వ్యవసాయ పంటలు

Weeding in Wheat: గోధుమ పంటలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం.!

1
Weeding in Wheat
Weeding in Wheat

Weeding in Wheat: గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ఆహార పంట. దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్థాలు అధికంగా ఉండటం ఆరోగ్య పరంగా అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు.

నేలలు: తగిన నీటి నిలువతో పాటు అధిక గాలి ప్రసరణ, అధిక కర్బనశాతం కల బరువైన నేలలు, మురుగు నీటి వసతి గల నేలలు అనుకూలం. విత్తే ముందు నేలను నాగలితో దున్ని కల్టివేటర్, గుంటక సహాయంతో మెత్తగా చదును చేసి విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 4 నుండి 6 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 48 kg నత్రజని, 24 kg భాస్వరం మరియు 16 kg ల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువులను మూడు దఫాలుగా మొదటిది దఫా విత్తే సమయంలో, రెండవది  విత్తిన 30 రోజులకు  మూడవది దఫా 50 నుండి 55 రోజులకు వేసుకోవాలి.

జింకు లోపించిన గోధుమ పంటలో ఈనెలు పసుపు రంగులోకి మారి పెళుసుగా తయారవుతుంది.  నివారణకు 2 గ్రా., జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక litre నీటికి కలిపి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారి చేసుకోవాలి.

Wheat

Wheat

Also Read: Sharbati Wheat: ఖరీదైన షర్బతి గోధుమల గురించి తెలుసుకోండి

కలుపు నియంత్రణ మరియు అంతరకృషి: pendimethalin 30% ద్రావకం ఎకరాకు 1.0 – 1.25 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున పిచికారి చేసుకోవాలి. విత్తిన 20 నుండి  25 రోజులకు గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలను నివారించుటకు ఎకరాకు 13 గ్రా., నల్ఫోనల్ఫ్యూరాన్ or 100 గ్రా., metribuzin  పొడి మందు పిచికారి చేయాలి.

వెడల్పాటి కలుపు దఫా విత్తే మొక్కలను ఎకరాకు 500 ml, 2,4-D డైమిథైల్ ఎమైన్ సాల్ట్ 58% ఎస్ఎల్ OR 8 గ్రా., మెట్ సల్ఫ్యురాన్ మిథైల్ పిచికారి చేసి అదుపు చేయవచ్చు. గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్న ఎకరాకు 160 గ్రా., క్లాడినోఫాప్ ప్రొపాల్ 15 శాతం wp పిచికారి చేసి నివారించవచ్చు. కలుపు మందులు పిచికారి చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి.

Also Read: Irrigation in Wheat: గోధుమలో నీటి యాజమాన్యం

Leave Your Comments

Silent Heat Detection in Buffaloes: గేదెలలో మూగ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలి.!

Previous article

Mastitis Disease in Cows: పశువులలో పొదుగు వాపు వ్యాధి ఎలా వస్తుంది.!

Next article

You may also like