(1) ఉష్ణోగ్రత (Temperature):- కొన్ని రకాల బ్యాక్టీరియాలు 25-40°C వద్ద బాగా పెరుగును. వీటిని “మిసోఫిలిక్ బ్యాక్టీరియాలు” అని, కొన్ని రకములు 20°C పెద్ద బాగా పెరుగును. వీటిని సైక్రోఫెలిక్ బ్యాక్టీరియాలు ” అని, మరికొన్ని రకములు 55-60°C వద్ద బాగా పెరుగును. వీటిని “థర్మోఫిలిక్” బ్యాక్టీరియాలు అని అందురు. నిర్దేశించిన పరిస్థితులలో బ్యాక్టీరియాలను చంపుటకు కావాల్సిన ఉష్ణోగ్రతను “థర్మల్ డెత్ పాయింట్” అని అంటారు.
Also Read: Minister Niranajan Reddy: రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’.!
(2) పి.హెచ్ (PH):- P” కూడా బ్యాక్టీరియాల పెరుగుదలకు ప్రభావం చూపుతుంది. చాలా రకాల పాథోజెనిక్ బ్యాక్టీరియాలు 7.2-7.6 పి.హెచ్ వద్ద బాగా పెరుగును. ఎక్కువ బలమైన ఆసిడ్ లేదా ఆల్కలీ బ్యాక్టీరియాలను చంపును.
(3) తేమ లేదా అర్ద్రత (Humidity):- బ్యాక్టీరియాల పెరుగుదలకు ఆర్ధ్రత చాలా అవసరము. కొన్ని స్పోర్ ఫామింగ్ బ్యాక్టీరియాలు తప్ప మిగిలిన బ్యాక్టీరియాలు సూర్యరశ్మి వలన చంపబడును.
(4) ఆక్సిజన్ మరియు ఇతర వాయువులు:- కొన్ని బ్యాక్టీరియాలకు ఆక్సిజన్ అవసరము అగును. వీటిని “ఎరోబిక్ బ్యాక్టీరియా” అని అంటారు. కొద్ది పరిమాణంలో ఆక్సిజన్ అవసరమున్న వాటిని ‘మైక్రోఫెలిక్ బ్యాక్టీరియాలు” అని మరియు ఆక్సిజన్ లేకనే పెరిగే వాటిని “ఎనరోబిక్ బ్యాక్టీరియాలు” అని అందురు. కొన్ని బ్యాక్టీరియాలు ఎరోబిక్ గా ఉండి, కొన్ని సమయాలలో ఆ బ్యాక్టీరియాలు ఆక్సిజన్ లేకుండా కూడా పెరగగలవు. వీటిని “ఫాకల్టిటివ్ ఎనరోల్స్” అని అంటారు. బ్యాక్టీరియాల పెరుగుదలకు కొద్ది పరిమాణంలో కార్బన్ డై ఆక్సైడ్ అవ సరము. బ్రూసెల్లా అబార్టన్ వంటి బ్యాక్టీరియాలకు ఎక్కువ పరిమాణంలో (5-10%) కార్బన్ డై ఆక్సైడ్ అవ సరము.
(5) ఇతర అంశములు:- బ్యాక్టీరియాల పెరుగుదలకు పిండి పదార్థాలు, ప్రొటీనులు, నీరు, ఇన్ ఆర్గానిక్ సార్ట్స్ ముఖ్యంగా సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీసు మరియు కాల్షియం కొన్నింటికి కోబాల్ట్ అవసరము. విటమిన్లు థయామిన్, రైబోఫ్లేవిన్, నికోటినిక్ ఆమ్లం, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ B12 కూడా చాలా అవసరము.
బ్యాక్టీరియాల పెరుగుదల లేదా విభజన జరుగు విధానం:
ఏదేని ఒక బ్యాక్టీ రియాను ఒక మీడియాలో ఇనాక్యులమ్ చేసినప్పుడు, అవి మొదట ఆ మీడియాకు అలవాటు పడి, తరువాత ఆ మీడియాలోని పోషక పదార్థాలను ఉపయోగించుకొని విభజనకు సిద్ధమవుతాయి. ఈ దశనే ల్యాగ్ దశ (విభజన చెందని దశ) అని అంటారు. తరువాత బ్యాక్టీరియాలోని న్యూక్లియస్, కణకవచం సెల్ డివిజన్ పద్ధతి ద్వారా రెండు కొత్త బ్యాక్టీరియాలుగా తయారగును. ఈ దశనే లాగ్ దశ (విభజన చెందు దశ) అని అంటారు. బ్యాక్టీ రియాల విభజన సమయం బ్యాక్టీరియా రకం, మీడియా రకం మరియు ఇతర అంశాల మీద అధారపడి వుంటుంది. సహజంగా విభజన సమయం 20 నిమిషాలు ఉంటుంది. అంటే ఒక గంటకు 3 విభజనలు జరిగి, ఒక బ్యాక్టీరియా 8 బ్యాక్టీరియాలుగా తయారగును. 3 గంటల తరువాత 512 బ్యాక్టీరియాలు, 7 గంటల తరువాత సుమారు ఒక మిలియన్ బ్యాక్టీరియాలు తయారగును.
ఈ దశ తరువాత విభజన చెందే బ్యాక్టీరియాలు మరియు మరణించే బ్యాక్టీరియాలు సమానంగా ఉంటాయి. ఫలితంగా బ్యాక్టీరియాల సంఖ్య సమానంగా ఉంటుంది. దీనినే స్టేషనరీ దశ అని అంటారు. దీనికి ప్రధాన కారణం మీడియాలోని పోషకాలు తగ్గిపోవడం మరియు మీడియాలో బ్యాక్టీరియాల వలన ఉత్పత్తి అయిన విష పదార్థాలు ఎక్కువ అవడం. ఈ దశ తరువాత బ్యాక్టీరియాల విభజన పూర్తిగా ఆగి పోయి, విభజన చెందియున్న బ్యాక్టీ రియాలు మీడియాలో పోషక పదార్థాల ఫలితంగా చనిపోవడం జరుగుతుంది. ఫలితంగా మీడియాలో బ్యాక్టీరియాల సంఖ్య తగ్గిపోతుంది. దీనినే డిక్లైన్ దశ లేదా డెత్ దశ అని అంటారు.
Also Read: Asiatic Class Hens: అధిక మాంసం ఇచ్చే ఎసియాటిక్ తరగతి కోళ్ళ రకాలు మరియు లక్షణాలు.!