PJTSAU: డిజిటల్ వ్యవసాయానికి భారతదేశంలో అపార అవకాశాలున్నాయని అమెరికా లోని కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ అగ్రానమీ డివిజన్ హెడ్ ప్రొఫెసర్ రాజ్ ఖోస్లా అభిప్రాయపడ్డారు. సవాళ్ళ నుంచి అవకాశాలు వెదుక్కోవాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,రాజేంద్ర నగర్ లోని వాటర్ టెక్నాలజీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ అన్న అంశంపై ఆయన అతిధి ఉపన్యాసం ఇచ్చారు.
Also Read: Vana Mahotsavam: వన మహోత్సవం ఎలా జరుపుతారు.!
1980 లోనే ప్రపంచం లో ప్రెసిషన్(డిజిటల్)వ్యవసాయం ప్రారంభమైందని అయన వివరించారు.జీపీఎస్,జీ ఐ ఎస్,సెన్సర్లు తదితర టెక్నాలజీలు ముందు ముందు వ్యవసాయం లో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.2050 నాటికి ప్రపంచ వ్యాప్తం గా వ్యవసాయంలో డిజిటల్ పద్ధతుల వినియోగం పెద్ద ఎత్తున పెరిగే అవకాశముందని ఖోస్లా అన్నారు.వ్యవసాయరంగం లో ఇన్నోవేషన్స్ కి మంచి భవిష్యతు ఉందన్నారు.
పీ జే టీ ఎస్ యూ ఆ దిశ గా అనేక చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు.శాస్త్రవేత్తలు,విద్యార్థులు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ నైపుణ్యాలు పెంపొందించుకోవటం లో ప్రత్యేక ద్రష్టి పెట్టాలని ఖోస్లా సూచించారు.ప్రస్తుత,భవిష్యత్ అవసరాలకి అనుగుణం గా మార్పు చెందాలని ఖోస్లా పిలుపునిచ్చారు.
వివిధ సంస్థల మధ్య ఒప్పందాలు,భాగస్వామ్యం తో ముందుకెళితేనే సవాళ్ళని సమర్ధవంతం గా ఎదుర్కోగలమని వర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అన్నారు.తరిగిపోతున్న జలవనరులు,వాతావరణ మార్పులు,భూసార క్షీణత తదితర సవాళ్ళని వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నదని ఆయనన్నారు.
సాంకేతికత,నూతన టెక్నాలజీలతో వాటిని పరిష్కరించుకోవలసి ఉందన్నారు.కాలనుగుణం గా బోధన,పరిశోధన పద్ధతులు మారాలని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం లో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.సుధీర్ కుమార్,పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్,డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ,ప్రిన్సిపుల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం వీ రమణ,వాటర్ టెక్నాలజీ సెంటర్ డైరక్టర్ డాక్టర్ కె.అవిల్ కుమార్,అధ్యాపకులు,శాస్త్రవేత్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: Storage of Grains: ధాన్యం నిలువ సమయంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు.!