Fertilizer and Water Management for Citrus Orchards: చీనీ, నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యము చాలా కీలకమైoది. పోషణ సరిగా లేనిచో చీడపీడలు అధికంగా ఆకర్షింప పడతాయి. సాధారణంగా 30 నుండి 40 సం.లు మంచి దిగుబడిని ఇవ్వాల్సిన చెట్లు సరైన పోషణ లేకపోతే 10 సం.ల లోపే క్షీణించి పోతాయి.
ఎరువుల మోతాదు: మొక్క యొక్క వయస్సు సౌత్రుడి, బత్తాయి నిమ్మ, నారింజ, పంపరపనస (తీపి రకాలకు) పుల్లరకాలకు నత్రజని ఎరువును 25 % పశువుల ఎరువు రూపంలోనూ 25 % పిండి ఎరువు (వేప, ఆముదం) రూపంలోనూ, మిగిలిన 50 % రసాయనిక ఎరువు రూపంలోనూ రెండుసార్లు అనగా మొదటి సారి డిసెంబరు-జనవరి మాసాల్లో రెండవ సారి జూన్-జూలై మాసాల్లో వేయాలి.
Also Read: Citrus Crop Protection: నిమ్మలో సీతాకోక చిలుక మరియు చెదలు పురుగు నివారణ చర్యలు.!
- భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలోనూ, పొటాష్ ఎరువును, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ రెండు దఫాలుగా సమపాళ్లలో వేయాలి.
- ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మరుతుంది.
- పూత వదిలేముందు చెట్లను ఎండ పెట్టి ఎరువులు వేసి పుష్కలంగా నీరు పెట్టాలి.
- సేంద్రియ ఎరువులను వాడటం వలన భూమిలో సత్తువ, తేమను వాడటం వలన భూమిలో సత్తువ, తేమను నిల్వ వుంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి.
- ఎరువులను చెట్ల పాదులలో ట్రెంచ్ పద్ధతిలో వేస్తారు. చెట్టు చుట్టూ 1 మీటరు దూరంలో 15 నుండి20 సెం.మీల వెడల్పు 15 సెం.మీటర్ల లోతులో కందకం త్రవ్వి ఎరువులు వేసి కప్పుతారు.
- లేత మొక్కలు సంవత్సరానికి 4 నుండి 5 సార్లు చిగురిస్తాయి. కావున ఈ సమయంలో పల్లాకు వ్యాధి నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 5 గ్రా.,+మాంగనీస్ సల్ఫేట్ 2గ్రా.,+మెగ్నీషియం సల్ఫేట్ 2గ్రా.,+ఫెర్రస్ సల్ఫేట్ 2గ్రాములు+బోరాక్స్ 1గ్రా.,+సున్నం 6 గ్రా.,+యూరియా 10 గ్రాములు మిశ్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు (జూన్, జూలై, జనవరి మరియు ఫిబ్రవరి) పిచికారి చేయాలి. లేత ఆకుల మీద పిందెలు బఠాణీ పరిమాణంలో ఉన్నపుడు పిచికారీ చేయ వలెను.
నీటి యాజమాన్యం: సకాలంలో సాగునీటి సరఫరా లేకుంటే సిట్రస్ చెట్లు పెరుగక కాపు తక్కువగా వుంటుంది. నీటి పారుదల సరిగా లేకుంటే పండు పరిమాణం, నాణ్యత తగ్గి రాలిపోతుంది. కావునా ప్రత్యేకించి కాపు దశలోను పొడి కాలంలో తగినంత నీటి సరఫరా అవసరం ఉంటుంది .
Also Read: Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!
- చిన్న మొక్కలకు ఎండాకాలంలో తరచుగా నీరు కట్ట వలెను.
- చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్ల వయస్సు, పైన ఆధారపడి ఉంటుంది.
- చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు పెట్ట వలెను.
- నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో వరిపొట్టు, వేరుశనగ పొట్టు 8 సెం. మందులో వేసి తేమ ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు.
- ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్ట వలెను.
- డబుల్ రింగ్ పద్ధతిలో నీరు పెట్టడం మంచిది.
అంతర కృషి, అంతర పంటలు: కాపు రాక ముందు 2 నుండి 3 సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు, బంతి, ఉల్లి, పుచ్చ వేయవచ్చు. మిరప, టమాట, పొగాకు పైర్లను వేయకూడదు. ఈ పైర్లు వేయటం వలన నులిపురుగుల బెడద ఎక్కువ అవుతుంది. వర్షకాలంలో జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదు భూమిలో వేసి కలియ పెట్టి దున్నాలి.
పాదులు గట్టి పడకుండా అప్పుడప్పుడు తవ్వ వలెను. పాదులు తవ్వేటపుడు ఎరువులు వేసేటపుడు వేర్లు ఎక్కువగా తెగకుండా తేలికపాటి సేద్యం చేయ వలెను. చెట్టు కొమ్మలపై పడకుండా మొదలుకు అడుగు దూరం కలుపు మందులు పిచికారీ చేయ వలెను. పెరిగిన గెరిక, తుంగ నివారణకు గ్లైఫోసేట్ 8 మి.లీ లీటరు నీటిలో కలిపి వాడాలి.
Also Read: Lemon Water: శరీరంలో అనేక రోగాలకు ఒక గ్లాస్ లెమన్ వాటర్