వార్తలు

ఆలిండియా హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ షో

0
  • ఆలిండియా హార్టికల్చర్,అగ్రికల్చర్ షోకు విశేష స్పందన
  • మనసు దోచుకుంటున్న” పచ్చని” ప్రదర్శన
  • స్టాళ్ళన్నీ సందర్శకులతో కిటకిట
  • పూల సౌందర్యాల మధ్య సేల్ఫిలతో సందడి
  • విభిన్న రకాల ఉత్పత్తులు,మొక్కల కొనుగోళ్ళతో బిజీ బిజీ
  • మొక్కల పెంపకంపై నిర్వాహకుల చక్కని సలహాలు
  • మొక్కలకూ “ఆర్గానిక్” … మాగిన పశువుల ఎరువుతో చక్కని ఫలితాలు
  • ఎరువుతోనే మొక్కకు బలం
  • గుర్తింపు పొందిన వాటినే ఎంచుకోవాలి
  • మాగిన ఎరువే ఉత్తమం..

ఆలిండియా హార్టికల్చర్,అగ్రికల్చర్ షోకు విశేష స్పందన వస్తున్నది.రెండో రోజూ ప్రకృతి ప్రేమికులతో కిటకిటలాడింది.చిన్నారుల నుంచి వృద్దుల వరకు ఈ ప్రకృతి వనంలో తమకు నచ్చిన పూలు,పండ్లు,అలంకార మొక్కలు,వివిధ రకాల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.సుందర మైన పూల సౌందర్యాల మధ్య సేల్ఫిలు తీసుకుంటూ…సంబరపడ్డారు.ఇక ఇంటికిఅనువుగా మొక్కలు ఎలా పెంచాలో సందర్శకులకు విలువైన సలహాలు ఇస్తున్నారు.స్టాళ్ళ నిర్వాహకులు.సేంద్రియ ఎరువుల వాడకంపైనా చక్కగా అవగాహన కల్పిస్తున్నారు.

పెరట్లో పెంచుకునేందుకు…

పండ్లు,కూరగాయలు,అలంకరణ మొక్కల పెంపకంలో నగరవాసులు బిజీ అవుతున్నారు. దీంతో పర్యావరణానికి ,ఆరోగ్యానికి మేలు చేకూర్చిన వారవుతున్నారు. ఇలాంటి వారి కోసం నర్సరీ మేళా దన్నుగా నిలిచింది.దేశి,విదేశీ వంగడాలు అందుబాటులో వున్నాయి.నాణ్యమైన చెట్లు విక్రయానికి ఉంచారు.పెరట్లో,ఇంట్లో పెంచుకునే అనేక వెరైటీప్లాంట్స్ ప్రత్యేక ఆకర్షణగా వున్నాయి. స్దలభావానికి తగ్గట్టుగా మొక్కలను ఎంపిక చేసుకుంటున్నారు.

వెరైటీలు ఇవిగో…

  • స్ట్రాబెర్రి ప్లాంట్ అందుబాటులో ఉంది.సాధారణంగా దీనిని మార్కెట్లో కొనుగోలు చేస్తే రూ.250 ఉంటుంది.కాని మేళాలో ఇది రూ.70 కే లభిస్తున్నది.
  • మిల్క్ ఫ్రూట్ .ఇది వియాత్నం నుంచి తెప్పించిన మొక్క.అయితే ఇది పెరగి పెద్దగా కావాలంటే చాలా ఏండ్లుపడుతుంది.అయితే ఇ మొక్కకు వున్న ప్రత్యేకత ఏమిటంటే.. కొద్దికాలంలో ఏపు గా పెరిగి వృక్షంగా మారుతుంది.ఇది చాలా ఎత్తుతో పాటు గుబురుగా పెరుగుతుంది.
  • స్వీట్ నారింజ విత్తనాలు,వెల్వెట్ యాపిల్,సింహాచలం సంపంగి,ఆల్ టైం మ్యాంగోప్లమ్తదితర మొక్కలు సైతం నర్సరీ లో అందుబాటులో ఉన్నాయి.

