పశుపోషణమన వ్యవసాయం

Artificial Insemination in Cows: ఆవులలో కృత్రిమ గర్భధారణకు సరియైన సమయం తెలుసుకోండి.!

2
Artificial Insemination
Artificial Insemination

Artificial Insemination in Cows: సహజ సంపర్కం అంటే సహజంగా ఒక ఆవు గాని, గేదె గాని ఎదకు వచ్చినపుడు అంబోతు చేత దాటించి సంతానోత్పత్తి చేయడమన్నమాట.

కృత్రిమ గర్భధారణ అంటే ఒక మేలు జాతి వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతులలో, పరికరాల ద్వారా సేకరించి ఎదకు వచ్చిన పశువుకు, పరికరాల ద్వారా వీర్యాన్ని యోనిలో ప్రవేశింపజేసి, మడికట్టించి సంతానోత్పత్తి చేయడం.

మన పశువులను త్వరగా అభివృద్ధి పరిచి అధిక పాల ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి ఒక్కటే మార్గము. మన దేశవాళి పశువులను అధిక పాల ఉత్పత్తి చేసే విధంగా సంకరం పరుచడానికి పెద్ద యెత్తున కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా పద్దతి ద్వారా పశుగణాభివృద్ధి చేయడం జరుగుతుంది.

కృత్రిమ గర్భధారణ:

ఆవులలో ఎదకాలం 18-24 గంటలు ఉంటుందని మనం ఇంతకు పూర్వం తెలుసుకున్నాo. అదే గేదెలో 24-36 గంటలు వరకు వుంటుంది. ఎద పశువుకు అది ఎదకు వచ్చిన 12-14 గంటల లోపల గర్భధారణ చేయించాలి. అంతకు ముందు గాని, ఆ తర్వాత గాని గర్భాధారణ చేస్తే మాలు కట్టే అవకాశాలు చాలా తక్కువ. పశువు ఎదకు వచ్చిన 12-14 గంటల తరువాత అండాశయం నుండి అండం విడుదల అవుతుంది.

Also Read: Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!

Artificial Insemination in Cows

Artificial Insemination in Cows

అండం విడుదలయ్యే లోపల పిండోత్పత్తి జరగడం కోసం వీర్యకణాలు ప్రవేశ పెట్టడం అవసరం కావున పశువు ఎదకు వచ్చిన తర్వాత 12-14 గంటల మధ్య కాలంలో అనగా పశువుల ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే ఆ మరుసటి రోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఈ దశలో పశువు మానం నుండి తీగలు బాగా వేస్తుంది. తీగలు తొడపైన తోకకు అంటుకొని ఉంటాయి. పాడి పశువు గర్భధారణ చేయించిన పిదప కూడా 10 గంటలు పైన ఎద లక్షణాలు వుంటే తిరిగి ఇన్ సెమినేషన్ వేయించాలి.

ఎదకు వచ్చిన పశువును బయటికి వదలకుండా ఇంట్లోనే కట్టి మేపాలి. ఇతర ఆంబోతులు ఎక్కకుండా జాగ్రత్త పడాలి. గేదెలలో అయితే ఎద 36 గంటలు వుంటుంది కనుక రోజు ఉదయము ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం అనగా ఎద ప్రారంభం అయిన 24 గంటలలో చేయించాలి.

Also Read: Importance of Food Grain Crops: ఆహార ధాన్య పంటల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!

Previous article

Lemongrass Cultivation: నిమ్మగడ్డి సాగులో మెళుకువలు.!

Next article

You may also like