వ్యవసాయ పంటలు

Crop Rotation Advantages: పంట మార్పిడితో ప్రయోజనాలు.!

0
Crop Rotation Advantages
Crop Rotation Advantages

Crop Rotation Advantages: పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో పురుగు వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పొగాకు, కూడా అలాగే పండిస్తున్నారు. ఈ పైర్లు నేలలో ఒకే లోతు పొర నుంచి పోషకాలను తీసుకోవడం వల్ల నేల నిస్సారం అవుతుంది. వరి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, వంటి పైర్లు నేలపై పొరల నుండి, పత్తి, మిరప, పొగాకు, కంది, వంటి వేర్లు నేల లోపలి పొరల నుండి పోషకాలను తీసుకుంటాయి.

Crop Rotation Advantages

Crop Rotation Advantages

Also Read: Sorghum Cultivation: జొన్నలో సస్యరక్షణ.!

పంట మార్పిడి క్రమంలో ఆహార, వాణిజ్య పంటలు, ఒకసారి పప్పుజాతి, పైర్లు మరొకసారి మార్పిడి చేస్తూ ఉండాలి.
అవసరం అయినప్పుడు పశుగ్రాసం కోసం గడ్డి జాతి పైర్లు, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు.
పప్పు జాతి పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల వీటి వేర్లు బూడిపేలలో రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి.

వరి తరువాత మినుము, పెసర, వేరుశనగ, చెరకు, వెయ్యడం వల్ల సుడి దోమ, టుంగ్రో వైరస్ ను నివారించవచ్చు.
చెరకు తరువాత వరి వెయ్యడం వల్ల వేరు పురుగులను, వరిలో దోమ పోటును నివారిచవచ్చు.
ప్రత్తి వేసిన పొలంలో జొన్న, మొక్కజొన్న, నువ్వులు, మినుము వేస్తె లద్దె పురుగు, పచ్చ పురుగును నివారించవచ్చు.
జొన్న, మొక్క జొన్న, తరువాత కంది వేస్తే కాయ తొలుచు పురుగు ఉదృతి తగ్గుతుంది.
వరి వేసే పొలంల్లో ముందుగా పప్పుజాతి పైర్లను వెయ్యడం వల్ల నేల సారవంతమవుతుంది.

వేరుశనగలో ఆకు ముడతను నివారించడానికి పప్పు జాతికి చెందిన పైరుతో పంట మార్పిడి చెయ్యాలి.
కంది, మిరపల్లో ఎండు తెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న, నువ్వుల పంటలతో మార్పిడి చెయ్యాలి.
కంది పంటను జొన్న, మొక్క జొన్న, నువ్వుల పంటలతో మార్పిడి చేస్తే కాయతొలిచే పురుగు ఉధృతి తగ్గుతుంది.
పొగాకు లో జొన్నమల్లె జొన్నలో స్ట్రీగా వంటి పరాన్నజీవి కలుపు మొక్కలను పంట మార్పిడి వల్ల అరికట్టవచ్చు.
నులిపురుగులు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరు సెనగ, మిరప, పొగాకు, వంగ పైర్లలో కొన్ని పంట కలలు తప్పనిసరిగా ఆపాలి.

Also Read: Pest Management in Sorghum: జొన్నను ఆశించు తెగులు – వాటి నివారణ

Leave Your Comments

Sorghum Cultivation: జొన్నలో సస్యరక్షణ.!

Previous article

Bamboo Cultivation Techniques: వెదురు సాగులో మెళుకువలు.!

Next article

You may also like