పశుపోషణమన వ్యవసాయం

Record Keeping in Poultry: కోళ్ళ ఫారాలలో రికార్డుల నిర్వహణ.!

0
Record Keeping in Poultry
Record Keeping in Poultry

Record Keeping in Poultry: రికార్డులు నిర్వహణ అనేది కోళ్ళ ఫారాలలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సహజంగా ఒక ఫారం యొక్క రికార్డులను రెండు విధాలుగా వర్గీకరించవచ్చు.

1) ప్రొడక్షన్ లేదా టెక్నికల్ రికార్డులు (Production / Technical Records)
2) ఫైనాన్షియల్ లేదా బేసిక్ రికార్డులు (Financial / basic Records)

Record Keeping in Poultry

Record Keeping in Poultry

Also Read: Poultry Feeding: కోళ్ళ మేతలోని పోషక పదార్థాల ఉపయోగాలు.!

1) ప్రొడక్షన్ లేదా టెక్నికల్ రికార్డులు (Production / Technical records): – ఇందులో ముఖ్యమైనవి.

అ) లేయర్ ఫారమ్ రిజిస్టర్: ప్రతి ఒక బ్యాచ్కి, వాటి యొక్క ఉత్పత్తిని రికార్డ్ చేయాలి. ఈ విషయాలు ఒకటవ రోజు నుండి చివరి రోజు వరకు నమోదు చేయాలి.

ఆ) ఎగ్ ప్రొడక్షన్ రిజిస్టర్: ఒక ఫారంలోని అన్ని బ్యాచ్ కోళ్ళ యొక్క గ్రుడ్లు ఉత్పాదన ఇందులో నమోదు చేయాలి.

ఇ) బ్రాయిలర్ ఫారమ్ రిజిస్టర్: ఇందులో, ప్రతి బ్యాచ్ యొక్క ఉత్పాదన నమోదు చేయాలి. ఇందులో నమోదు చేయవలసిన విషయాలు:

a) బ్యాచ్ నెంబరు
b) కోడి పిల్లలను తెచ్చు ప్రదేశం
c) కోడి పిల్లల సంఖ్య
d) ప్రతి రోజు మరణాల సంఖ్య
e) ఇచ్చిన దాణా వివరాలు
f) 6 వారాల వయస్సులో అమ్మిన కోళ్ళ సంఖ్య
g) 6 వారాల వయస్సులో శరీర బరువు
h) ఫీడ్ కన్వర్షన్ రేషన్ (FCR)
i) బ్రీడర్ ఫారమ్ రికార్డులు

రికార్డ్ లేయర్ ఫారమ్ రికార్డ్ మాదిరిగానే ఉంటుంది. అదనంగా పొదగబడే గ్రుడ్ల యొక్క సంఖ్యను నమోదు చేయాలి..

Also Read: Poultry Feeding: కోళ్ళ మేతలో పాటించవలసిన నియమాలు.!

హ్యాచింగ్ రికార్డులు: ఇది ఎగ్ ప్రొడక్షన్ రిజిస్టర్ లాగానే ప్రతి బ్యాచ్ను నమోదు చేయాలి. అదనంగా Date, Opening balance of eggs, receipts, number of egg settings, discarded, sales number of chicks produced, chicks sold, chicks died (discarded) నమోదు చేయాలి.

క్రెడర్ ఫారమ్ రికార్డులు: ఈ రికార్డ్ లేయర్ ఫారమ్ రికార్డ్ మాదిరిగానే ఉంటుంది. అదనంగా పొదగబడే గ్రుడ్ల యొక్క సంఖ్యను నమోదు చేయాలి..

హ్యాచింగ్ రికార్డులు: ఇది ఎగ్ ప్రొడక్షన్ రిజిస్టర్ లాగానే ప్రతి బ్యాచ్ను నమోదు చేయాలి. అదనంగా Date, Opening balance of eggs, reccipts, number of egg settings, discarded, sales number of chicks produced, chicks sold, chicks died (discarded) నమోదు చేయాలి.

మోర్టాలిటీ రికార్డులు: ఇందులో తేదీ, ఎన్ని పక్షులు మరణించాయి. మరణానికి గల కారణాన్ని నమోదు చేయాలి.

వ్యాక్సినేషన్ రికార్డులు: ఇందులో బ్యాచ్ల వారిగా టీకాలు ఎప్పుడు చేయాలి అనేది నమోదు చేయాలి.

ఇంక్యుటేషన్ రికార్డులు: ఇందులో Date of setting eggs, Number of egg set, date of transfer to hatcher, number of chicks produced candling date నమోదు చేయాలి.

దిక్స్ అవుట్ టర్మ్ మరియు డిస్పోజల్ రిజిస్టర్: ఇందులో Date, number of chicks produced, number of chicks sold, closing balance, time of dispatch of chicks అనే వివరాలు నమోదు చేయాలి.

2) ఫైనాన్షియల్ లేదా బేసిక్ రికార్డులు (Financial / basic Records):-

అ) అటెండెన్స్ మరియు డైలీ వేజ్ రిజిస్టర్: ఇందులో రోజువారి ఉద్యోగుల హాజరు మరియు వేతనము యొక్క వివరాలు ఉంటాయి.

ఆ) బిల్డింగ్ రిజిస్టర్: ఇందులో ఫారమ్ భవనాలు నమోనా, వాటి యొక్క కట్టడ వివరాలు. జరుగుతున్న ఇతర నిర్మాణ పనులు వివరాలు ఉంటాయి.

ఇ) ఎక్విప్మెంట్ రిజిస్టర్: ఇందులో ఫారంలో ఉన్న పరికరాల వివరాలు ఉంటాయి.

ఈ) ఫీడ్ మరియు ఫీడ్ ఇన్ గ్రేడియంట్ రిజిస్టర్: ఇందులో దాణా ఖర్చులు, దాణా ముడి సరుకు యొక్క ఖరీదు. వాటి వివరాలు ఉంటాయి.

ఉ) ఫీడ్ అడిటివ్స్ మరియు మెడిసిన్స్ రిజిస్టర్: ఇందులో దాణాలో కలిపే మందులు, అడిటివ్స్, వ్యాక్సిన్స్, రసాయనాల వివరాలు ఉంటాయి.

Also Read: Poultry farming: కోడి పిల్లల పెంపకం లో మెళుకువలు

Leave Your Comments

Grape Cultivation: ద్రాక్ష సాగులో మెళుకువలు.!

Previous article

Fertilizer and Water Management for Citrus Orchards: చీనీ, నిమ్మ తోటల్లో ఎరువులు మరియు నీటి యాజమాన్యం.!

Next article

You may also like