Chicken Breeds for Meat and Eggs: భారతదేశంలో పాలు, గ్రుడ్లు మరియు మాంస వినియోగం అసాధారణ పెరుగుదల వలన ప్రపంచంలో మనకంటు ఒక పత్యేక స్థానం లభించింది. భారత దేశ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న విభాగాలలో పౌల్ట్రీ ఒకటి. పంటల ఉత్పత్తి ఏడాదికి 1.52 శాతం రేటుతో వృద్ధి ఉంటే, గ్రుడ్లు మరియు బ్రాయిలర్ కోళ్ళ యొక్క వృద్ధి ఏడాదికి 8.10 శాతం ఉంది.
Also Read: Listeriosis Disease in Goats: మేకలలో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం.!
1. కారిప్రియ లేయర్:
మొదటి గ్రుడ్లు పెట్టే వయస్సు 17-18 వారాలు.
150 రోజులకు 50 శాతం ఉత్పత్తి ఉండును.
26 నుండి 28 వారాలకు ఎక్కువ ఉత్పత్తి చేయును.
బ్రతకగల సామర్థ్యం 96 శాతం.
గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
గ్రుడ్డు బరువు 54 గ్రాములు.
2. కారీ సొవాలి లేయర్:- (గోల్డెస్ -92)
మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు 18-19వారాలు.
155 రోజులకు 50 శాతం ఉత్పత్తి ఉండును.
2 నుండి 29 వారాలకు ఎక్కువ ఉత్పత్తి చేయును.
బ్రతకగల సామర్థ్యం 96 శాతం.
గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
గ్రుడ్డు బరువు 54 గ్రాములు,
3. కారీ దేవెందర్:
మధ్యస్థ సైజు ఉన్న రెండు అవసరాలకు సరిపడే కోడి
మేత ఖర్చు కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది.
ఇళ్ల దగ్గర చనిపోయే శాతం తక్కువ.
8 వారాలకు కోడి బరువు 1700-1800 గ్రాములు.
గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు 155-160 రోజులు
వార్షిక గ్రుడ్లు ఉత్పత్తి 190-1200 గ్రాములు.
మాంసోత్పత్తి కోళ్ళు (బ్రాయిలర్లు)
1. కారీఖ్ – విషాల్ (కారీబ్రో-91)
రోజుల పిల్ల బరువు 43 గ్రాములు.
2 నుండి 6 వారాల వయస్సు వున్న కోడి బరువు 2100 నుండి 2200 గ్రాములు.
డ్రెసింగ్ శాతం 75శాతం.
బ్రతకగల సామర్థ్యం 97 నుండి 98 శాతం.
2. కారీ -డ్రెస్ బ్రా:- (బి-77)
రోజుల పిల్ల బరువు 41 గ్రాములు.
6 వారాల వయస్సు వున్న కోడి బరువు 1300 గ్రాములు
7 వారాల వయస్సు వున్న కోడి బరువు 1600 గ్రాములు
డ్రెసింగ్ శాతం 73 శాతం.
బ్రతక గల సామర్థ్యం 98-99 శాతం
6 వారాలకు ఫిడ్ కన్వెర్సన్ నిష్పత్తి 2.3 శాతం.
3. కారిద్రో ధనరాజు:- (రంగులది)
రోజుల పిల్ల బరువు 46 గ్రాములు.
6 వారాల వయస్సు ఉన్న కోడి బరువు 1600-1650గ్రా.
7 వారాల వయస్సు ఉన్న కోడి బరువు 2000-2150 గ్రా.
డ్రెసింగ్ శాతం 73 శాతం.
బ్రతకగల సామర్థ్యం 98-99 శాతం.
ఆరు వారాలకు డ్ కన్వరెన్ నిష్పత్తి 1,90-210.
4. కారిబ్రో మృత్యుంజయ్:- (కారీ నేకర్ వెక్స్) –
3 రోజుల పిల్ల బరువు 42 గ్రాములు
26 వారాల వయస్సు వున్న కోడి బరువు 1650 – 1700 గ్రా.
7 వారాల వయస్సు ఉన్న కోడి బరువు 2000 – 2150 గ్రా.
డ్రెసింగ్ శాతం 72 శాతం
బ్రతక గల సామర్థ్యం 97 – 98 శాతం.
ఆరు వారాలకు ఫీడ్ కన్వెర్షన్ నిష్పత్తి 1.9-20
Also Read: Broiler Chicken: బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో తీస్కోవాల్సిన యజమాన్య చర్యలు