Tuberculosis Disease in Cattle: మైకోబ్యాక్టీరియమ్ బోవిస్ అను ఆసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా వలన అన్ని రకముల పశువులకు మరియు మనుషులకు కలుగు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు వ్యాప్తి చెందు ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధి.
వ్యాధి కారకం:-
ఇది మైకో బ్యాక్టీరియమ్ జాతులైన మై. బోవిస్ వలన పశువులు, మనుషులు, కుక్కలలోను, మై. ట్యూబర్క్యులోసిస్ వలన మనుషులు, కుక్కలు, గుర్రాలలోను, మై. ఎవియం వలన కోళ్ళు, గుర్రాలలో ఈ వ్యాధి కలుగుతుంటుంది. ఇవి కర్ర ఆకారంలో వుండి, వీటి చుట్టు పలుచటి క్రొవ్వు కలిగిన పొర ఉంటుంది. ఈ పొరలో మైకాలిక్ ఆమ్లం ఉంటుంది. ఫలితంగా ఈ బ్యాక్టీరియాలు ఆసిడ్ ఫాస్ట్ వర్ణకంతో స్టెయిన్ చేసి చూడవచ్చును. కార్డ్ ప్యాక్టర్, హీట్ షాక్ ప్రొటీన్ మరియు మైకాలిక్ ఆమ్లం వంటి వాటి వలన ఈ బ్యాక్టీరియాలకు వ్యాధిని కలిగించు గుణం ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలను ప్రయోగశాలలో డార్సెట్ మీడియాలో పెంచవచ్చు.డార్సెట్ మీడియాలో పెంచవచ్చు.
వ్యాధి బారిన పడు పశువులు:- ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులు మరియు పెంపుడు జంతువులతో పాటు మనుషులలో కూడా ఈ వ్యాధి కలుగుతుంది.
వయస్సు:- అన్ని వయస్సుల గల పశువులలో ఈ వ్యాధి వస్తుంది. కాని రెండు సంవత్సరాలు మించిన పశువులలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా వుంటుంది. కాని మనుషులలో ఈ వ్యాధి చిన్న వయస్సులలోనే ఎక్కువగా వస్తుంది. సరియైన పోషక ఆహారం లేకపోవుట, విటమిన్ సి లోపం, పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, అధిక శాతం పశువులు లేదా మనుషులు తక్కువ స్థలంలోనే నివసించటం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రబలుటకు దోహదం చేస్తాయి.
Also Read: Cassia Angustifolia Cultivation: నేలతంగేడు సాగులో మెళుకువలు.!
వ్యాధి వచ్చు మార్గం:-
(1) శ్వాసకోశ వ్యవస్థలో ఈ వ్యాధి యొక్క బ్యాక్టీరియా ప్రధానంగా ఉండటం వలన గాలి ద్వారా ఇతర పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
(2) ఈ వ్యాధి బ్యాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు మరియు వ్యాధి సోకిన పశువుల యొక్క పాలను వినియోగించడం వలన కూడా ఇతర పశువులకు కలుగుతుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానము:- గాలిలోని బ్యాక్టీరియాలు ముక్కు ద్వారా శోషరస గ్రంథులలో చేరి అక్కడ కణజాలలో గడ్డలను ఏర్పరచి, తరువాత వాటి నుండి ఈ బ్యాక్టీరియాలు బయటకు విడుదలయి, రక్తంలో కలిసి వివిధ అవయవాలైన కాలేయం, మూత్ర పిండాలు, ప్లీహము, మెదడు మరియు ఎముకలలో చేరి అక్కడ వ్యాధిని కలుగజేస్తాయి. కొన్ని సందర్భములలో పొదుగు కణజాలంకు చేరి పొదుగు వాపు వ్యాధిని కూడా కలుగజేస్తాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా టి.బి గడ్డలు ఊపిరితిత్తులలో తయారవుతాయి.
టి.బి గడ్డలు తయారు అగు విధానం:- ఈ వ్యాధి యొక్క బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు, శరీరమంతట ఈ బ్యాక్టీరియాలు విడుదల కాకుండా ఉండటానికి, మొదట ఈ బ్యాక్టీరియాల చుట్టు న్యూట్రోఫిల్స్, మాక్రోఫెజేస్, జైంట్సెల్స్ ( లాంగర్ హాన్స్ టైప్) ఎపిథిలాయిడ్ కణాలు మరియు లింపోసైట్స్ కణాలు ఏర్పడి వీటి చుట్టు పైబ్రస్ టిష్యూ చేరుతుంది. ఫలితంగా చిన్న గడ్డ మాదిరి ఏర్పడి అందులో బ్యాక్టీరియాలు బంధింపబడి ఉంటాయి. ఈ విధంగా గడ్డలు తయారగుటను డిలేయడ్ టైప్ అప్ హైపర్ సెన్సిటివిటీ అని అంటాయి.
Also Read: Poultry Farm Shed: కొత్తగా కోళ్ల ఫారమ్ షెడ్డు నిర్మింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!