చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Citrus Crop Protection: నిమ్మలో సీతాకోక చిలుక మరియు చెదలు పురుగు నివారణ చర్యలు.!

2
Citrus Crop Protection
Citrus Crop Protection

Citrus Crop Protection: ఈ పురుగు AP లో బత్తాయి, నిమ్మ పండించే అన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ చెట్లను కాకుండా చిన్న అంట్లను కూడా ఆశిస్తుంది. ఇది బేల ్పత్తి, కరివేపాకు చెట్లను మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది.

Citrus Crop Protection

Citrus Crop Protection

Also Read: Lemon Water: శరీరంలో అనేక రోగాలకు ఒక గ్లాస్ లెమన్ వాటర్

గుర్తింపు చిహ్నాలు (MOI):

  • సీతాకోక చిలుక రెక్కలపై నలుపు మరియు పసుపు పచ్చని మచ్చలుంటాయి. ఇవి పెద్దగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
  • లద్దెపురుగు మొదట్లో నల్లగా లేదా గాఢ గోధుమరంగులో ఉండి మొదట్లో పక్షుల రెట్ట మాదిరిగా కాని కనిపిస్తుంది.
  • బాగా ఎదిగిన లార్వా ముదురు ఆకుపచ్చ రంగుకి మారి సుమారు 45Cm పొడవు ఉంటుంది. దీని రంగులేత నారింజరంగులో మారిపోతాయి.
  • లార్వాను కదిపిన ఎడల రక్షించుకోవడానికి దాని తలలోని చీలి ఉన్న గులాబి రంగు కొమ్మును (ఆస్మటారియం) బయటకు తీసి శత్రువులను భయపెడతాయి.

లక్షణాలు:

  • జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటుంది.
  • ముఖ్యంగా లేత ఆకులు వచ్చే సమయంలో ఈ పురుగు చీని, నిమ్మచెట్ల ఆకులను పూర్తిగా తిని విపరీతంగానష్టాన్ని కలుగజేస్తుంది.
  • ఆకుల మధ్యఈనె తప్ప మిగతా భాగాన్ని పూర్తిగా తినేస్తుంది.

జీవిత చక్రం:

  • తల్లి పురుగు పసుపువర్ణంలో కలిగిన గుడ్లను ఒక్కొక్కటిగా లేత ఆకులపై లేదా లేక కొమ్మలపై పెడుతుంది.
  • లద్దెపురుగు 11-21 రోజులు పెరిగి ఊలుదారం సహాయంతో మొక్కను అంటుకొని కోపస్థదశలో ప్రవేశిస్తుంది. కోశస్థదశను (పారిస్) అని అంటారు.

ప్యూపా దశ: 816 రోజులు

యాజమాన్య పద్ధతులు:

  • లద్దెపురుగు మరియు కోశస్థదలను చేతితో ఏరి నాశనం చేయవలెను.
  • ఈ పురుగుల నివారణకు 1.5ml మోనోక్రోటోఫాస్ (or) 2ml మిథైల్ పారాథియాన్ (or) 1ml ఫెన్వల్ట్ 1Lt నీటికి కలిపి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారి చేయాలి.

చెదలు:

లక్షణాలు:

  • ఇవి లేత మొక్కల నుండి ముదురు చెట్లవరకు ఆశించి నష్టం కలిగిస్తాయి.
  • ఈ చెదలు ఉదృత్తి తేలిక నేలలలో, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉంటుంది.
  • పిల్ల మరియు పెద్ద పురుగులు కాందాన్ని ఆశించడం వల్ల చెట్టు ఎండిపోయి చనిపోతుంది.
  • మొక్క బెరడును తినుట వల్ల మొక్క శక్తిహీనమై ఎదుగుదల లేక చివరిదశలో ఎండి చనిపోతుంది.
  • ఈ పురుగులు మొక్క మొదళ్ళు, గూళ్ళుగా చేసుకొని గుంపులు గుంపులుగా ఉంటూ నష్టం కలిగిస్తాయి.

నివారణ:

  • తోటలలో ఎండిన కొమ్మలను ఏరివేసి కాల్చివేయాలి.
  • మట్టిని రాల్చేసి బోర్డ్ పేస్ట్ను పూయాలి.
  • అంతరకృషి, సేద్యం చేసేటప్పుడు అక్కడక్కడ చెదలు పట్టలను త్రవ్వివేయాలి.
  • పూర్తిగా కుళ్ళని సేంద్రియ ఎరువులను చెట్లకు వేసినప్పుడు చెదలు పెరిగే అవకాశం ఎక్కువ కావున ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి.

Also Read: Lemongrass Farming: మార్కెట్లో లెమన్‌గ్రాస్ మొక్కకు విపరీతమైన డిమాండ్

Leave Your Comments

Energy Plantation Importance: ఎనర్జీ ప్లాంటేషన్స్ యొక్క ప్రాముఖ్యత.!

Previous article

Cashew Nut Cultivation: జీడిమామిడి సాగులో ప్రవర్థనం మరియు నాటడంలో మెళుకువలు.!

Next article

You may also like