలో ఈ పంట ముఖ్యమైనది.దీనిలో విటమిన్ సి, ఆస్కార బిక్ ఆమ్లం మరియు విటమిన్ – బి,ఏ పుష్కలం గా లభిస్తాయి.టమాట లు పచ్చిగా లేక పండిన తర్వాత కూరగాయలు గా వండ వచ్చు.దీని నుంచి పచ్చళ్ళు, సాస్ , సూప్ , కేచప్ లను తయారు చేసుకుంటారు.
వాతావరణం
టమాటో ను సంవత్సరం పొడవునా సాగు చేయ వచ్చు.
కానీ అధిక దిగుబడులు రావాలి అంటే శీతకాలం అనువైనది.ఎక్కువ ఉష్ణోగ్రత గాని తక్కువ ఉష్ణోగ్రత కానీ తట్టుకోలేదు. మరియు కాయల దిగుబడి తగ్గిపోతుంది.
నేలలు
బాగా నీరు ఇంకే నేలలు, బరువు అయినా గరప నేలలు ఈ పంటకు అనుకూలం.వర్షాకాలంలో తేలిక పాటి నెలల్లో వర్షాధార పంటగా పండించవచ్చు. శీతకాలంలో ఇసుక తో కూడిన గరప నేలలు మరియు బరువు అయిన బంక నెలల్లో సాగు చేయవచ్చు.
నారు మడి తయారీ
నేలను శుభ్రంగా 3-4 సార్లు దుక్కి చేయాలి. ఆఖరి దుక్కిలో 40 కేజీల పశువుల ఎరువు మరియు 4 కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి దుక్కిలో బాగా దున్నలి. మురుగు నీరు పోవుటకు మడికి మడికి మధ్య 50 సే. మీ. ఉండేలా చేసుకోవాలి.1 ఎకరాకు 10 నారుమడులు సరిపోతుంది.నారు కుళ్ళు తెగులు సోకాకుండా ముందు జాగ్రత్తగా 1 లీటర్ నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ తో నారు మాడులను శుద్ది చేయాలి. నారు మడి విత్తనాలను 10 సేం. మీ.వరుసగాల పై పైన 1-2 సేం. మీ. లోతులో నాటు కోవాలి.25 -35 రోజుల వయస్సు నుండి 3-4 ఆకులు ఉన్నప్పుడు నాటుకోవాలి.
Also Read: Organic Farming Uses: సేంద్రియ వ్యవసాయం
విత్తే కాలం
ఖరీఫ్ జూన్ – జులై,రబీ అక్టోబర్ – నవంబర్,
విత్తుకోవాలి.
విత్తన మోతదు
200 గ్రామ/ ఎకరానికి విత్తుకోవాలి
విత్తే దూరం
ఖరీఫ్ లో అయితే 60×45సేం. మీ
వేసవి అయితే 45× 35 సేం. మీ.
రబీ లో 60×60సేం. మీ. విత్తుకోవాలి
ఎరువులు
ఎకరానికి 10 కేజీల చొప్పున జింక్ సల్ఫేట్ వేస్తె జింక్ లోపం రాకుండా మొక్క దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరానికి 1 మీ. లీ.ప్లానోఫిక్స్ పిచికారీ చేస్తే పూత, పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.
కలుపు నివారణ
కలుపు నివారణకు పెండిమీథాలీన్ ఎకరాకు 1.25 లేదా అల్లాక్లోర్ 1.0 లీ. లీటర్ నీటికి కలిపి తడి నెలపై పిచికారీ చేస్తే కలుపును నివారణ చేయవచ్చు.
అంతర కృషి
ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నాశనం చేయాలి. రసాయన ఎరువులు వేసేటప్పుడు నేలను కలియాదున్ని మొక్క వైపునకు మట్టిని వేయాలి.మొక్క చివర్లు తుంచుడం వల్ల కొమ్మలు ఎక్కువగా ఏర్పడి అధికంగా కాపు వచ్చును.
నీటి యాజమాన్యం
భూమిలో తేమను బట్టి 7-10 రోజులలో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒక సారి నీటి తడి అవసరం ఉంటుంది.
కోత
నాటిన 65- 70 రోజులకు కోత వస్తుంది.ఆ తరువాత 45-60 రోజులకు కాయలు వస్తాయి.టమాటో ను అమ్మే దూరాన్ని బట్టి కాయలు కోస్తారు.ఆకు పచ్చ దశలో ఉన్నప్పుడు దూర ప్రాంతం రవాణా కోసం కోస్తారు.పక్వ దశ అయితే మార్కెట్ కి వెళ్లే ముందు కోస్తారు.
దిగుబడి
రబిలో 12 -16ట / ఎ
వేసవిలో 8-12 ట /ఎ
నిలువ చేయుట
సుమారు12-15 సేం. గ్రే వద్ద టమాటోను 20 రోజులు నిల్వ చేయవచ్చు.పూర్తిగా పక్వం చెందిన పండ్లను4.5 వద్ద 10 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
Also Read: Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె, అక్షింతల పురుగుల యాజమాన్యం.!