Mixed Vegetables Cultivation: చాలా రకాల కూరగాయలని ఓకే ప్రదేశంలో కలిపి సాగు చేయడాన్ని మిశ్రమ కూరగాయల సాగు అంటారు.
మిశ్రమ కూరగాయల సాగు ఎందుకు?
-
- చీడపీడల ఉధృతి తక్కువ
- కలుపు తక్కువ
- నీటి తడులు తక్కువ అవసరం అవుతాయి.
- ఒకే స్థలం నుంచి చాలా రకాల కూరగాయలు సాగు చేయవచ్చు.
- తోటలో చిన్న స్థలం కూడా వృధా పోదు.
- ఎక్కువ కాలం 7 నేలలు నిరంతరంగా కూరగాయలు పడించవచ్చు.
- కొన్ని కూరగాయలు ధరలు మార్కెట్ లల్లో తక్కువ ఉన్నమిగిలిన వాటికి ఎక్కువగా రేట్లు వచ్చిన నష్టాలు రాకుండా చూసుకోవచ్చు .
- తక్కువ స్థలం నుండి ఎక్కువగా కూరగాయలను పండిచవచ్చు.
- అన్ని రకాల కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. కుటుంబానికి పోషక ఆహార భద్రత చేకూరుతుంది .
Also Read: Vegetable Gardening: 30 రోజుల్లో ఇంట్లో కంటైనర్‌లో పెరిగే రుచికరమైన కూరగాయలు
సాగు పద్ధతులు:
సారవంతమైన భూమిని ఎంచుకొని 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు,2 టన్నుల వర్మీకంపోస్ట్, 6 టన్నుల పచ్చి ఆకు ఎరువులైన గ్ల్య్రిసిడియా , కానుగ వంటి ఎరువులు వేసి కలియబెట్టాలి.
కావలిసిన పరిమాణంలో చదునుగా మడులు చేసి 15సెం. మీ ఎత్తు ఉండే బోదెలు పొలం పొడవునా ఏర్పాటు చేసుకోవాలి.
మిశ్రమ కూరగాయల సాగుకు ఏం కావాలి అంటే-
వివిధ రకాలు అంటే కనీసం 20రకాల కూరగాయల విత్తనాలు
వ్యవసాయనికి కావలిసిన పని ముట్లు.
నారు నాటే పద్దతి:
క్యాబేజి, కాలిఫ్లవర్, టమాటా, మిరప, వంగ వంటివి మాములుగా ఎంత ఎండలో నాటుతారో అంత ఎండలో నాటాలి. వీటి మధ్యలో ఉల్లి, వెల్లుల్లి, ముల్లగి, క్యారెట్ వంటివి నాటవచ్చు.
విత్తనాలు విత్తే పద్ధతి:
మొదటగా పెద్ద విత్తనాలైన బఠాణి , ముల్లంగి, బీన్స్, గోరు చిక్కుడు, వంటివి సూచించిన దూరంలో నాటుకోవాలి.
చీడపీడల ఉధృతి:
వివిధ రకాల ఆకుల ఆకారాలు, ఆకుల స్వభావం, రంగులవల్ల చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఈ తోటలో ఎక్కువ కాలం పంట దిగుబడి వస్తూ భూమి ఖాళీగా ఉండడం అనేది కనపడదు.
యాజమాన్య పద్ధతులు:
అధిక సాంద్రత వల్ల కలుపు తక్కువ , నీటిని నిలుపుకునే శక్తి ఎక్కువ.
ఈ పద్దతిలో తక్కువ కాలంలో అన్నిటి కంటే ముందుగా ఆకుకూరలైన మెంతి, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, గోంగూర కోతకు వస్తాయి. తర్వాత ముల్లంగి, టమాట, మిర్చి, వంగ, చివరగా దుంప పంటలైన క్యారెట్, ఆలుగడ్డ, చేమ గడ్డ వంటివి, ఆఖరికి మునగ, అవిస వంటివి వస్తాయి. ఈ పద్ధతిలో నిరంతర కోతలు చేపట్టాలి. ఆకు కూరలని వేర్లతో పెరిగి తీయడం వల్ల మిగతా పంటలకు పెరగటానికి కావాల్సిన స్థలం ఏర్పడి వాటి నుండి మంచి దిగుబడులు వస్తాయి.
కోత దశలు:
ఒక నెలకు వచ్చేవి: మెంతి, కొత్తి మీర, ముల్లంగి, ఆకులు ఆవ ఆకులు, గొంగూర, పాల కూర, తోట కూర.
రెండు నెలలకు వచ్చేవి: ముల్లంగి, టమాట, బెండ, గోరు చిక్కుడు, వంగ
మూడు నెలలకు వచ్చేవి: క్యారేట్, ఆలుగడ్డ, ఉల్లి గడ్డ, వెల్లుల్లీ, బీర, సొర, కాకర
నాలుగు నెలలకు వచ్చేవి: వంగ, టమాట, మిరప
ఐదు నెలలకు వచ్చేవి: వంగ, టమాట, దొండ.
ఆరు నెలకు వచ్చేవి: మునగ, అవిస, కరివేపాకు వంటివి.
Also Read: Vegetable Cooler: రైతుల కూరగాయలను తాజాగా ఉంచడానికి చౌకైన కూలర్