అగ్గి తెగులు:
ఈ వ్యాధి పైరికులేరియా గ్రిసియా అను శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది.
అగ్గి తెగులు వరి పైరుకు ఏ దశలో అయినా ఆశించవచ్చు.
ఆగ్గి తెగులు నారుమడిలో వచ్చినట్టు అయితే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది.
ఆకులపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
వరి మొక్క వెన్ను పైకి వేసే దశలో ఈ తెగులు సోకినట్లు అయితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి.
దీని వల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి పడిపోవడం జరుగుతుంది. అందువలనే దీన్ని మెడ విరుపు అంటారు. ఈ వ్యాధి సోకిన వెన్నులికి గింజలు తెల్లగా మారి ఉంటాయి.
నివారణ:
నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి
పొలం గట్టును కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చెయ్యాలి.
నత్రజని సిఫార్సు చేయబడిన విధంగా 2-3 సార్లు వెయ్యాలి.
థైరామ్ లేదా కెప్టెన్ 2.5 గ్రా కలిపి విత్తనశుద్ది చెయ్యాలి.
తెగులు కనిపించిన వెంటనే ఏడిపిన్ పాస్ 1మిల్లి నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
Also Read: Weed Management in Direct Seeded Paddy: నేరుగా విత్తిన వరి పొలంలో కలుపు యాజమాన్యం.!
పొడ తెగులు:
ఈ వ్యాధి రైజోక్టోనియా సొలని అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సామాన్యంగా వరి యొక్క పిలకలు పెట్టు దశల్లో నుండి ఎప్పుడైనా వ్యాపించవచ్చు.
కాండంపై ఉన్న ఆకుల మీద చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒక క్రమ పద్దతిలో ఉండవు.
వరి మొక్క పిలకలు పెట్టే దశలో సోకినప్పటికి వెన్ను పైకి తీయు దశలో దీనిని గమనించాలి. మచ్చలపై ఆవగింజ పరిమాణంలో ఈ నల్లటి శిలీద్ర బీజాలు ఉంటాయి.
వరి పైరు కోసే సమయంలో ఈ బీజలు కొన్ని రాలిపోయి మరి కొన్ని ధాన్యంలో కూడా కలుస్తాయి.
నివారణ:
మంచి విత్తన్నాన్ని ఎన్నుకోవాలి.
మొకోజబ్ తో విత్తనశుద్ది చెయ్యాలి.
పిలక దశలో తెగుల లక్షణాలు కనిపించినప్పుడు 1మీ. లి ప్రొపైకానిజాల్ లేదా హేగ్జాకొనిజాల్ 2మీ. లి మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
పొట్టకుళ్ళు తెగులు:
ఈ వ్యాధి సరోక్లడియం ఒరేజ్ అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వరి మొక్క పొట్టదశలో ఉన్నపుడు పంటకు ఈ వ్యాధి సోకుతుంది
వరి మొక్క పైకి తీసే దశలో ఈ వ్యాధి లక్షణాలు బాగా కనిపిస్తాయి.
వరి వెన్నుసగం భాగం మాత్రం బయటకి ఉంచి మిగతా భాగం పొట్ట ఆకులో ఉంటుంది. పొట్ట ఆకు కింద భాగంలో ఆకులపై కోలగా మారి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
ఈ మచ్చల మధ్య భాగం బూడిద రంగు కలిగి ఉంటుంది.
గాలి ద్వారా వ్యాప్తి చెంది కీటకాలు చేసిన గాయాలు నుండి మొక్కల లోపలికి ప్రవేశిస్తాయి. కంకి ఆకులను గాయపరిచి కీటకాలు ఎక్కువగా ఉన్నపుడు గాయలవల్ల వెన్ను బయట పడని పరిస్థితిల్లో ఈ వ్యాధి ఎక్కువ సోకుతుంది.
నివారణ:
పైరు పొట్ట దశలో ఒకసారి తెగులు కనిపించిన వెంటనే, కార్బండిజలో, లేదా బేనోమీల్ 0.5గ్రా లీటర్ నీటికి కలిపి రెండు సార్లు వారం వ్యవధిలో పిచికారీ చెయ్యాలి.
నత్రజని ఎరువులను 3-4 దఫాలు గా వెయ్యాలి.
బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు:
ఈ వ్యాధి జనతోమోనస్ కంప్రెస్టిస్ ఒరేజ్ అను బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఈ తెగులు వరిపైరును ముఖ్యంగా 3 దశలలో ఆశిస్తుంది.
నారుమడి దశలో ఈ తెగులు సోకితే ఆకుల చివరల నుండి క్రింది వరకు రెండు పక్కల తడిసినట్టు ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోవును. దీనిని క్రిసిక్ దశ అని అంటారు. నాట్లు వేసిన 30 రోజుల తర్వాత కూడా ఈ క్రిసిక్ లక్షణాలు కనిపించవచ్చు.
వరి మొక్కలు పిలక పెట్టు దశలో ఆకు చివరల నుండి క్రింద వరకు పసువు పచ్చగా మారి తెగులు సోకి భాగాలు ఎండి పోవును.
వరి వెన్ను పైకి తీసే దశలో తెగులు సోకిన ఆకులలో తగ్గుట వలన కొన్ని వెన్నులు సగం మాత్రం బయటకి రావడం జరుగుతుంది. మరియు గింజలు తెల్లగా మారతాయి.
నివారణ:
ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్నిసేకరిచాలి.
తెగులు 5% కంటే ఎక్కువ అయితే నత్రజని ఎరువులను వేయడం అపి వెయ్యాలి.
సాగు నీటికి తెగులు సోకిన పొలం నుండి తెగులు ఆశించిన పొలానికి వెళ్లకుండా చూడాలి.
తెగులు కనిపించిన వెంటనే స్ట్రెప్సమైసిన్ లేదా పోషమైసిన్ 200 పిపియం మందును 10- 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చెయ్యాలి.
Also Read: Paddy Cultivation: వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.!