ఆరోగ్యం / జీవన విధానంమన వ్యవసాయం

Nela Vemu Cultivation: నేలవేము సాగులో మెళుకువలు.!

2
Nela Vemu
Nela Vemu

Nela Vemu Cultivation: దీనిని కాలేయ వ్యాధులకు, ఉదర రోగాలు మరియు అనేక రకాల జ్వరాల నివారణలో ఉపయోగిస్తారు. మొక్కలోని అన్ని భాగాలలో అండ్రోగ్రా ఫోలైడ్ అనే రసాయనం ఉంటుంది.

నేలలు: మొక్క అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. ఇసుక గరప నేలలు అత్యంత అనుకూలం.

వాతావరణం: అన్ని రకాల వాతవరణాల్లోను పెరుగుతుంది. చల్లని వాతావరణం, సంవత్సరమంతా వ్యాపించి కురిసే వర్శపాతం అత్యంత అనుకూలం. ఇది 40-45° సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది.

విత్తేసమయం: జూన్ నెలలో నాటేందుకు అనుకూలం. వర్షాధారంగా సాగుచేయవచ్చు.

Nela Vemu Cultivation

Nela Vemu Cultivation

Also Read: Mixed Vegetables Cultivation: మిశ్రమ కూరగాయల సాగు.!

ప్రవర్థనం: విత్తనం ద్వారా వ్యాప్తి చేస్తారు.

విత్తనమోతాదు: ఎకరాకు 160 గ్రాములు.

నాటే దూరం: 30×15 నెం.మీ (నేరుగా విత్తినప్పుడు) ఎకరాకు 88,000 మొక్కలు.

30×15 లేదా 20×15 సెం.మీ. (నారు నాటినప్పుడు ) ఎకరాకు 88,000-1,33,000 మొక్కలు.

నారుమడి ద్వారా సాగు చేస్తే మే-జూన్ మాసాలలో ఎత్తైన మడులలో విత్తాలి. 40-45 రోజుల వయస్సు కలిగి 8-10 సెం.మీ. ఎత్తు కలిగిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ వేసుకోవాలి. విత్తిన/నాటిన 30 రోజుల తర్వాత మరొక దఫా నత్రజని వేయాలి.

అంతర కృషి: తొలిదశలో 3-4 రోజుల కొకసారి తరువాత దశలో 10 రోజుల కొకసారి వీరివ్వాలి. నాటిన నెల రోజుల కొకసారి మరియు 60 రోజుల కొకసారి కలుపు తీయాలి.

సస్యరక్షణ: ప్రమాదకరమైన చీడపీడలేమి ఆశించవు.

కోత: మొదటి కోత నాటిన 90-120 రోజులకు వస్తుంది. భూమి నుండి 10-15 సెం.మీ. ఎత్తులో మొక్కలను కత్తిరించి వేయాలి. మళ్ళి నత్రజని వేసి నీరిస్తే 60 రోజుల్లో రెండవ కోతకు వస్తుంది. మొత్తం మీద సంవత్సరానికి 2-3 కోతలు తీసుకోవచ్చు. కోసిన తర్వాత 3-4 రోజులు నీడలో ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.

దిగిబడి: ఎకరాకు 0.8-1 టన్నులు (ఎండబెట్టిన తర్వాత).

ఆదాయ వ్యయాలు: ఎకరానికి సుమారు రూ.3,500 ఖర్చు, రూ.8,000–10,000 మొత్తం ఆదాయం, తద్వారా రూ.5000–7,000 నికరాదాయం లభిస్తుంది.

ఉపయోగాలు: మన రాష్ట్రంలో అతి ప్రాచీన కాలమునుండి దేశీయ వైద్యులు నేలవేమును, మలేరియాలోను ఆజీర్ణం, ప్రేగులకు సంబంధించిన వ్యాధులలో వాడుతున్నారు. దీనిని గృహవైద్యంగా కషాయమ్, చూర్ణములను చేసుకొని జ్వరాలలో వాడేవారు.

Also Read: Beekeeping: తేనెటీగల పెంపకం.!

Leave Your Comments

Paddy Cultivation: వరి ప్రధాన మడి తయారీ మరియు నాట్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Previous article

Emu Chicks Management: ఈము పెంపకంలో ఎదిగే పిల్లల యాజమాన్యం.!

Next article

You may also like