Ongole Cattle: ఒంగోలు జాతి ఆవులు – ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో నివసిస్తుంటుంది. ఈ జాతి పశువులలో మూపురం బాగా అభివృద్ధి చెంది, మెడ పొడవు మధ్య రకంగా ఉండి మంచి కండర పుష్టితో పొడవాటి కాళ్ళు కలిగి యుంటాయి. మగ పశువులు తెలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఆడ పశువులు మల్లెపువ్వుల తెలుపు రంగులో ఉంటాయి. ఈ పశువులు అన్ని రకాల వాతావరణ పరిస్థితితులను తట్టుకోగలవు. వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి ఎద్దులు వ్యవసాయ పనులకు మరియు బరువు లాగడానికి ఉపయోగపడతాయి.
Also Read: Dairy Cattle: పాడి పశువులను ఎంపిక ఎలా చేసుకోవాలి.!
ఉత్పాదక లక్షణములు:- 4వ సంవత్సరము వయస్సులో మొదటి ఈతను ఈనుతాయి. ఈతకు ఈతకు మధ్య 2 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఆవులు ఒక పాడి కాలంలో 1200 2200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి.
ఒంగోలు జాతి ఎద్దు
రిమార్క్స్ బ్రెజిల్, అమెరికా, ఇండోనేషియా మొదలగు దేశాల వారు ఈ జాతి పశువులను దిగుమతి చేసుకొని ఆయా దేశాల పశువుల మీద ఉపయోగించి మాంసోత్పత్తి గల పశువులను అభివృద్ధి చేసుకొంటున్నారు.
డియోని (డొంగార్ పట్టి): ఈ జాతి పశువులు తెలంగాణ జిల్లాలోని మెదక్, బషీరాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఈ జాతి పశువుల నుదురు ఎత్తుగా, విశాలంగా ఉండి, బలమైన కొమ్ములు కలిగి, బయటి వైపుకు, వెనక వైపుకు తిరిగి యుంటాయి. వీటి చెవులు చాలా పొడవుగా ఉంటాయి. ఇది ఈ జాతి పశువుల లక్షణం. వీటి శరీర వర్ణం నల్లని, తెల్లని మచ్చలతోనూ లేదా తెలుపు, ఎరుపు మచ్చలతోను యుంటాయి. ఇవి ఎక్కువగా వ్యవసాయ పనులకు బరువు టాగడానికి ఉపయోగపడుతాయి. ఈ జాతి పశువులు కూడా గిర్ జాతి పశువులను పోలి యుంటాయి.
ఉత్పాదక లక్షణములు :- 3.5-4 సంవత్సరాల వయస్సులో మొదటి ఈత ఈనుతాయి. ఈతకు ఈతకు మధ్య 2 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఒక పొడి కాలంలో పాల దిగుబడి 800-1000 లీటర్లు వరకు ఉంటుంది.
హర్యానా జాతి ఆవులు: ఇవి పంజాబ్ రాష్ట్రంలో అభివృద్ధి చెంది రోతక్, హిస్సార్, గురుగావ్, కర్నాల్, ఢిల్లీ, జైపూర్, జోత్పూర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి యున్నవి. వీటి శరీరం మధ్యస్థంగా ఉండి తల కొద్దిగా పైకి కొమ్ములు చిన్నవిగా లోపలి వైపు వంగి యుంటాయి. నుదురు పలుచగా ఉంటుంది. ఇవి తెలుపు లేదా గ్రే రంగులో ఉంటాయి. ఆవుల్లో పొదుగు బాగా అభివృద్ధి చెంది పాల నరము స్పష్టంగా కనిపిస్తుంటుంది. కాళ్ళు పొడవుగా ఉండి, సన్నగా ఉంటాయి. తుంటి ఎముక ప్రామినెంట్గా కనిపిస్తుంటుంది. తోక చిన్నదిగా ఉండి, స్విచ్ నలుపు రంగులో యుంటుంది.
ఉత్పాదక లక్షణములు: మగ పశువులు మంచి పని చేయు సామర్ధ్యం కలిగి ఉండుట వలన వీటిని వ్యవసాయ పనులకు మరియు రోడ్డు రవాణాకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆవులు ఒక పాడి కాలంలో 1400 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ జాతిలోని కొన్ని పశువులు 3000 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేయు సామర్ధ్యం కలిగి యుండుట వీటి ప్రత్యేకత.
Also Read: Gir Cow Milk: గిర్ ఆవు పాలకు ప్రజాదరణ పెరుగుతోంది