Windbreak and Shelterbelts Uses – గాలినిరోధకం: పంటల రక్షణ కొరకు ఒకటి లేక రెండు వరుసలలో చెట్లను నాటుటను గాలినిరోధకాలను అంటారు.
షెల్టర్వెల్ట్స్: ఎక్కువ విస్తీర్ణములో చాలా పొడవుగా చెట్లను నాటుటను షెల్టర్ బెల్ట్స్ అని అంటారు.
Also Read: Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!
గాలినిరోధకాలు మరియు షెల్డర్బెల్ట్స్ అవసరం:
గాలి నిరోధకములు మరియు షెల్టర్బెట్టు వ్యవసాయమునకు ముఖ్యము పొడిగా ఉన్న వాతావరణ ములో చాలా అవసరము. పొడి ప్రదేశముల్లో గాలి వేగము ఎక్కువగా ఉండడంవల్ల నేల నుండి మరియు మొక్కల నుండి నీరు ఎక్కువగా ఆవిరి రూపంలో వృధా అవుతుంది. చెట్ల విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల నేల కోతకు గురి అవుతుంది. అందువల్ల అలాంటి ప్రదేశాల్లో గాలినిరోధకాలు మరియు షెల్లర్ బెల్ట్స్ నాట వలెను గాలి నిరోధకాలను గాలి వీస్తున్న దిశకు అడ్డంగా నాటవలెను. మరియు ఉత్తరము, దక్షిణ దిశగా
నాటవలెను. అలా నాటినచో ఉత్తరము, దక్షిణము నుంచి వస్తున్న గాలి శక్తులను, తీవ్రతను తగ్గించవచ్చు.
లాభాలు:
- నేల కోతను ఆపి, వ్యవసాయ పొలాల్లో మైక్రో వాతావరణములో మార్పులు తీసుకు వస్తాయి. ముఖ్యము గా గాలి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించును.
- గాలి వల్ల కలుగు నేలకోతను గాలినిరోధకములు నిరోధించును.
- అధిక గాలి వేగము వల్ల మొక్కల యొక్క స్టామాటల్ పత్రరంధ్రములు తెరువబడుటని తద్వారా మొక్కల నుండి నీరు ఎక్కువగా ఆవిరి అయిపోవుటను గాలి నిరోధకాలు నిరోధిస్తాయి. దీనివల్ల మొక్కకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.
- తేమతో కూడిన మేఘాల వేగమును తగ్గించి గాలినిరోధకాలు ఉన్న ప్రదేశాలలో వర్షం పడేటట్లు చేస్తాయి.
- షెల్టర్ ప్రదేశాలలో మంచు పడుట అధికంగా ఉండును.
- గాలి నిరోధకాలచే రక్షించబడిన ప్రదేశాలలో భూమిలోని తేమ 0.3 నుంచి 7.8% వరకు అధికముగా ఉండును. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పిస్తుంది.
- గాలి నిరోధకాలు పశువులను వేడి మరియు చలిగాలుల నుంచి రక్షిస్తాయి.
- షెల్టర్ బెల్ట్స్ ని పండ్ల తోటల్లో పెంచడం వల్ల వేగముగా వీచే గాలి వల్ల పూత మరియు పిందెలు రాలిపోవు టను తగ్గిస్తాయి.
- గాలినిరోధక చెట్లను పెంచడం వల్ల పక్షులకు నివాసము కలుగును. ఈ పక్షులు పంటలపై వచ్చే హానిక రమైన పురుగులను చంపుతాయి.
- గ్రామీణ ప్రజలకు కావలసిన వంటచెరుకును మరియు చిన్న కలప అవసరమును గాలి నిరోధక చెట్లను పెంచడం వల్ల తీర్చవచ్చు.
Also Read: Diseases of Banana: అరటి పంటలో సిగటోక ఆకుమచ్చ తెగులు యాజమాన్యం.!