Management of Green Gram and Black Gram: అపరాలు మన శరీరానికి కావలసిన మాంసకృతులను, ఖనిజా లావణలు అoదిస్తాయి.మినుము, పెసర, పైర్లను ఏక పంటగానే కాకుండా ప్రత్తి కంది, ఆముదము, పైర్లతో అంతర పంటలను మరియు పంట మార్పిడి పంటలగను పడించడం వలన భూసరాన్ని పరిరక్షిచవచ్చు.
నేల తయారీ, ఎరువుల వాడకం
మరుగునీరు నిలవని, తేమను నిలుపుకోగల చౌడు లేని భూములు అనుకూలం. వేసవి దుక్కులు చేసుకొని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని మెత్తగా దున్నీ పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ప్రతి రెండు నుండి మూడు మీటర్ల మధ్య లో ఒక లోతేనా నాగలి చాలు ఏర్పాటు చేసుకున్నట్లు అయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటకు పంపడానికి వీలు అవుతుంది.
విత్తే సమయం
జూన్ 15 నుండి జులై 15వరకు ఆలస్యం గా విత్తినట్లు అయితే దిగుబడి తగ్గిపోతుంది.
విత్తన మోతాదు
మినుము 8-10కిలో / ఎకరాకు , పెసర 6-8కిలో /ఎకరాకు
Also Read: Redgram Cultivation: కంది సాగు.!
విత్తన శుద్ది
విత్తడానికి 24-48 గంటల ముందుగా ఒక కిలో విత్తనానికి 5గ్రా. థాయోమిద్దక్సిన్ 70 డబ్ల్యూ లేదా ఇమిడాక్లోప్రిడ్ 600 గ్రా కలిపి విత్తన శుద్ధి చేసినతర్వాత థైరామ్ లేదా కాప్టెన్ మందును కలిపి తొలిదశలో ఆశిoచ్చు రసం పీల్చు పురుగులు, చిత్త పురుగులు, మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా దాని తర్వాత వ్యాపించే వైరస్ తెగుళ్ల ను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు ఒక గంట ముందుగా ఎకరానికి 200-400గ్రా రైజోబీయం, పి. ఎస్. బి కల్చరల్ ను పట్టించి విత్తుకోవాలి.
విత్తడం
సాధారణం గా పైన సిఫార్సు చేసిన మోతదు లో విత్తన్నన్ని గొర్రు సళ్లలో విత్తినట్లు అయితే సమారుగా చమికి 33మొక్కల చొప్పున మొక్కల సంద్రత ఉంటుంది. అంతర సేద్యం చేసుకోవడానికి అనుకూలం గా ఉంటుంది. మొక్కల సంద్రత తగ్గితే కలుపు సమస్య, పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు, తెగుళ్ల సమస్య అధికం అవుతాయి.
కలుపు యాజమాన్యం
మెట్ట సాగులో మినుము, పెసర పైర్లు సాగు చేయునప్పుడు పైరును 30రోజుల వరకు కలుపు భారీ నుండి తప్పిచుకోవాలి. అంతర కృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిల్లో తేమను కూడా నిలుపుకావడానికి సహాయ పడుతుంది.విత్తిన వెంటనే పెండిమిథలిన్ అను కలుపు మందు ను పిచికారీ చెయ్యాలి. గడ్డి మరియు వెడల్పాకు కలుపు జాతి మొక్కలకు ఇమెజితఫైర్ 10% కలిపి పిచికారీ చేసి కలుపు ను నివారణ చేయవచ్చు.
నీటి యాజమాన్యం
మినుము, పెసర వర్షాధారపు పంటలు నీటి వసతి ఉన్న చోట ఒకటి లేక రెండు తేలిక పాటి నీటితడులను పెట్టినట్లు అయితే అధిక దిగుబడులు సాధిచవచ్చు. మొదటి తడి మొగ్గ దశలో , రెండొవ తడి పెందే ఏర్పడిన తర్వాత ఇవ్వాలి. నీటి తడి ఇవ్వలేని పరిస్థితులల్లో 2.0 % పొటషియం నైట్రేట్ వారం నుండి 10రోజుల లోపు రెండు సార్లు పిచికారీ చెయ్యాలి. ఇలా చేసినట్టులు అయితే మంచి దిగుబడులను సాదించవచ్చు.
Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో మెళుకువలు.!