PJTSAU Vice-Chancellor Retirement: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఈ మధ్య పదవీ విరమణ చేసిన డాక్టర్ వి. ప్రవీణ్ రావు వీడ్కోలు, సన్మాన సభ ఈరోజు రాజేంద్రనగర్ లోని వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ అధ్యక్షతన ఇది జరిగింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కళాశాలలు, పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, శాస్త్రవేత్తలు, ICAR సంస్థల ప్రతినిధులు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PJTSAU Vice-Chancellor Retirement
Also Read: July Month Cultivation Works: జులై నెలలో చేపట్టవలసిన సేద్యపు పనులు.!
అదేవిధంగా రాష్ట్ర TNGO సంఘ ప్రతినిధులు కూడా సభకు హాజరయ్యారు. ప్రవీణ్ రావు కి ఆత్మీయ సన్మానాలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రవీణ్ రావు సారథ్యంలో PJTSAU సాధించిన ప్రగతిని వివరించారు. ఆయన నిరంతర కృషి వల్లనే PJTSAU కి అంతర్జాతీయంగా, జాతీయంగాను మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ICAR, వర్సిటీ సిబ్బంది సంపూర్ణ సహకారం వల్లె తాను ఇదంతా చేయగలిగానని ప్రవీణ్ రావు అన్నారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో PJTSAU ని అత్యున్నత సంస్థ ల సరసన సరసన నిలబెట్టడానికి అందరి తోడ్పాటు ఉందన్నారు. మౌలిక వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు.

PJTSAU Vice-Chancellor Dr. Praveen Retirement Meeting
నేడు వర్సిటీ రూపొందించిన వంగడాలకి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. మారుతున్న పరిస్థితులు, సవాళ్లకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అధ్యాపకులు, పరిశోధకులు అప్డేట్ కావాలని ప్రవీణ్ రావు సూచించారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని రైతాంగానికి మరింత సేవ చేయాలని ప్రవీణ్ రావు పిలుపునిచ్చారు.
Also Read: Characteristics of Domestic Cows: పనికి ఉపయోగపడే దేశవాళి ఆవుల లక్షణాలు.!