సాహివాల్
Sahiwal cow ఈ జాతి పశువులు ప్రస్తుతం పాకిస్తాన్లో అభివృద్ధి చెందాయి. మన దేశంలో ఈ ఆవులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో పెంచబడుతున్నాయి. వీటి శరీరం పై గల చర్మం వదులుగా ఉండడం వలన ఈ రకపు ఆవులను లోలా రకపు ఆవులు అని కూడా అంటారు. బాడీ సిమెంట్రికల్గా ఉండి పెద్ద తల చిన్నటి కొమ్ములు ఉంటాయి. మగ వాటిలో మూపురం చాలా పెద్దదిగా ఉంటుంది. ఫోర్ హెడ్ డిష్ ఆకారంలో ఉండును. పెద్ద తల ఉండి కాళ్ళు. ధృడంగా శరీరానికి గట్టిగా అతుక్కొని ఉండును. పొదుగు విశాలంగా ఉండి చక్కటి టీట్స్ కలిగి ఉంటాయి. ఈ పశువులు వర్ణం ఎరుపు రంగులో ఉండి అక్కడక్కడ తెల్లని మచ్చలు ఉంటాయి.
ఉత్పాదక లక్షణములు:- ఇవి మన దేశంలో ఉన్న ఆవులలో ఎక్కువ పాలిచ్చు శక్తి కలిగినవి. ఒక పాడి కాలంలో 4075 కి.గ్రా పాలను ఉత్పత్తి చేస్తాయి. పాలలో వెన్న శాతం సగటున 4 – 4.5 శాతం వరకు ఉండును. మొదటి దూడను వెయ్యడానికి 41 నెలలు పట్టును.
రిమార్క్స్ :- ఈ జాతి ఆవులు శ్రీలంక, లాటిన్ ఆమెరికా, కెన్యా, వెస్ట్ ఇండియా మొదలగు దేశాల వారు వీటిని దిగుమతి చేసుకొని వారి దేశపు ఆవులను సంకరం చేయుటకు ఉపయోగిస్తున్నారు.
గిర్ జాతి :- (కథియా వర్తి, సూర్తి, డెక్కన్ )
ఇది గుజరాత్ రాష్ట్రంలోని కథియావత్ ప్రాంతంలోని గిర్ అడువులకు చెందినది. ఈ జాతి పశువులు చూడడానికి బాగుండి, బాడీ సైజు మధ్యస్థంగా ఉంటుంది. వీటి శరీర అమరిక బాగుంటుంది. ఇవి సాధారణంగా సాదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. చెవులు కర్లింగ్ లీఫ్ ఆకారంలో ఉంటాయి. తల పొడవుగా ఉండి వెనుక ప్రాంతం నిలువుగా మరియు సమాంతరంగా ఉండుట గిర్ జాతి ఆవుల లక్షణము. ఆడ పశువులు సగటున 386 కి.లో గ్రాములు, మగ పశువులు 546 కి.లో గ్రాముల శరీర బరువును కలిగి ఉంటాయి. వీటి శరీరపు వర్ణం తెలుపు, ఎరుపు, చాక్లెట్, బ్రౌన్ మరియు కొన్ని సందర్భాలలో నలుపు ప్యాచెస్ కూడా కలిగి యుంటాయి.
ఉత్పాదక లక్షణములు :- ఈ ఆవులు ఒక పాడి కాలంలో 3182 కిలోల పాలను ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం కలిగి యుంటాయి. మొదటి దూడను వెయ్యుటకు 51 నెలల సమయం పట్టును. మగ పశువులు (ఎద్దులు) మంచి పని చేయు సామర్థ్యం కలిగి యుంటాయి.
రిమార్క్స్: గిర్ ఎద్దులను ఇతర స్వదేశి ఆవులపై ప్రయోగించి మేవతి, డియోని, నిమారి అనే జాతులను మన దేశంలో అభివృద్ధి పరిచినారు.