మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Organic Farming Techniques: సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు.!

1
Organic Farming
Organic Farming

Organic Farming Techniques: అవలంబించవలసిన సాగు పద్ధతులు:

  • అవసరమైన మేరకే నేలను దున్ని – నేల కోతను తగ్గించాలి.
  • వ్యవసాయం అంటే పాడి పంట – దీన్ని దృష్టి లో పెట్టుకుని పంట టో పాటు పాడి పశువుల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  • అంతర కృషి చేస్తూ కలుపు సకాలం లో తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్లు చూడాలి.
  • జీవన ఎరువుల ప్రాధాన్యత రైతులకు తెలిపి విరివిగా వాడేటట్లు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువుల ఉత్పత్తి ఎక్కువ చేసి రైతులకు అందజేయాలి.
  • నీటి వనరులను సద్వినియోగం చేస్తూ, నేలలోని తేమను పరిరక్షించుటకు తగు సేద్య విధానాలను అవలంబించాలి.
  • సస్య రక్షణ కు వృక్ష, జంతు సంబంధ మందులను వాడాలి.
  • జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ గావించాలి.
  • పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెడకుండా, ప్రకృతి ప్రసాదిత వనరుల ను ఉపయోగించుకోవాలి.
Organic Farming

Organic Farming

Also Read: CHEMICAL AND ORGANICE FERTILIZERS: సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్ధ వంతం గా ఉపయోగించడానికి రైతులకు సూచనలు

సేంద్రియ వ్యవసాయం లాభాలు:

  • నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
  • నేలలో “హ్యూమస్” నిల్వలు పెరిగి అన్ని పోషకాలను పంటలకు అందిస్తుంది.
  • నేల భౌతిక, రసాయనిక, జీవ పరంగా అభివృద్ధి చెందుతుంది.
  • నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
  • నీటి నిల్వ సామర్థ్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.
  • నేల కాలుష్యం తగ్గి నాణ్యత తో కూడిని ఉత్పాదకత జరుగుతుంది.
  • భూగర్భ జలాల కాలుష్య నివారణకు దోహద పడుతుంది.
  • Buffering Capacity పెరుగుతుంది
  • చీడ పీడల బెడద తగ్గుతుంది
  • వానపాముల అభివృద్ధి ఇతోధికంగా సాయ పడుతుంది.
  • పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది.
  • నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది.
  • నాణ్యత, నిల్వ వుండే గుణం పెరుగుతుంది.
  • సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మూలమవుతుంది.

సేంద్రియ వ్యవసాయం లో అవరోధాలు:

  • మొత్తం సాగు భూమికి కావలసిన సేంద్రియ పదార్ధాన్ని సేకరించడం కష్టం.
  • రైతులకు పశు పోషణ సామర్ధ్యం తగ్గి పశువులను పోషించలేక పోవడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ.
  • రైతుల జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్ధాల తయారీకి సుముఖం గా ఉండరు.
  • సేంద్రియ ఎరువుల ప్రభావం మొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతులు రసాయనిక ఎరువులపై మొగ్గు చూపిస్తున్నారు.
  • కౌలుకు చేసే రైతులు సేంద్రియ ఎరువులపై శ్రద్ధ చూపరు.
  • అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ లు సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు రాక పోవచ్చు.
  • సేంద్రియ ఎరువుల వలన నాణ్యత పెరిగినా దిగుబడులు రసాయనిక ఎరువుల వల్లే పెంచ వచ్చు.
  • నీటి ఎద్దడి ప్రాంతాల్లో సేంద్రియ ఎరువుల సమీకరణ, సేంద్రియ సేద్యం కష్టతరమవుతుంది.
  • సేంద్రియ ఎరువు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతు దానివైపు మొగ్గు చూపడం లేదు.

Also Read: Organic Farmer Story: సేంద్రీయ వ్యవసాయం ద్వారా 3 లక్షలు సంపాదిస్తున్న రైతు

Leave Your Comments

Crop Protection in Chilli: మిరప సాగులో సస్యరక్షణ చర్యలు.!

Previous article

Broiler Farming: మాంసవు కోళ్ళ పెంపకంలో గృహవసతి, పోషణ యాజమాన్యం.!

Next article

You may also like