Sowing the Seeds: భూమి తయారయిన తర్వాత ఆఖరి దుక్కికి ముందు సేంద్రియ పదార్థాలు వేసి కలియ దున్ని వర్షం పడిన తర్వాత తగు తేమ లో విత్తుతారు. నీటి వసతి ఉన్న చోట్ల విత్తిన వెంటనే నీరు పెడతారు. నీరు మాత్రం ఎక్కువ కాలం నేల పై నిల్వ ఉండరాదు. కొన్ని నేలల్లో ముఖ్యo గా సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నెలల్లో విత్తిన తర్వాత వర్షం పడితే నేల పై పొర గట్టి విత్తనం మొలకెత్తిన మొలక పైకి రాక భూమి లోనే చనిపోతుంది.
విత్తే పద్ధతులు:-
రెండు రకాలలు
ప్రధాన పొలం లో నేరుగా విత్తుట
నారు మడిలో విత్తి ప్రధాన పొలం లో నారు మొక్కలను నాటుట
నేరుగా విత్తుట రెండు రకాలు
వెదజల్లే పద్ధతి
వరుసలలో విత్తే పద్దతి
వెదజల్లే పద్ధతి :-
తయారు చేసిన పొలం లో తగిన మొతదు లో విత్తనాన్ని తీసుకొని నేలపై సమానంగా పెడేటట్లు జల్లుతారు. జల్లిన తర్వాత తేలిక గా దున్ని విత్తనం లోనికి పోయిన తర్వాత తేలిగ్గా పలక తొలి చదును చేస్తారు.
విత్తిన రేటు తక్కువయిన లేదా విత్తనం చిన్న పరిమాణము ఉన్నప్పుడు ఇసుకలో కలిపి వెదజల్లుతారు.
వెదజల్లడం అనుభవం గలవారు చేసినపుడు నేలపై విత్తనం ఎక్కువ, తక్కువ కాకుండా సమానంగా పడుతుంది. ఈ పద్ధతి సాధారణంగా పశు గ్రాసము మరియు పచ్చి రొట్టె పైర్లను పెంచడానికి వినియోగిస్తారు.
Also Read: Sunlight Uses: సౌర శక్తి- మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది.!
నష్టాలు:-
పోలమంతా సమానంగా విత్తుట జరగదు.
విత్తనమంతా ఒకే లోతున పడదు. అందువలన మొలక సమానంగా ఉండదు.
లోతు గా పడిన విత్తనాలు మొలకేత్తవు.
పై పైన పడిన విత్తనాలు పక్షులు, కిటకాలు తీసుకొని పోతాయి.
పంట వరుసలలో ఉండదు కనుక అంతర కృషి పరికరాలు ఉపయోగించ వీలుకాదు. కనుక కలుపు తీయాలనంటే ఖర్చు ఎక్కువ, శ్రమ తో కూడిన పని.
ఈ పద్ధతి లో ఎక్కువ విత్తనాన్ని ఉపయోగించాలి.
వరసలలో విత్తుట:-
వెదజల్లే పద్దతి లో గల కష్ట నష్టాలను అధిగమించడాననికి వరుసలలో విత్తుట మంచిది. దీనిలో రెండు రకాలు కలవు
డ్రిల్లింగ్
డిబ్లింగ్
డ్రిల్లింగ్:-
నిర్దేశించే వరుసల మధ్య దూరం ల సీడ్ డ్రిల్ అను వ్యవసాయ పనిముట్లను వాడతారు. పశువుల చే లాగా బడు దానిని గొర్రు అంటారు. రాగి, కొర్ర, జొన్న, మొక్క జొన్న, శనగ, వేరుసెనగ, ధనియాలు మొదలైన పంటలు ఈ విధంగా విత్తుతారు. వరుసల మధ్య దూరం పంటను బట్టి, నేల సారాన్ని బట్టి, విత్తే సమయం బట్టి, నేలలో తేమ బట్టి, పంట పెరిగే స్వభావాన్ని బట్టి మారుతుంది.
Also Read: Marek’s Disease in Poultry: కోళ్ళలో మారెక్స్ వ్యాధి లక్షణాలు ఇలా గుర్తించండి.!