Lung Plague Disease in Cows: ఈ వ్యాధి మైకోప్లాస్మా మైకాయిడ్స్ అనే సూక్ష్మక్రిమి వలన ప్రధానంగా ఆవులలో తీవ్రమైన దశ నుండి దీర్ఘకాలికంగా కలుగుతుంటుంది. ఈ వ్యాధిలో ఉర: కుహర అవయవాలైన ఊపిరితిత్తులు, పూరాలలో శోధం కలిగి, వాటి చుట్టు ఫైబ్రస్ కణజాలం పేరుకుపోతుంది.
వ్యాధి కారకం:- ఇది మైకోప్లాస్మా మైకాయిడ్స్ అనే సూక్ష్మక్రిమి వలన కలుగుతుంది. ఇవి గ్లియోమార్పిక్ గుణం కలిగి వివిధ ఆకారాలలో యుంటాయి. రింగ్, ఫిలమెంట్, బిజారే ఆకారాలలో సహజంగా యుంటాయి. వీటిని జీమ్సా స్టెయిన్ వర్ణకం చేసి చూడవచ్చు.
వ్యాధి వచ్చు మార్గం:- గాలి ద్వారా(ఇన్స్టాలేషన్) – వ్యాధితో ఉన్న పశువులు దగ్గిన్నప్పుడు లేదా వ్యాధి నుండి కోలుకున్న పశువులు క్యారియర్గా గా మారి వాటి ముక్కు స్రావాల ద్వారా ఈ వ్యాధి ప్రధానంగా వ్యాపిస్తుంటుంది. చలి, తేమతో కూడిన వాతావరణం ఈ వ్యాధి ప్రబలటకు తోడ్పడుతుంది. యూరిన్ కూడా ఈ క్రిములు బయటకు విడుదలగుతుంటాయి. యూరిన్ ఇనాలేషన్ ద్వారా కూడా వ్యాపిస్తుంటుంది.
శరీరంలో వ్యాధి విస్తరించు విధానం:- పై మార్గాల ద్వారా ఈ క్రిములు బ్రాంకస్లోకి చేరి, తద్వారా అల్వియేలై కణజాలలోకి చేరి దీర్ఘకాలిక శోధంను కలిగించుట వలన ఈ కణజాలలో వ్యాధికారక క్రిముల చుట్టు ఫైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. ఫలితంగా ఊపిరితిత్తులలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి. వీటినే సీక్వేష్ణా అని అంటారు. వీటిలో ఈ క్రిములు చాలా రోజుల వరకు జీవించే ఉంటాయి. ఫలితంగా ఈ పశువులు దగ్గిన్నప్పుడు ఈ సీక్వేస్ట్రాల చుట్టు ఉన్న ఫైబ్రస్ కణజాలం అంతా పగలిపోయి క్రిములు బయటి వాతావరణంలోకి విడుదలవుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తుల నుండి ఈ క్రిములు ఇతర అవయవాలకు సెప్టిసీమియాగా మారి ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంటాయి.
Also Read: Characteristics of Domestic Cows: పనికి ఉపయోగపడే దేశవాళి ఆవుల లక్షణాలు.!
వ్యాధి లక్షణo:- ఇంక్యుబేషన్ పీరియడ్ 10 రోజుల నుండి 260 రోజుల వరకు ఉంటుంది. తీవ్రమైన జ్వరం (105°F), తీవ్రమైన బలహీనత, పాల ఉత్పత్తి తగ్గిపోవుట, రూమినల్ మోటిలిటీ తగ్గిపోవుట, ఆకలి లేకపోవుట, దగ్గు, నడవలేక పోవుట, నడుము వంచి నడుచుట, నోటి నుండి నురగ కారుతుండడం, ముక్కు నుండి నీరు కారుతుండడం, మెడ క్రింది భాగాలలో నీరు చేరి ఉండటం, ఈసుకుపోవడం మొదలగు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:- ఉర: కుహరంలో నీరు చేరి యుండుట, ఊపిరితిత్తులలో ఫైబ్రినస్ న్యూమోనియా ఉండుట ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం, ఊపిరితిత్తుల కణజాలం అంతా గట్టి పడిపోయి ఉండుట (మార్బిలింగ్), సిక్వే స్ట్రాలుండుట ఈ వ్యాధి ప్రధానమైన వ్యాధి కారక చిహ్నములు.
వ్యాధి నిర్ధారణ:- రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణముల మరియు వ్యాధి కారక చిహ్నములు ఆధారంగా డార్క్ ఫీల్డ్ మైక్రోస్కాప్లో క్రిములను చూడటం ద్వారా, ఆగ్లుటినేషన్ చర్యల ద్వారా CFT, RIDT, PPT etc వంటి ప్రయోగశాల పరీక్షల ద్వారా ఈ వ్యాధినినిర్ధారించవచ్చు
చికిత్స:- వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు థైలోసిన్ టార్క్ట్ కి. లో శరీర బరువుకు 2-5 మి.గ్రా చొప్పున ప్రతి 12 గంటలకు ఒకసారి ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. సల్ఫనమైడ్ ఆంటిబయోటిక్లు లేదా స్ట్రెప్టోమైసిన్ అంటిబయోటిక్లు లేదా క్లోరం ఫెనికాల్ ఆంటిబయోటిక్లు లేదా లింకోమైసిన్ ఆంటి బయోటిక్లు కూడా మైకోప్లాస్మా మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటితో పాటు జ్వరం తగ్గించుటకు అంటిపైరెటిక్స్ మరియు ఆంటి ఇన్ఫ్లమేటరీ ఔషదములను ఇవ్వవలసి ఉంటుంది.
నివారణ:- ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటుంది కావున వ్యాధి బారిన పడిన పశువులను మంద నుండి వేరు చేసి వధించడం మంచిది. ఈ వ్యాధి కారక టీకాను 2 నెలల దూడలకు ఇచ్చినట్లైతే, వ్యాధి నిరోధక శక్తి సుమారు 3-4 సంవత్సరముల వరకు ఉంటుంది.
Also Read: Mastitis Disease in Cows: పశువులలో పొదుగు వాపు వ్యాధి ఎలా వస్తుంది.!