పశుపోషణమన వ్యవసాయం

Heat Detection in Dairy Buffaloes: ఎదలో ఉన్న పాడి పశువులను ఎలా గుర్తిస్తారు.!

2
Heat Detection in Dairy Buffaloes
Heat Detection in Dairy Buffaloes

Heat Detection in Dairy Buffaloesపాడి పశువులలో ఎద లక్షణాలు:

ఆవులలో ఎదకాలం 18-24 గంటలు ఉంటుంది. గేదెలలో 24-36 గంటలు వరకు ఉంటుంది. ఎద కాలాన్ని సాధారణంగా మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో అండాశయములోని గ్రాఫియన్ పుటిక పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల, మానం నుండి పలుచని తీగలు వేస్తుంది. జరుగుతుంది.రెండొవ దశలో పశువు, ఆంబోతు సంయోగానికి ఇష్టత చూపుతుంది. ఈ దశలో అండాశయములో గ్రాఫియన్ పుటిక పరిపక్వము చెంది, అండము విడుదలకు సిద్ధంగా ఉంటుంది. మానం నుండి కోడి గ్రుడ్డు లాంటి తెల్ల సొనలాగా తీగలు వేస్తుంది.మూడవ దశలో అండము విడుదలయ్యి, వీర్యకణముతో కలిసి ఫలధీకరణ చెందుతుంది. నాల్గవ దశలో అండాశయములో కార్పస్ లూటియం పెరిగి ప్రొజెస్ట్రాన్ అనబడే హార్మోను విడుదలయ్యి మాలు నిలువడానికి ఉపయోగపడుతుంది.

ఎదలో ఉన్న పొడి పశువులను గుర్తించుట:

ఎదలో ఉన్న పొడి పశువులు ఈ క్రింది లక్షణములను వ్యక్త పరుస్తుంటాయి.

· చికాకుగా ఉంటుంది ఎద తొలి దశలో మంద నుండి వేరు పడి చిరాకుగా ఉంటుంది. మధ్యదశలో ఇతర పశువులతో కలిసి ఉంటుంది. కాని దాని ప్రవర్తన చిరాకుగా ఉంటుంది. ఎద చివరి దశలో ఈ రకమైన చిరాకు తగ్గిపోతుంది.

· ఆకలి మందగిస్తుంది తొలి దశలో ఆకలి మందగించి మేత సరిగ్గా మేయదు, మధ్య దశలో ఆకలి బాగా తగ్గిపోతుంది. చివరి దశలో ఆవులు మాములు ఆకలి కలిగి ఉంటాయి.

Heat Detection in Dairy Buffaloes

Heat Detection in Dairy Buffaloes

Also Read: Silent Heat Detection in Buffaloes: గేదెలలో మూగ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలి.!

· పాల ఉత్పత్తిలో తగ్గుదల తొలి దశలో పాల ఉత్పత్తిలో తగ్గుదల కన్పించి, మధ్య దశలో బాగా తగ్గుతుంది. చివరి దశలో మాములు స్థితికి చేరుతుంది.

· ఇతర పశువులను నాకుతుంది తొలి దశలోను, మధ్యదశలోనే ఎక్కువగా ఈ లక్షణము కన్పిస్తుంది.తరచుగా తోక పైకి లేపుతు చిరు ఉచ్చపోస్తుంది – మధ్య ఎద దశలో తరుచుగా అంటే 5 నిముషాలలో 2-3 సార్లు మూత్ర విసర్జన చేస్తుంది. ఎద చివరి దశలో మాములు స్థితికి వస్తుంది.

· మానం ఉబ్బియుంటుంది మానం లోపలి పొర ఉబ్బి, ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది.

· ఇతర పశువులు మీదకు ఎక్కిన కదలకుండా ఉంటుంది. ఎద తొలి మరియు మధ్యదశలోనే ఈ లక్షణం కన్పిస్తుంది. చివరి దశలో అది ఇతర పశువులను ఎక్కనివ్వదు. 8. మానం నుండి తీగలు పలుచగా కాని, నీళ్ళలాగా కాని ఉంటు రాను రాను చిక్కబడి తోక నుండి భూమి మీద వరకు వేలాడుతుండవచ్చు లేదా తోకకు మడికి అతుక్కొన్ని ఉండవచ్చు.

Also Read: Lung Plague Disease in Cows: ఆవులలో కంటేజియస్ బొవైన్ ఫ్లూరో న్యూమోనియా ఎలా వ్యాపిస్తుంది.!

Leave Your Comments

Lung Plague Disease in Cows: ఆవులలో కంటేజియస్ బొవైన్ ఫ్లూరో న్యూమోనియా ఎలా వ్యాపిస్తుంది.!

Previous article

Duck Management: బాతుల పెంపకంలో మెళకువలు.!

Next article

You may also like