Soil Structure: నేల ఆకృతి soil structure నేల లోని మట్టి కణాలు అమర్చబడిన పద్ధతిని “నేల ఆకృతి” అంటారు.నేలలో గల మూడు ముఖ్యమైనట్టి మట్టి రేణువులు ( ఇసుక, ఒండ్రు, బంకమన్ను) వేరు వేరు గా ఎప్పుడూ ఉండవు.
నేల ఆకృతి – ప్రాముఖ్యత:
నేల ఆకృతి మట్టి కణాల పరిమాణం, ఆకారాన్ని బట్టి మారుతుంది.స్థూల సూక్ష్మ నాళికల పరిమాణం, స్వభావాన్ని నేల ఆకృతి ప్రభావితం చేస్తుంది.స్థూల, సూక్ష్మ నాళికలు సమాన స్థాయిలో ఉండడం వల్ల మురుగు నీరు పోవుటకు, వాయు ప్రసరణకు, నీటి నిల్వసామర్ధ్యం నకు తోడ్పడుతుంది.సమస్థాయిలో నీరు, గాలి ఉన్నపుడు సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది పోషక పదార్ధాల మార్పునకు తోడ్పడుతుంది. పంట దిగుబడులు ముఖ్యంగా నేల ఆకృతి పై ఆధారపడి ఉంటాయి.నేల రచన (soil texture) ఏ సేద్య విధానాల వల్ల మార్చడానికి వీలుకాదు. కాని నేల నిర్మాణము (soil structure) ను మాత్రము సేద్య పద్ధతుల ద్వారా మార్చుకోవచ్చు.
Also Read: Atmosphere Layers of Earth: వాతావరణ నిర్మాణ స్వరూపాన్ని తెలుసుకోండి.!
సూక్ష్మ జీవుల ప్రాధాన్యత:
ఇసుక నేలల్లో నీరు నిల బెట్టుకోవడానికి, నల్ల రేగడి నేలల్లో మురుగు నీరు పోవడానికి నేల ఆకృతిలో మార్పులు చేయాలి. ఈ మార్పులు జరుగుటలో సూక్ష్మజీవుల పాత్ర ఎంతైనా ఉంది.నేలలో చొచ్చుకు పోయే వేర్లు నేల పొరల్లోకి విశాలంగా పోయి చిన్న చిన్న బంక రేణువులను రేణు సముదాయాలుగా చేస్తుంది.క్రొత్త వేర్లు తొడిగినపుడు పాత వేర్లు నిరంతరం నశిస్తూ ఉండటం వల్ల వేర్లు అనేక రకాల స్రావాలను విడుదల చేసి సూక్ష్మ జీవుల అభివృద్ధి కి, వాటి చురుకుదనమునకు హ్యూమిక్ సిమెంట్స్ ఉత్పత్తి అవుతాయి. ఆక్టినోమైసిట్ లు, శిలీంద్రాలు తయారుచేసే తెల్లని బూజు తో మట్టి రేణువులు యాంత్రికంగా బంధించి గ్రాన్యూల్స్ గా తయారు అవుతాయి.
బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు విసర్జించే జిగట పదార్ధాల వల్ల రేణు రాశులు బంధనంలో ఉంటాయి.సూక్ష్మజీవులు కుళ్ళ బెట్టిన సేంద్రియ ఉత్పత్తులు – హ్యూమిక్ యాసిడ్, కొల్లాయిడల్ ప్రోటీన్లు, సెల్యులోజ్ కూడా స్థిర ప్రభావాన్ని కలిగిస్తాయి.మట్టి అణు రాశులను సుస్థిరంగా ఉండడానికి వానపాముల విసర్జకాలు బాగా పని చేస్తాయి.
నేల ఆకృతి యాజమాన్యం:
నేల ఆకృతి పై పంటల దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందువలన వ్యవసాయ యాజమాన్యంలో చేసే ప్రతి పని “నేల ఆకృతి ” చెడకుండా చేసుకోవాలి.నేలలో తగు తేమ ఉన్నప్పుడే దుక్కి చేసుకోవాలి.మట్టి కణ సముదాయాలు (granules) స్థిరీ కరణ కు దోహదపరచే సేంద్రియ పదార్థాలు తరుచుగా నేలకు అందించాలి. అనువైన పంటల సరళి పాటించాలి. గడ్డి, పచ్చిక జాతి పంటలను సాగు చేయాలి.నేల సమస్యలను బట్టి ( ఆమ్ల లేదా కార) ఆయా యాజమాన్య పద్ధతులను పాటించాలి.భాస్వరం ఎరువులను వాడాలి.
Also Read: Sowing the Seeds: విత్తనాలు విత్తుట.!