Tobacco Harvesting Techniques: కాడకోసే పద్ధతిలో మొత్తం మొక్కను ఒకేసారి కోస్తారు. ఒకొక్కొసారి ప్రైమింగ్ చేసినపుడు 2 లేదా 3 ఎక్కువ అయిన ఆకులను కోస్తారు. మొదటి ప్రైమింగ్ ప్రారంభం అయిన తర్వాత ప్రైమింగ్లు సుమారు 6-7 రోజులకు ఒకసారి కోస్తారు. వానల వల్ల దెబ్బతింటే తప్ప ఆకుల సంఖ్య. శీతోష్ణస్థితి పరిస్థితులను బట్టి మొత్తం కోతను 6-8 లేదా 10 ప్రైమింగ్లలో పూర్తి చేస్తారు. పక్వం కాకుండా కోసిన ఆకులు ఆకుపచ్చగా పదును అవుతాయి. కాగా మరీ ఎక్కువ పక్వం అయ్యాక కోసిన ఆకులు బరువు కోల్పోయి క్యూరింగ్ చేసినపుడు ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తాయి. సరైన పక్వతలో కోసిన ఆకులలో అత్యంత వాంఛనీయ, భౌతిక, రసాయన నాణ్యత అభిలక్షణాలు కనిపిస్తాయి. చుట్ట, చెర్రూట్, హుక్కా పొగాకుల్లో, కాడకోసే పద్ధతిలో కోస్తారు. ఈ పద్ధతిలో మొక్కలను భూమికి దగ్గరగా కొడవలితో కోసి సాధారణంగా వడలడం కోసం రాత్రి పొలంలో వదిలిపెడతారు.
Also Read: Flue Curing in Tobacco: పొగాకులో ఫ్లూక్యూరింగ్ ఎలా చేస్తారు.!
ఎండలో పదును చేయడం (సస్ క్యూరింగ్): చుట్టకు, నమలడానికి ఉపయోగించే పొగాకు మొక్కలను వెదురు కర్రలను గుచ్చి సుమారు 15-20 రోజుల పాటు ఎండలో పదును చేస్తారు. నాటు పొగాకు ఉపయోగించి గోనె దారంతో గుచ్చి 1-2 నెలల పాటు ఆ దారాల మీద ఎండలో పదుని చేస్తారు. బీడి పొగాకు మొక్కలను కోసి అక్కడే తలక్రిందులుగా ఉంచి ఎండబెడతారు.
గాలిలో పదును చేయడం (ఎయిర్ క్యూరింగ్): హుక్కా పొగాకును గాలిలో పదును చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో లంక పొగాకు ఆకును కాండంలో కొంత భాగంతో పాటు కోసి ఒక షెడ్లో తాళ్ళ వ్రేళ్ళాడదీసి సుమారు 2-21/2 నెలలపాటు గాలిలో నిల్వచేస్తారు. తరువాత వాటిని గుంటలలో పదును చేస్తారు. బర్లీ పొగాకు ఆకులను కోసి, గోనె దారం మీద గుచ్చి ఒక వెదురు కర్ర మీద కడతారు. ఈ కర్రలను బేరన్లకు బదిలీ చేస్తారు. అధిక సాపేక్ష ఆర్ద్రత (70-80) ను చుట్టడం పదును చేసినపుడు ఉంచుతారు.
గుంటలలో పదును చేయడం (పిట్ క్యూరింగ్): లంక పొగాకును, హుక్కా, నమిలే పొగాకును గుంటలలో పదును చేస్తారు. ఆకును గాలిలో పదును చేసిన తరువాత గానీ ఎండలో పదును చేసిన తరువాత గానీ ఇది చేస్తారు. లంక పొగాకును గుంటలలో పదును చేయడం 1-1.5 మీటర్లలోతు, 1.5-2.5 మీటర్ల వ్యాసం ఉన్న స్థూపాకార గుంటలలో పదును చేస్తారు. 2 హెక్టార్ల విస్తీర్ణం నుంచి కోసిన ఆకును పదును చేయడానికి అటువంటి గుంటలు 2 కావాలి. గుంట పక్కలు, అడుగుభాగం నునుపుచేసి, పొగాకు గొలుసులను ఒకదానిపైన తాటాకుతో కప్పి, దానిపైన మట్టితో కప్పి గాలి చొరకుండా చేస్తారు. 24 గంటల తరువాత గుంటలను తెరచి ఆకును రెండో గుంటకు బదిలీ చేసి కప్పుతారు. ఈ గుంటను 48 గంటల తరువాత తెరచి ఆకును మొదటి గుంటకు మారుస్తారు. అందులో 24 గంటలసేపు ఉంచుతారు. ఈ పాటికి కావల్సిన రంగు వస్తుంది.
Also Read: Tobacco Climate: పొగాకు సాగు కు అనుకూలమైన వాతావరణం