ఇంటికి అనువుగా…

ఇండోర్ ప్లాంట్స్,వాటర్,ఎయిర్ ఫ్యూరిపై ప్లాంట్స్ లాంటివి మేళాలో తక్కువ ధరల్లో లభిస్తున్నాయి.జెడ్,తైవాన్,అరిలియా,విరిగేట్ ఫైకస్,జీజీ తదితర అలంకరణ మొక్కలకు డిమాండ్ ఉంది.వీటితో పాటు అరుదుగా లభించే ఫిలోడెండ్రాన్,మస్టిక్స్ ప్లాంట్స్ ,ఫేర్న్స్,డ్రెసియన్స్,అగ్లొనిమాస్,సన్స్ వెరియస్,కాక్టస్,సక్యులెన్స్,అలకేషియా,అంబ్రెల్లా గ్రాస్,లోటస్,లిల్లీ,తదితర మొక్కలు అందుబాటులో వున్నాయి.వీటికి ఇతర రాళ్ళు,చిట్టి విగ్రహాలు,తీగ మొక్కలతో కలిపి అందంగా డెకరేషన్ చేసి ఉంచారు.రూ.300నుంచి 6 వేల వరకు ధరలు పలుకుతున్నాయి.వీటిని కోనుగోలుచేశాక కొంత సూర్యరశ్మి తగిలేలా ఉంచితే సరిపోతుంది.వీటిలో జీజీ ప్లాంట్ ప్రత్యేకంగా ఉంది. ఎలాంటి వేడి అవసరం లేకుండానే తళుక్కుమంటున్నది.చీకట్లో ఉంచిన మొక్కను ఎలాంటి నష్టం ఉండదని నిర్వాహకులు తెలిపారు.అలంకరణ మొక్కలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు.

స్దలానికి తగ్గట్టుగా మొక్కల అమరిక

ఇంట్లో కొద్ది సదం వున్నా..మొక్కలను ట్రే లలో అందంగా అమర్చుతాం. చాలా మంది స్ధలం లేక బాధపడుతుంటారు. అలాంటి వారు ఇబ్బందిపడకుండా ఉండటం కోసం… మేము వారి ఇంటికి వెళ్లి వారికి నచ్చిన మొక్కలను అందించడంతో పాటు ఉన్నకాస్త స్ధలంలో అందంగా అమర్చే బాధ్యత తీసుకుంటాం ..మేళాకు వచ్చిన చాలా మంది స్ధలం లేదని చెబుతున్నారు. వారికోసం మా వద్ద ప్రత్యేక డిజైన్ లలో మొక్కలు ఉన్నాయి.

కొన్ని జాగ్రత్తలు పాటించాలి

మొక్కల పెంపకంలో విభిన్న రకాల సమస్యలు తలెత్తితే ఎదుర్కోవడంపై కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ఆముదం,వేపపిండి,డై అమోనియం పాస్పెట్,పశువుల ఎముకల పిండిని 2 కేజీలు తీసుకుని దానిని 200లీటర్ల లో కలుపాలి.ఆ తర్వాత అది కుళ్లటం ప్రారంభమవుతుంది.ఇలా వారం రోజులు ఉంచాలి.ఆ మిశ్రమాన్ని మొక్కలకు పోయాలి.అప్పుడూ ఆ మొక్క బలంగా పెరగడం,ఆకులు పచ్చగా ఉండటం,పండ్లు సమృద్దిగా నశిస్తాయి.అలాంటి సందర్భంలో మూరెడు పొడవున్న ఓ రేకును తీసుకుని దానికి పసుపు కలర్ ను పూయాలి.అనంతరం దానికి ఆముదం నూనెను అద్దాలి.అలా పూసిన రేకులను మొక్కల మధ్య ఉంచాలి.ఆ సమయంలో వైరస్ మొక్కలపై వాలకుండా ఆ రేకులు అడ్డుకుంటాయి.

కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయ్

ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం చాలా వరకు విషతుల్యమైనదే.అందుకే కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.వాటిని ఎదుర్కోవడానికి మన ఆహారశైలిలో మార్పులు రావాల్సిన అవసరం ఆసన్నమైంది.ఇప్పుడు మనం తినే తిండే రేపు మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.అందుకే రసాయానాల వాడని ఆహార ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించాలి.అందులో మేము హైడ్రోపోనిక్ గ్రీన్ ఫార్మ్స్ పేరిట నగరవాసులకు మట్టి లేకుండా పంట పందిన్చాడంపై అవగాహన కల్పిస్తున్నాం.ఈ మేళా చాలా వరకు సందర్శకులలో మార్పు తీసుకొస్తుందని భావిస్తున్నారు.

ఔషధ మొక్కలతో ఉపయోగాలెన్నో…

వ్యవసాయ యూనివర్శిటి: ప్రస్తుత వాతావరణ పరిస్దితుల్లో ప్రతి ఇంటా ఔషధ మొక్కలు ఉండటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు ఔషధ,సుగంధ మొక్కల రీసెర్చ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జె.చిన్ననాయక్. ఔషధ ,సుగంధ మొక్కలకు ప్రస్తుత పరిస్దితుల్లో డిమాండ్ అధికంగా ఉందన్నారు.ఇది ఆసరాగా చేసుకుని దళారీలు అధిక ధరలకు నాణ్యత లేని మొక్కలు,విత్తనాలు విక్రయిస్తున్నారని,వారిని ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.ప్రభుత్వం విక్రయించే చోటనే కొనుగోలు చేయడం వల్ల నాణ్యమైన మొక్కలు,విత్తనాలు,సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. రాజేంద్ర నగర్ నర్సరీ లో ప్రస్తుతం 100 రకాల మొక్కలు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటూ…ప్రధానంగా మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం ఇన్సూలిన్,పొడపత్రి,జలుబు,ఇతర రోగాల బారిన్ పడకుండా ఉంచే విష్ణుతులసి,ఆశ్వగంధం, అస్తమా తీగ,బచ్చలి,చంద్ర కాంత దేవర కంచె,గచ్చకాయ ,జమ్మి,కృష్ణ తులసి తదితర మొక్కలు ఇక్కడ లభిస్తున్నాయన్నారు.

వంద శాతం ఆర్గానిక్ ఉత్పత్తులు…

ప్లాంట్ న్యూట్రియంట్ సప్లిమెంటరీ.ఇది వంద శాతం ఆర్గానిక్ ఉత్పత్తులతో తయారు చేసినది.దీనిని అన్ని రకాల పండ్లు,పూలు,కూరగాయల మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తారు.ఆర్గానిక్ కార్బన్,హైడ్రోజన్,ఆక్సిజన్,నైట్రోజన్,పొటాషియం,ఫాస్పరస్,కాల్షియం వంటివి ఉంటాయి.మట్టిని శక్తి వంతంగా చేయడానికి బయోమిన్ ఆర్గానిక్ గ్రాన్యూల్స్ ని వినియోగించాలి.ఇది రూ.35కు కేజీ లభిస్తుంది.కోకోపిట్,ఆర్గానిక్ మెన్యూర్, సాండ్,నీమ్ కేక్,వామ్ అండ్ అజాడో బాక్టీరియాతో తయారైన ఎరువు ఆకులు పచ్చగా ఉండటానికి ఉపయోగపడుతుంది.పూలు,పండ్లు క్షీణించి రాలిపోకుండా ఉండేందుకు పోషక్ అడ్వాన్స్ డ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ వినియోగించాలి.మట్టిలో సూక్ష్మ జీవులను పెంచి మొక్కకు బలాన్ని ఇచ్చేందుకు విగోరూట్ వాడాలి.

Leave Your Comments

తెలంగాణ ఉద్యాన పంట సాగు పెరగాలి….

Previous article

నిత్యం ఆరోగ్యం గా ఉండాలంటే మనము పాటించవలసిన ఆహారపు అలవాట్లు

Next article

You may also like