Tobacco ఇండియాలో పెంచే ముఖ్య మత్తు, ఉత్తేజము కల్గించే పదార్థాలు పంటలలో పొగాకు ఒకటి. ఈ పంటను దాని ఆకుల కోసం పెంచుతారు. వాటిని పదును చేసిన తరువాత పైపు కాల్చడానికి చుట్ట, సిగరెట్, హుక్కా, పీల్చడానికి నశ్యంగాను అనేక రూపాలలో నమలడానికి ఉపయోగిస్తారు.పొగాకు అనేక రకాల పరిస్థితులలో పెంచుతారు. ఉష్ణమండలం నుండి ఉప ఉష్ణమండలం, సమశీతోష్ణమండలం వరకు విస్తరిస్తుంది.
టొబాగ్స్ అనే చిన్న ద్వీపంలో దిగిన తరువాత కొలంబస్ అతని అనుయాయులు, అక్కడి ప్రజలు ఎండిన ఆకును పొడిచేసి ఆహ్లాదంగా ముక్కుతో పీల్చడం లేదా ఎండిన ఆకులు చుట్ట చుట్టి పెదవుల మధ్య పెట్టుకుని ఒక వైపు అంటించి దానిని నోటి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ పీల్చిన తరువాత వెంటనే పొగను బయటకు వదులుతారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు కొలంబస్. అతని మనుషులు కూడా తమకు తామే అలా చేసి ఆ మత్తుకు చాలా సంతోషించారు. కొన్ని గింజలు, ఆకులు తమతో పాటు స్పైయిన్కు తీసుకుపోయారు. ఆ విధంగా పొగాకు యూరప్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. ఇండియాలో పొగాకును “పోర్చుగీసువారు 17 వ శతాబ్దం మొదట్లో ప్రవేశపెట్టారని చెప్తారు. ప్రపంచంలో ఇతర చోట్లవలె ఇక్కడ కూడా. చాలా అశ్రద్ధ చేసినప్పటికీ సామాజిక ఆమోదం లేనప్పటికీ అది నిలదొక్కుకుంది. దాని సాగు ఇ దేశంలో ఆన్ని ప్రాంతాలను విస్తరించింది. మొత్తం విత్తిన విస్తీర్ణంలో ఈ పంట విస్తీర్ణం 8.3 లక్షల హెక్టార్లు, ఇది భారత దేశంలో అత్యంత విలువైన పంటలలో ఒకటి.
వాతావరణం :
వర్షపాతం, ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత, గాలి, సూర్యరశ్మి వంటి శీతోష్ణస్థితి కారకాలు పొగాకు యొక్క పెరుగుదలను, పుష్పించటాన్ని ప్రభావితం చేస్తాయి. సగటు ఉష్ణోగ్రతలు *70-90° (F) ఫారెన్‌హీట్ 80-120 రోజుల పాటు ఉండే ప్రాంతాలలో దీన్ని పెంచవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పంటను శీతాకాలంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు విత్తుతారు.అప్పుడు ఉష్ణోగ్రతలు అనువుగా వుంటాయి. ఈ పంట నేలలో నీరు ఎక్కువగా ఉన్న లేదా నీరు నిలిచిన పరిస్థితులకు అధికంగా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుంది. వేరు వ్యవస్థ అభివృద్ధికి ఆవశ్యకమైన ఆక్సిజన్ నేలలో లేకపోవటమే ఇందుకు కారణము. పంట పెరిగే కాలంలో వర్షపాతం భారీగా లేకుండా వితరణ చేంది వుంటే వర్షాధార పంట వేయుటకు తేలిక నేలలను ఉపయోగించవచ్చు. శీతాకాలంలో పంటను ఊడ్చే కాలంలోకి ఋతుపవనం విస్తరిస్తే నాటడం ఆలస్యం అయి పంటకు దెబ్బతగులుతుంది. కాగా జలాధార సంవత్సరంలో మందంగా ముదురు రంగులో వుండి ఎక్కువ నత్రజని, నికోటిన్ అంశం వున్న తక్కువ నాణ్యత గల ఆకు ఉత్పత్తి అవుతుంది. ఊడ్చిన తరువాత పంట తొలిదశలో తేలికపాటి జల్లులు లాభదాయకంగా ఉంటాయి. కానీ కావడానికి సిద్ధంగా ఉన్నపుడు తేలిక జల్లు పడితే ఆకు శ్రేణి, రసాయన రచన విషయంలో తక్కువ నాణ్యత సంభవిస్తాయి. పంట గాలీ వానకు సుగ్రాహ్యం. సాపేక్ష ఆర్ద్రత, పొగాకు నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి ఎఫ్.సి.వి (F.C.V) చుట్టల రకాలను సున్నితమైన, పలుచని స్థితిస్థాపకత గల ఆకు పక్వం అయ్యేటప్పుడు అధిక పాపిక్ష ఆర్ద్రత ఉత్పన్నమే. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాపిక, అర్ధత. ఉష్ణోగ్రతలలో పగటిపూట వైవిద్యాలు పంట పెరుగుదలను, నాణ్యతను ప్రభావితం చేస్తాయి.