Citrus Gummosis: ఈ తెగులును బ్రాస్ రాట్, గమ్మోసిస్, బ్రౌస్ కార్క్, ట్రంక్ రాట్ మరియు ఫుట్ రాట్ అనే పేర్లతో పిలుస్తారు. కారకం: ఈ తెగులు ఫైటోఫ్తరా పామివోరా మరియు డిఫ్లోడియా నటలెన్సిస్ అను శిలీంధ్రాల వలన కలుగుతుంది.
లక్షణాలు:
ఈ తెగులు ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. తెగులు సోకిన భాగంలో విపరీతమైన బంక కారటం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణము. ఫైటోఫ్తరా వల్ల వచ్చే బంక తెగులు చెట్టు మొదలు కింద భాగానికి పరిమితమై ఉంటుంది. డిప్లోడియా వల్ల వచ్చే బంక తెగులు చెట్టు మొదలుపై భాగాన ముఖ్యంగా కొమ్మల్లో వస్తుంది. కాండము పై తెగులు సోకినపుడు జిగురు చుక్కలు కాండం పొడవునా పగుళ్ళు ఏర్పడును మరియు తెగులు బెరడు లోపలి కొయ్య భాగాలకు కూడా వ్యాపించి నల్లగా మారుతుంది.
ఒకవేళ ఈ జిగురు నేలకు దగ్గరగా ఉన్న కాండం వద్ద కారటం వలన తెగులు తల్లి వేరుకు మరియు కాండం చుట్టూ వ్యాపిస్తుంది. ఈ దశలో బంక నేలలోనికి పీల్చుకొనుట వలన సరిగా కనిపించదు. తెగులు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వేర్లు కుళ్ళిపోయి బెరడు నల్లబడి పగిలి రాలిపోతుంది. ఈ తెగులు వలన ఆకులు రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవటం, కాయ పరిమాణం తగ్గటం జరుగుతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. మొక్క చనిపోయే ముందు పూత ఎక్కువగా పూసి, కాయల కోతకు రాకముందే మొక్క చనిపోతుంది.
Also Read: Pruning in Pomegranate: దానిమ్మ లో కొమ్మ కత్తిరింపు లతో లాభాలు.!
వాతావరణ పరిస్థితులపై ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా బరువు నేలల్లో మురుగు నీరు పోయే వసతి తక్కువగా ఉండటం, ఎక్కువ సార్లు నీటి తడులు పెట్టడం వలన, నేలను తగిలో కాండం భాగంలో నీరు ఎక్కువ నిలవటం వలన తెగులు సోకటానికి ఎక్కువ అవకాశముంటుంది. మొగ్గకు కాండం పై నేలకు దగ్గరగా అంటుకట్టడం, అంటుకట్టిన మొక్కను నేలలో చాలా లోతు వరకు నాటడం ముఖ్యంగా బడ్ పాయింటు వరకు మట్టితో కప్పడం, తల్లివేరు లేక కాండం మొదటి భాగంలో గాయం కావటం, మరియు మొక్క ఈ తెగులును కలుగజేసే శిలీంధ్రాలు నేల ద్వారా లేక నేల నుండి వర్షము చుక్కల ద్వారా, ద్వారా, నీటి తడుల ద్వారా, కాండమునకు, ఆకులకు మరియు కాయలకు వ్యాపిస్తుంది.
ఈ శిలీంద్రం బడ్ జాయింటు ద్వారాఈ తెగులుకు సుగ్రాహతగా ఉండటం ఇటువంటి పరిస్థితులలో తెగులు సులభంగా సోకుతుంది. లేక మొక్కల పైన గాయాల ద్వారా చెట్టులోనికి ప్రవేశింస్తుంది.
నివారణ:
బాగా మురుగు నీరు పోయే వసతి గల భూములను నిమ్మ చెట్లను నాటుటకు ఎన్నుకోవాలి.
తెగులును నిరోధించే పేరు మూలాన్ని వాడాలి.మొగ్గ అంటును కాండం పైన నేల నుండి 30-46 సెం.మీ. పైన కట్టాలి.అంటుకట్టిన మొక్కను, అంటు భాగం నేలకు తగలకుండా నాటాలి.కాండం చుట్టూ నీరు తగలకుండా ఉండటానికి డబుల్ రింగు పద్ధతిలో నీరు పారించాలి.అవసరానికి మించి నీరు తడులు పెట్టకూడదు.సంవత్సరానికి ఒకటి లేక రెండు సార్లు కాండము పై రెండు అడుగుల ఎత్తు వరకు బోర్డపేస్టును పూతపూయాలి.
తోటలలో బంక కారుట గమనించినప్పుడు పదునైన కత్తితో బంకను, కుళ్ళిన బెరడును. ఆరోగ్యవంతమైన భాగం వచ్చే వరకు గోకివేసి 0.1 శాతం మెర్కురిక్ క్లోరైడ్ లేక 1 శాతము పొటాషియం పర్మాంగనేటుతో తడపాలి. తరువాత బోర్డపిస్టుతో పూత పూయాలి. బావిస్టిన్ 1 గ్రా మందు ఒక లీటరు నీటిలో కలిపి బంక గోకివేసిన తరువాత 10-15 రోజుల వ్యవధిలో రెండు లేక మూడు సార్లు పిచికారి -2 చేయాలి.తెగులు సోకిన చెట్టుకు 10 కిలోల వేప పిండి వేసి నీరు పెట్టి మరుసటి రోజు 20 లీటర్ల నీటిలో 100గ్రా. ట్రైకోడెర్మా విరిడి మరియు 40 గ్రా. మెటలాక్సిల్ ఎమ్.జెడ్. మందు మిశ్రమాన్ని భూమంతా తడిచేలా పోయాలి.
Also Read: Citrus Leaf Miner: నిమ్మ తోటలలో ఆకు తొలుచు మరియు బెరడు తొలుచు పురుగుల నివారణ.!