De – Horning in Cattle: భారత ప్రభుత్వం వ్యవసాయం భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని గ్రహించి, పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం నుండే వ్యవసాయ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. వ్యవసాయ అనుబంధం రంగమైన పశువులకు మనదేశంలో ఆది నుండి ఒక ప్రత్యేక స్థానం కలదు. పాడి పశువులు (ఆవులు, గేదెలు), మాంసాన్నిచ్చే పశువులు (గొర్రెలు, మేకలు, కోళ్ళు ) మనకు పాలు, మాంసం, గ్రుడ్లు, చర్మం, ఉన్ని వంటి ఉత్పత్తులనే గాక, వ్యవసాయ పనులకు పొలం దున్నుట, బండి లాగుటకు మరియు వాటి ఎరువులతో వ్యవసాయ పొలాలను సుపోషకం చేయుట, గోబర్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా వంట గది అవసరాలను తీర్చుటకు దోహద పడుతున్నాయి. అందుకే మన పూర్వీకులు పాడి – పంట అన్నారు. పాడికి మొదటి స్థానం ఇచ్చిన పంటకు రెండొవ స్థానం ఇవ్వడం జరిగినది. భారత ప్రభుత్వం నేటి వరకు వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన పశు సంపదను నిర్లక్ష్యం చేయుట వలన పాడి పరిశ్రమ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనే చెప్పవలసి యుంటుంది.
Also Read: Moraxella Bovis Disease in Cattle: ఆవులలో వచ్చే కళ్ళకలక వ్యాధి నివారణ చర్యలు.!
దూడలలో కొమ్ములను తొలగించుట:- దూడలలో కొమ్ములను తొలగించడాన్ని “De- Horning” అందురు. ఈ క్రింది పద్ధతుల ద్వారా దూడలలో కొమ్ములను తొలగించవచ్చును.
దూడలలో కొమ్ములను తొలగించుట వలన కలుగు లాభాలు:-
(1)దూడలు పెరిగేటప్పుడు కొమ్ములు పెరుగుట వలన పోట్లాడుకొనుటచే వాటికి గాయాలు అగును. కావున పుట్టినప్పటి నుంచే కొమ్ములను తొలగించుట వలన ఈ గాయాలు కాకుండా తప్పించగలము.
(2) పెరిగే పడ్డలకు లేదా పెద్దవైన ఆవులను సులువుగా Handling చేయుట ద్వారా అదుపులో వుంచుకోవచ్చు.
(3) పొడుగు కొమ్ములు ఉండుట వలన పశువులకు ఎక్కువ స్థలం అవసరమగును. కొమ్ములను తొలగించుట వలన Horm Cancer లాంటివి రాకుండా నివారించవచ్చు.
(4) ఈ విధంగా చేయుట వల్ల క్రమ క్రమేణా పోట్లాడే తత్వాన్ని మందలో లేకుండా చేసుకోవచ్చు.
1. రసాయనిక పద్ధతి (Chemical Method):- పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణమును చిక్కటి పేస్టుగా చేసి హార్న్ బడ్స్ పైన రుద్దవలయును. ఈ విధంగా తిరిగి చేయుట వల్ల కొమ్ములు పెరగ కుండా వుంటాయి. దీనిని బ్లడ్ లెస్ మెథడ్ (Blood less Method) అని అంటారు.
2. హాట్ ఐరన్ పద్ధతి (Hot Iron Method):- ఇందులో ఇనుప కడ్డీని ఏర్రగా కాల్చి కొమ్ము మొనలపై ” 3 లేక 5 సెకనులు” వుంచవలెను. దీని వలన హార్న్ సెల్స్ నాశనమై కొమ్ము పెరగకుండా ఉండును. కాల్చేటప్పుడు ఐరన్ రాడ్ చర్మం కంటే లోతుగా పోకుండా, పుర్రె ఎముకకు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. దీనిని కూడా బ్లడ్ లెస్ మెథడ్ (Blood less Method) అని అందురు.
3. మోకానికల్ పద్ధతి (Mechanical Method):- డి. హార్నార్ లేదా ఎలాస్టేటర్ లేదా రబ్బర్ బ్యాండ్ వంటివి ఉపయోగించి (using de-horning (Or) Elastator (or) Rubber band) కొమ్ములను తొలగించుట.
Also Read: Broiler Chickens: మాంసపు కోళ్ళ పెంపకంలో ఈ విషయాలు గమనించండి.!