Topping and De-suckering in Tobacco: నికోటియానా టబాకమ్ వంగడాలను దేశీ రకాలు అంటారు. వాటికి పొడవైన మొక్కలు, పొడవైన, వెడల్పైన ఆకులు. సాధారణంగా పింక్ పువ్వులు ఉంటాయి.టబాకమ్లో ప్రత్యేక వంగడాలు సిగరెట్, బీడి, హుక్కా నమలటం, నశ్యం పొగాకుకు దొరుకుతాయి. పొగాకు కింద వున్న మొత్తం విస్తీర్ణంలో 25% ఎఫ్.సి.వి.కింద 31% బీడి, 26% నమిలేది, హుక్కా 7.5% నాటు, 10.5% చుట్ట, చెర్రూట్లు లంక, బ పొగాకులు సాగు చేయబడుతున్నాయి.
Also Read: Nutrient Management in Tobacco: పొగాకు పంటలో ఎరువుల యాజమాన్యం.!
సాగుచేసే వంగడాలు:
ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సిగరెట్ పొగాకు, నాటు పొగాకు, బర్లీ పొగాకు, బీడి పొగాకు సాగు చేస్తారు.
సిగరెట్ రకాలు:
ముఖ్యమైన సాగుచేసే వంగడాలు: ఎఫ్.సి.వి. పొగాకు, కేంద్రపోగాకు పరిశోధన సంస్థ (సి.టి.ఆర్.ఐ) స్పెషల్, కనకప్రభ, ధనబాయి, డెలెస్ట్, వర్జీనియాగోల్డ్, వైట్ గోల్డ్, 16/103
నాటు పొగాకు రకాలు: తోక ఆకు యన్ -1, కర్ర విత్తనం యన్-2, నీటివిత్తనం, కందుకూరు పెద్ద, సురకత్తి, జవలన్, ఏనుగుదేవి, సంఘుమెడ విత్తనం, గొర్రెగొమ్ము, డి.జి. -3, యన్.జి-3, డి.ఆర్ 1.
బర్టీ పొగాకు రకాలు: అతి సామాన్యంగా పెంచే వంగడాలు: 1. బర్జీ-21, 2. కెపై-8 3. కెపై-16,4, హెచ్.డి.బి.ఆర్.జి.
తలలు నరకటం, పిలకలు తీసివేయటం: (ట్రాపింగ్, డిసక్కరింగ్)
తల నరకడం (టాపింగ్) చర్యలో పుష్పగుచ్చం బయటకు వచ్చే ముందుగాని, వచ్చిన తరువాత గానీ కొనమొగ్గను తీసివేయడం జరుగుతుంది. తలనరికిన తర్వాత గ్రీవపు మొగ్గలు క్రియాశీలమై పిలక అనే ప్రకాండాలను ఉత్పత్తి చేస్తాయి. పిలకలు తీసివేయటాన్ని “డీ సక్కరింగ్” అంటారు. తల నరకటం పిలకలు తీసివేయటం. లక్ష్యం, మొక్క పోషకాలను పుష్పాలకు విత్తనాలకు పోకుండా ఆకులకు మళ్ళించటమే. ఫలితంగా ఆకు పరిమాణం పెరుగుతుంది. పొగాకు దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
మొదటి పువ్వు తెరుచుకున్నప్పుడు మామూలు టాపింగ్ క్రింద తక్కువ టాపింగ్తో పోలిస్తే అదే సమయంలో చేస్తారు. కానీ అదే సమయంలో మరో 2 ఆకులు ఎక్కువ తీస్తారు. టాపింగ్ లేనిదానితో పోలిస్తే గరిష్ట క్యూరింగ్ చేసిన ఆకు దిగుబడి లభిస్తుంది. అయితే తేలిక నేలల్లో పెంచిన ఎఫ్.సి.వి.పొగాకును మాత్రమే టాపింగ్ చేస్తారు. కానీ ఇదే పొగాకు భారీ నేలల్లో లేదా ఎరువు వేసిన నేలల్లో టాపింగ్ చేయరు. పిలకలు పట్టుకోవడానికి వీలుగా ఉండే పరిమాణం చేరుతుండగా సాధారణంగా 2,3 సార్లు పిలకలను చేతితో తీసిస్తారు. పిలకలు తొలగించిన వెంటనే ఆకు, కాండం కలిసి చోట ఒక చుక్క కొబ్బరి నూనె వేసి పిలకలను అదుపులో ఉండవచ్చు. ఈ నూనె గ్రీవపు మొగ్గల అభివృద్ధిని నిరోధిస్తుంది. అయితే ఆకులపై పడినచో ఆకు నాణ్యత దెబ్బతింటుంది. అందువలన సి.టి./ఆర్. ఐ వాళ్ళు ‘సక్కరవుట్ 3.5% మొక్కకు 10 మిల్లీలీటర్లు చొప్పున పైనుండి 5-6 ఆకుల మొదళ్ళలో వేయుట ద్వారా లేక వేప నూనె ఎమల్షన్ రసాయనం వాడుట ద్వారా పిలకలను నిరోధించవచ్చును.
పంట బాగా పెరిగితే టాపింగ్ ఆలస్యంగా చేయడం మంచిది. ఉత్తరం వైపు తేలిక నేలల్లో సాగుచేసి పొగాకులో బడ్ టాపింగ్ 24 ఆకులు ఉంచి, తరువాత దక్షిణ వైపు తేలిక నేలలు, సాంప్రదాయ నల్లనేలల్లో లేత ఆకుపచ్చ రకాలను మొదటి పుష్పం విచ్చుకునే దశలో, నీటి ఆధారిత / వర్షాధార నాటు పొగాకులో 14-16. ఆకులు ఉంచి, లంక పొగాకులో 12-14 ఆకులు ఉంచి మిగిలినవి తీసేస్తారు. బర్జీ పొగాకులో గోదావరి జిల్లా, గుంటూరు, తెలంగాణాలో వరుసగా 21-24 ఆకుల స్థాయి వద్ద, 14-16 ఆకుల స్థాయివద్ద, 24-26 ఆకుల వద్ద చేస్తారు.
Also Read: Tobacco Harvesting Techniques: పొగాకు కోత మరియు పదును చేయడంలో మెళుకువలు.!