వ్యవసాయ పంటలు

Measuring Seed Germination: విత్తనాల్లో మొలకశాతం లెక్కించడం.! 

1
Seed Germination
Seed Germination

Measuring Seed Germination: రైతు స్థాయిలో విత్తనాల మొలక శాతాన్ని 4 పద్దతులుల్లో తెలుసుకోవచ్చు.

పేపర్ టవల్ పద్దతి:
పేపర్ టవల్ లేదా  మందపాటి బట్టను తీసుకొని బాగా తడిపి, గచ్చునేలపై  పరిచి  100 గింజలను వరుసలో అమర్చాలి. దీనిపై మరో తడి పేపర్ టవల్ పరిచి, రెండిని కలిపి చాపలా  చుట్టి చివర్లు దారంతో  చుట్టి  పాత్రలో ఏటావాలుగా పెట్టాలి. అప్పుడు అప్పుడు నీటితో తడుపుతూ ఉండాలి.ఈ పద్ధతి ద్వారా వరి, జొన్న, ప్రత్తి, పొద్దుతిరుగుడు విత్తనాలలో మొలక శాతం  పరీక్షచావచ్చు.

ట్రే పద్దతి:
లావు గింజ రకాలైన ప్రత్తి, వేరుశెనగ,, ఆముదం, మొదలైన విత్తన్నన్ని ప్లాస్టిక్ ట్రే లలో  ఇసుక పోసి చదును చేసి 100 విత్తనాలను  అంగుళం  లోతులో  ఇసుక  వరుసల్లో  వీత్తుకొని, తేమ ఉండేటట్లు నీరు చల్లుతూ  ఉండాలి.

పెట్రిడిష్ పద్ధతి:
వంగ, టమాట, మిరప, వంటి చిన్న చిన్న విత్తనాలను మొలకలు పరీక్షచవచ్చు. పెట్రిడిష్ బ్లాటింగ్ పేపరును అమర్చి నీటితో  తడపాలి.

Measuring Seed Germination

Measuring Seed Germination

Also Read: Management of Green Gram and Black Gram:పెసర, మినుము యాజమాన్య పద్ధతులు.!

గుడ్డ పద్ధతి:
మొలక కట్టసిన  100విత్తనాలను గుడ్డతో  మూట కట్టి దీనిని చిన్న ప్లేట్ లో పెట్టి అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతుల ద్వారా 5నుంచి  10 రోజులలో  మొలకశాతన్ని తెలుసుకోవచ్చు. సామాన్యగా పరీక్షకు  తీసిన శాంపిల్ లో నూటికి 98మంచి గింజలుండాలి. మొక్కజొన్నకు 90శాతం , ఇతర  ధాన్యలకు 75నుండి 80శాతం పప్పు దినుసులకు 75-85, నూనె గింజలకు  70-80శాతం , పత్తి, బెండకు 65శాతం  మొలకలు  రావాలి.

ఇథిలీన్ తో  పండ్లను మాగబెటడం:
పండ్ల వ్యాపారుల కలీష్యo కార్బీడ్ వంటి నిషేదిత  రసాయనాలను  వాడి కృత్రిమ  పద్ధతి ల్లో పక్వానికి రాని కాయలను  మగ్గ బెడతారు. వీటి రంగు  అక్షర్షణీయం గా ఉన్న రుచి అనేది తక్కువ గా ఉండి త్వరగా పాడైపోతాయి. దీనికి బదులు గా ఇథిలీన్ వాయువుతో  పండ్లను మగవేస్తే  అవి మృధువుగా , తియ్యగా ఉంటాయి. సాధారణo గా మామిడి, అరటి, బొప్పాయి, సీతఫలం, ఆపిల్, దానిమ్మ, వంటి  పండ్లను పరి పక్వాత కు వచ్చాక కోసి మాగవేసినప్పుడు వాటి నుంచి సహాజంగా విడుదల అయ్యే ఇథలీన్ వాయువుతో  నెమ్మదిగా పండుతాయి.

దీనికి బదులుగా కోసిన మామిడి, బత్తాయి, అరటి, సీతాఫలం, బొప్పాయి, వంటి పండ్లను  కృత్రిమంగా  ఇథిలీన్ వాయువు కు గురి చేసి  సహజ పద్ధతిలో మాగచేయవచ్చు.100పి. పి. ఎం ఇథిలీన్ వాయువు గల వాతావరణం లో మామిడి కాయల్ని 24 గంటలు , అరటి కాయల్ని 18గంటలు, బొప్పాయి నీ 15 గంటల పాటు ఉంచి తర్వాత గది ఉష్టనోగ్రత్త వద్ద మామిడి 5 రోజులలో అరటి  4 రోజుల్లో మగబెట్టవచ్చు. అలాగే ఇవి రుచి గా ఉంటాయి. పండ్లు త్వరగా  పాడైపోవు. వీటికి తగిన జాగ్రత్తలు తీసుకొని మంచిగా  మగబెడితే సరిపోతుంది. మనకి కూడా ఆరోగ్యం గా ఉంటాం.

Also Read: Redgram Cultivation: కంది సాగు.!

Leave Your Comments

Management of Green Gram and Black Gram:పెసర, మినుము యాజమాన్య పద్ధతులు.!

Previous article

Backyard Gardening: పెరటి తోటల పెంపకం.!

Next article

You may also like