Weed Management in Sugarcane: చెరకును ప్రధాన వాణిజ్య పంటగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు. చెరకు సాగులో ఇతర యాజమాన్య పద్ధతులతో పాటు కలుపు నిర్మూలన కూడా చాలా ముఖ్యమైన అంశం. పంట మొదటి దశలో వచ్చే కలుపు వలన పంట దిగుబడి తగ్గుతుంది అని అంచనా. కలుపు మొక్కల ఉధృతి చెరకులో ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం సాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉండడం. అవసరానికి మించిన నీటి తడులు, ఎక్కువ మోతాదులో ఎరువులు వాడకం, మొలకెత్తుటకు ఎక్కువసమయం తీసుకోవడం. ఈ కలుపు మొక్కల యొక్క ఉధృతి చెరకు నాటిన మొదటి 90రోజుల లేకుండా చూడాలి. మరి ముఖ్యంగా నాటిన 4-6 వారాలు మధ్యన కలుపు లేకుండా చూడాలి.
Also Read: Sugarcane Juice Benefits: ఒక గ్లాస్ చెక్కర రసం.. లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?
చెరకు దీర్ఘకాలిక పంట కావడం వల్ల వివిధ దశలో నేల స్వభావన్నీ బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి కనిపిస్తుంటాయి. సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులైన లోతు దుక్కులు వేసవిలో చేయడం, ముచ్చేలు నాటుటకు ముందు పాలు మార్లు దుక్కి చేయడం. అంతర కృషి చేయుట, అంతర పంటలు మరియు తగినత సాంద్రత ఉండేలా చూడడం. నీటి తడులను బిందు సేద్యం ద్వారా ఇవ్వడం వలన కలుపు మొక్కల ఉధృతిని తగ్గించవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో కూలీలతో కలుపు తీయిచడం మరియు గొర్రు, అంతర కృషి చేయడం అనేది కూలీల రేటు ఎక్కువ కావడం వల్ల నష్టం జరుగుతుంది.
చెరకు ముచ్చేలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకి 2.0 కిలోల అట్రాజిన్ 50% పొడి మందు లేదా మెట్రిబ్యూజిన్ 70% పొడి మందును పిచికారీ చెయ్యాలి. చెరకుతో పాటు అంతర పంటలగా పెసర, మినుములు, టమాట సాగు చేస్తున్నపుడు అల్లాక్లోర్ 2.0లీ. లేదా పెండిమితలిన్ 1లీ ఎకరానికి పిచికారీ చెయ్యాలి.అలా చేయడం వలన అంతర పంటకు ఎటువంటి హాని కలుగదు. పారాక్విట్ 5మి. లీ లీటర్ నీటికి కలిపి ముచ్చేలు నాటిన 10-12 డేస్ ముందుగా మొలిచినాకలుపు మొక్కలకు పిచికారీ చెయ్యాలి. ముచ్చేలు మొలక రావడానికి ముందు మాత్రమే పారాక్వాట్ ను వాడాలి.
ముచ్చేలు మొలకేత్తిన తర్వాత అనగా 35-45 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలు తుంగ, ఎక్కువగా ఉన్నప్పుడు 2,4D అమై న్ సాల్ట్ 58% ఎకరానికి పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు మొక్కలకు చెరకు పంటలో 35-45 రోజుల లోపు వస్తే 2,4D సోడియం సాల్ట్ పొడిమందు కిలో మిశ్రమాన్ని ఎకరానికి కలిపి పిచికారీ చెయ్యాలి.
తీగ జాతి కలుపు మొక్కలు చెరకు గడలను అల్లుకొని పెరుగుదల తగ్గడమే కాకుండా చెరకు నరకడం వలన కూడా కష్టం అవుతుంది. ఈ కలుపు మొక్కల నిర్మూలన 2, D సోడియం సాల్ట్ 80% పొడి మందును 800 గ్రా. లేదా 2-4D అమైన్ సాల్ట్ 58% ద్రావకం 800మి. లీ తీగ జాతి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పిచికారీ చెయ్యాలి.
Also Read: Sugarcane cultivation: చెఱకు సాగులో చెఱకు చెత్త వినియోగము