Fusarium Wilt in Tomato: టమాట అధికంగా కూరగాయగానే కాకుండా సుపుగాను, క్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్టూ మరియు పొడి రూపంలో కూడా వాడుతారు. టమటలో అధికంగా విటమిన్ ‘సి’ వుంటుంది. టమాటా ఉత్పత్తులకు అనేక దేశాలలో గిరికి ఉంటుంది. విత్తనంలో 24 % నూనె వుంటుంది. టమాటా నూనెను సలాడ్ నూనెగా పార్గర్తెన్ పరిశ్రమలలో వాడుతారు. టమాట గుజ్జుకు రక్తశుద్ధి మరియు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధులను నయము చేయు గుణము కలదు. భారతదేశములో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో టమాటను పండిస్తున్నారు. ఎక్కువగా వ్యాపార సరళిలో, కర్ణాటకు, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, అస్సాం, మహా రాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రలలో పండిస్తున్నారు.
Also Read: Bacterial Growth: బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడు అంశాలు.!
కారకం: ఈ తెగులు ప్యుపీరియం ఆక్సీస్పోరం లైకోపర్సికై అను శిలీంద్రం వలన కలుగుతుంది.
లక్షణాలు: లేత మొక్కల ఆకులలోని ఈనెలు మామూలు ఆకుపచ్చ రంగును కోల్పోయి పత్రవృంతాలు వాడిపోవును. తరువాత మొక్క పూర్తిగా వాడిపోవును. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పొలంలో ఈ తెగులు ఎప్పుడైనా సోకవచ్చును. తెగులు సోకిన మొక్కలలోని క్రింది ఆకులు పసుపు వర్ణానికి మారి చనిపోవును. తరువాత తెగులు లక్షణాలు పై ఆకులకు కూడా వ్యాపించును. ఈ తెగులు లక్షణాలు పూర్తి మొక్కలోని కానీ, కొన్ని కొమ్మలలోని కాని కనిపించును. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు నాళికా కణావళి. వర్ణానికి మారును. లేత మొక్కలు తెగులుకు తొందరగా గురై వాడిపోయి ముదురు మొక్కలు కొన్ని తెగుల రోజుల వరకు తెగులును తట్టుకొనును. తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోవును. వేర్లకు తెగులు సోకినప్పుడు ప్రక్క వేర్లు నలుపు వర్ణానికి మారి కుళ్ళిచనిపోయిన మొక్కలపై గులాబీ వర్ణపు శిలీంధ్ర పెరుగుదల కనిపించును.
ఉష్ణోగ్రత 28°C తెగులు పోకుటకు అనుకూలంగా ఉండును. నేలలో శిలీంధ్ర బీజాల ద్వారా లేక పూతికాహారంగా మొక్కల అవశేషాలలో జీవించి ఉండును. ఈ శిలీంధ్రం ఒకసారి నేలలోనికి వ్యాపించిన తరువాత దీనిని నివారించుట చాలా కష్టము. తెగులు సోకిన నారు మడిలో మొక్కలను ఆరోగ్యవంతమైన పొలంలో నాటుత వలన, గాలి ద్వారా సన్నని మట్టితో శిలీంద్ర బీజాలు ఒక పొలం నుండి వేరొక పొలానికి వ్యాపించుట వలన, మురుగు నీరు తెగులు సోకిన పొలం నుండి వేరొక పొలానికి పారుత వలన, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు మరియు పరికరాల వలన తెగులు వ్యాప్తి చెందును..
నివారణ:
విత్తనం ద్వారా వ్యాపించే అవకాశం ఉంది కనుక కార్బండిజం 2.5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
నేలను ఎండాకాలంలో లోతుగా దున్నాలి.
మొక్కల అవశేషాలను ఏరి కాల్చివేయాలి.
పంట మార్పిడి పద్ధతి అవలంబన.
4గ్రా. ట్రైకోడెర్మ విరిడి లేదా 2.5 గ్రా. కార్బండిజం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
Also Read: Early blight of tomato: టమాట ఆల్టర్నేరియా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు