Coconut Planting: భారతదేశంలో పండించే వాణిజ్య పరమైన పంటలలో కొబ్బరి ముఖ్యమైనది. దీనిని కేరళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో విరివిగా సాగు చేస్తున్నారు. దేశంలోని 54% విస్తీర్ణం మరియు 42% ఉత్పత్తి ఒక్క కేరళలోనే ఉన్నది. ఉత్పాదకతలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో వుంది.
మన రాష్ట్రంలో కొబ్బరి లక్ష హెక్టార్లలలో సాగుచేయబడుతూ సాలీనా 1000 మిలియన్ కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదకత ఎకరాకు 4 వేల కాయలు నెల్లూరు, క్రిష్ణ, గుంటూర్, గోదావరి జిల్లాలు విజయవాడ, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలు సాగుకు అనుకూలమైనవి. కొబ్బరిలో ప్రతి భాగం ఉపయోగకరమైనది. వ్యాపార రీత్యా కొబ్బరి నూనె, ఎండుకొబ్బరి మరియు పీచు ముఖ్యమైనది. చెట్టు కాండాలను వంట చెరుకు మరియు కలపగా ఉపయోగిస్తారు. కావున కొబ్బరిని కల్పవృక్షం అందురు.
నారు పెంచుట: కొబ్బరిని విత్తన పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. పరపరాగ సంపర్కం జాతి అగుటచే తల్లి చెట్టు ఎన్నికలో చాలా శ్రద్ధ వహించాలి.. తల్లి మొక్కలను ఎన్నుకొనేటప్పుడు క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నుకోవాలి.
- మొక్క వయస్సు 25-50 సంవత్సరాల వరకు ఉండాలి.
పెరిగిన 30-40 ఆకులను కల్గి ఉండాలి. - చెట్టు తల భాగం (crown) గోళాకారంగా ఉండాలి. నిటారుగా ఉండకూడదు.
- సుమారు 100 కాయల దిగుబడిగా యిచ్చే మొక్కలను ఎన్నుకోవాలి.
- ఇంటి దగ్గరలో పశువుల షెడ్డుకు మరియు ఎరువు దిబ్బలకు దగ్గరలో పెరిగే మొక్కలను ఎన్నుకోరాదు.
- చీడ పీడలు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలు ఎన్నుకోవాలి. పై విధంగా ఎన్నుకొన్న తల్లి మొక్క నుండి బాగా పరిపక్వం చెందిన (11-12 నెలలు) కాయలను కొట్టి ఒక నెల
- నీడలో నిలువ చేయాలి. తర్వాత అనువైన మడులను కట్టి విత్తనపు కాయలను 30×30 సెం.మీటర్ల దూరంలో అడ్డంగా వరుసల్లో నాటి మట్టి…
మొక్కల ఎంపిక:
- ముందుగా మొలక వచ్చే మొక్కలకు ఎన్నుకోవాలి.
- ఆకుల నుండి ఈనెలు త్వరగా విడిపడే లక్షణమున్న మొక్కలను ఎన్నుకోవాలి. ఒక సంవత్సరం వయసు గల ఆరోగ్య వంతమైన మొక్కలను ఎన్నుకోవాలి. తాటి పాక లేదా గానోడెర్మా, తెగులు సోకిన మొక్కలను ఎంచుకోరాదు.
- మొక్కలు నాటుట: నేల పరిస్థితులను బట్టి, ఒక ఘనపు మీటరు లోతు గల గుంతలను తీయాలి. తీసిన మట్టిలో FYM మరియు 200 గ్రాముల SSP కల్పి గోతులను నింపాలి. సూది మొక్కలను (Nursery Plants) గొయ్యి మధ్యలో నాటి, చుట్టూ మట్టి తొక్కి నీరు పెట్టాలి.
- మొక్కలలోనికి మట్టిగాని, నీరుగాని పోకుండా జాగ్రత్తపడాలి. పొడవు మరియు హైబ్రిడ్ రకాలను 8×8 మీటర్ల దూరంలో పొట్టి రకాలను 7.5×7.5 మీటర్ల దూరంలో నాటాలి.
Also Read: Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె, అక్షింతల పురుగుల యాజమాన్యం.!