Livestock Transport: అధిక దిగుబడి గల పాడి పశువులను అవసరమున్న ప్రదేశానికి ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకెళ్ళవలసి యుంటుంది. ఇది ఒక దేశం నుండి మరొక దేశంకు కాని లేదా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రంకు కాని లేదా ఒక ప్రాంతంలోని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి రవాణా చేయవలసి యుంటుంది.
Also Read: Ongole Cattle: పాడికి మరియు పనికి ఉపయోగపడు దేశవాళీ ఆవులు.!
పశువులను రవాణా చేయునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు-
1. ఎద్దులను మిగతా పశువులతో కలిపి రవాణా చేయునప్పుడు వాటిని జాగ్రత్తగా కట్టి వేయాలి.
2. దూడలు, గొర్రెలను, మేకలను మరియు పెద్ద పశువులతో పాటు కలిపి రవాణా చేయకూడదు.
3. ప్రయాణ సమయము గొర్రెలకు 36 గంటలు, పశువులు మరియు పందులకు 27 గంటలు దాటినచో వాటికి మార్గ మధ్యములో నీరు సమకూర్చాలి
4. పందులు అధిక వేడిని తట్టుకోలేవు కావున వాటిని రవాణా చేయునప్పుడు నేలపై ఒక అంగుళము మందంలో తడి ఇసుకను పోయాలి.
జంతువులను ఒక చోటు నుండి వేరొక చోటుకి తరలించునప్పుడు కొన్ని నియమాలు పాటించ వలసి యుంటంది. లేని యెడల ప్రివెన్షన్ క్రూయాలిటి యాక్ట్ 1960 ప్రకారం శిక్షార్హులు.
అ) అర్హులైన పశువైద్యుని రవాణా చేయబడుచున్న జంతువు ఆరోగ్యము రవాణాకు అనుకూలంగా ఉన్నవని, ఏ వ్యాధులు లేవని, అవసరమైన టీకాలు వేయబడినదని ధృవపత్రము పొందాలి.
ఆ) పశు వైద్య ప్రథమ చికిత్స పెట్టే వెంట వుంచాలి.
ఇ) జంతువుల వివరణ, పంపించు వారు, చేరవలసిన చిరునామా, ఎన్ని పశువులు రవాణా చేయుచున్నది. తదితర వివరములు తప్పనిసరిగా వ్రాయవలేను. దీనినే వే బిల్ల్ అని అంటారు. ఈ జంతువుల మేత, నీరు తీసుకోవలసినంత తీసుకున్న తరువాతనే ప్రయాణం చేయాలి.
కాలి నడక ద్వారా పశువులను రవాణా చేయనప్పుడు:- 40 కిలో మీటర్లు లోపు పశువులను ఈ మార్గం ద్వారా తీసుకెళ్ళవచ్చును. ఒక ఊరి నుండి మరొక ఊరికి కాలి నడకన తీసుకొని వెళ్ళవచ్చును. ఈ మార్గం ద్వారా పోతున్నప్పుడు పాడి పశువులకు అవసరమైన విశ్రాంతిని, మేతను మరియు నీటిని నడకన ఏ విధమైన సమస్యలు చేయ వచ్చును.
ఈ పధ్ధతి వలన కలుగు లాభాలు:- కాలి నడక ద్వారా పశువులను రవాణా చేయడం వలన పశువులు యజమానులకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఈ మార్గం తక్కువ పశువులకు రవాణా చేయుటకు అనుకూలంగా ఉంటుంది.
ఈ పద్ధతి ద్వారా కలుగు నష్టాలు:-
1. కాలి నడక ద్వారా మనం పశవులను తీసుకేళ్ళుతున్నప్పుడు మనం వాటిని అదుపు చేయలేము. ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల ద్వారా పోతున్నప్పుడు యాక్సిడెంట్స్ వంటివి కలగవచ్చును.
2. రోడ్డు రవాణా మార్గం ద్వారా పశువులను రవాణా చేయుట ఈ పద్ధతి ద్వారా సులభంగా, ఎక్కువ దూరం రవాణా చేయవచ్చును. ఈ మార్గం ద్వారా పశువులను రవాణా చేయునప్పుడు పశువులకు కనీస సౌకర్యాలను రవాణా చేయు వాహనంలో సమకూర్చాలి. పశువులను రవాణా చేయు వాహనం పశువులను ఎక్కించుటకు మరియు దించుకొనుటకు అనుకూలంగా ఉండాలి. వాహనంలో కొద్దిగా గడ్డిని బెడ్డింగ్ వలె వేయవలేను.
పశువులను వాహనంలోకి ఎక్కించిన తరువాత అవి బయటకు దూకుటకు వీలు లేకుండా కట్టెలు కానీ, వెదురు వాసములు గాని, ‘సరీ బాదులు గాని కట్టవలెను. వాహనంలో నేల జారుడుగా వుండకూడదు. లారీలలో పశువులను ఎక్కించేటప్పుడు ముందుగా మగ పశువులను, తరువాత ఆడ పశువులను, తర్వాత దూడలను ఎక్కించవలెను. పశువులను ఇరుకుగా కట్టివేయరాదు. పశువులకు సరిపడినంత స్థలం ఉండాలి. పశువులను రోజుకు 800-800 కిలో మీటర్లు మించి ప్రయాణం చేయించకూడదు. మార్గ మధ్యలో పశువులకు కావలసిన నీరు, దాణా, ప్రథమ చికిత్స ఔషధములను, టార్చిలైట్, కత్తి వంటివి మరియు ఇద్దరు సహాయకులు ఉండవలెను.
3. రైలు మార్గం ద్వారా ప్రయాణం చేయించుట :- దూరం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో జంతువులను సురక్షితంగా రవాణా చేయవచ్చును.
ప్రయాణించవలసిన దూరం పెరిగిన కొలదీ పశువులకు కావలసిన స్థలం కూడా పెంచడం మంచిది. ప్రయాణించవలసిన కాలం 36 గంటలు దాటినట్లైతే ప్రతి 28 గంటలకు ఒక సారి పశువులను క్రిందకు దింపి విశ్రాతిని ఇవ్వాలి. రైలు బోగీ జారుడు గుణం కలిగి యుండకూడదు. ఒకొక్క బోగిలో 6 జంతువుల కన్నా ఎక్కువ ఎక్కించరాదు. ప్రతి ఒక బోగీకి ఒక సహాయకుని ఉంచాలి. జంతువులు ఉన్న బోగీలో వేరే ఇతర వస్తువులు ఏమి వేయరాదు. కావలసినంత దాణా, నీరు సమకూర్చుకోవాలి.
4. సముద్రం మరియు విమానయాన మార్గముల ద్వారా పశువులను ఒక దేశం నుండి మరొక దేశానికి రవాణా చేయుటకు ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. ఈ పద్ధతిలో రవాణా చేయునప్పుడు యానిమల్ ఎక్స్ పోర్ట్ మరియు ఇంపోర్టు రూల్స్ కి అనుగుణంగా చేయవలసి యుంటుంది.
Also Read: Cattle Breeds: దేశవాళీ జాతి ఆవుల రకాలు మరియు పాల సామర్ధ్యం