Pruning in Pomegranate: దానిమ్మ పండు చాలా పుష్టికరమైనదే కాక సేద తీర్చు లక్షణము కూడా కల్గింటుంది. దానిమ్మతో రసం, సిరప్, జెల్లి వంటివి తయారు చేయవచ్చు. తోలు పూల నుంచి రంగు పదార్థం లభిస్తుంది. ఆకులు పూలలో అనేక వైద్య గుణాలున్నాయి.
భారతదేశంలో మహారాష్ట్ర, దానిమ్మ పంట, ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమిస్తుంది. దేశంలో దానిమ్మ సాగులో 78% విస్తీర్ణము ఉత్పత్తిలో 84% మహారాష్ట్ర ఆక్రమిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, మహాబూబ్ నగర్ జిల్లాల్లో 5000 హెక్టార్లలలో సాగులో వుంది..
వాతావరణం: దానిమ్మ ఉష్ణ మండలం చెట్టు శీతాకాలం చల్లగా, ఎండాకాలం వేడిగా ఉండే మెట్ట ప్రదేశాలలో బాగా పండుతుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. కాయ ఎదిగే దశలోను, పండే దశలోను పొడిగా, వేడిగా ఉండే వాతావరణం అవసరం. ఉష్ణోగ్రత తగినంత ఎక్కువగా లేకపోతే కాయలు తీయగా ఉండవు. తేమ ఉన్న ప్రాంతాలలో కాయ నాణ్యత దెబ్బతింటుంది.
Also Read: Citrus Leaf Miner: నిమ్మ తోటలలో ఆకు తొలుచు మరియు బెరడు తొలుచు పురుగుల నివారణ.!
నేలలు: దానిమ్మ అనేక రకాలైన నేలల్లో సాగు చేయవచ్చు. మిగతా పండ్ల చెట్లను సాగుచేయలేని నేలల్లో కూడా ఈ పంట పండించువచ్చు. సున్నం శాతం ఎక్కువ గల భూముల్లోను, కొద్దిగా క్షారత అధికంగా ఉన్న భూముల్లో కూడా దానిమ్మ సాగుచేయవచ్చు. లోతైన గరప నేలలు మరియు ఓండ్రు నేలలు మిక్కిలి అనుకూలం.
ప్రవర్థనం: ఎక్కువగా కత్తిరింపుల ద్వారాను (Cuttinge) నేల అంట్లు (Groendlayers) గాలి అంట్లు Airlayers ద్వారా వ్యాప్తి చేస్తారు. పెన్సిల్ మందమున్న కొమ్మలని 25-30 సెం. మీల పొడవుతో కత్తిరించి నాటాలి. నాటేముందు సెడెక్స్- బి లేదా 100 PPM ల LAA హార్మోన్లో ముంచి నాటితే కొమ్మలకు బాగా పేర్లు ఏర్పడును. 90 రోజులలో మొక్కలు పొలంలో నాటడానికి తయారవుతాయి.
నాటుటకు 60 ఘ. సెంల గుంతలు త్రవ్వి 5×5 మీటర్ల ఎడంలో నాటాలి. 20 కేజీల FYM, 100 గ్రాముల లిండెన్ 500 గ్రాముల SSP కల్పి గోతిని నింపాలి. జూన్-జూలై మాసంలో నాటుట మంచిది.
కొమ్మ కత్తిరింపు (Prumming): దానిమ్మలో కత్తిరింపులు మొదటి దశలో రెట్టు మంచి ఆకారాన్ని సంతరించు కోవడానికి చేస్తారు. దానిమ్మ పొదలా పెరిగే స్వభావం కల్గింటుంది. అందువలన భూమట్టం నుంచి అనేక సంఖ్యలో కొమ్మలు వస్తాయి. అన్ని కొమ్మలని వదిలేస్తే గాలి చొరబడకుండా గుబురుగా పెరిగి కాండం తొలిచే పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బలంగా ఉన్నా 3-4 కాండాలను మాత్రమే వుంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి. ఒక వేళ భూమి నుండి ఒకే భూమట్టం నుండి 1-11/2 అడుగుల ఎత్తుతో వచ్చే కొమ్మల్లో నాలుగు వైపులా విస్తరిస్తున్న 3-5, బలమైన ప్రధాన కొమ్మల్ని ఉంచి మిగతా వాటిని కత్తిరించి వేయాలి.
కత్తిరించిన భాగాలకి వెంటనే ఒక శాతం బోర్డ్పెస్ట్ రాయాలి. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లలో అడ్డదిడ్డంగా పెరుగుతున్న బొమ్మలను, రెమ్మలను నిట్టనిలువుగా పెరిగే నీటి పిలకలను, ఎండిన కొమ్మలను తెగులు సోకిన కొమ్మలను తీసి వేయడం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. విశ్రాంతి నిచ్చే సమయంలో చెట్లలోని చివరి కొమ్మలను 6-9 అంగుళాల పొడవున్న చివర కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల బలమైన కొమ్మల మీద పిందెలు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది.
Also Read: Medicinal Plant: సుగంధ తైల మొక్కల ప్రాముఖ్యత.!